బాబుకు తెలిసిన సత్యమే అయినా?

చంద్రబాబు ఇపుడు బాగా టెన్షన్ మీద ఉన్నారు. ఆయనకు ఓవైపు పార్టీ ఏమైపోతుంది అన్న చింత ఉంటే మరో వైపు ఏడాదికాలంలోనే టీడీపీ బలాన్ని, బలగాన్ని నిర్వీర్యం [more]

Update: 2020-06-22 03:30 GMT

చంద్రబాబు ఇపుడు బాగా టెన్షన్ మీద ఉన్నారు. ఆయనకు ఓవైపు పార్టీ ఏమైపోతుంది అన్న చింత ఉంటే మరో వైపు ఏడాదికాలంలోనే టీడీపీ బలాన్ని, బలగాన్ని నిర్వీర్యం చేసే పనిలో జగన్ పడడంతో ఎన్నడూ చూడని వేడి వేడి రాజకీయ సన్నివేశాలు పసుపు పార్టీలో కనిపిస్తున్నాయి. ఇక చంద్రబాబుకు వయోభారానికి తోడు పార్టీ నేతల సహాయక నిరాకరణ మరో తలనొప్పిగా ఉంది. ఇంకోవైపు చూసుకుంటే కరోనా మహమ్మారి ఉండడంటో జనంలోకి ఇదివరకులా వెళ్ళలేకపోతున్నారు. మొత్తానికి చూసుకుంటే టీడీపీలో చంద్రబాబు ఓ విధంగా అష్టావధానం చేస్తున్నారు.

ఆపేది ఒక్కరేనా…?

ఇపుడు చంద్రబాబు ఉన్న పరిస్థితులకు కారణం జగన్ దూకుడు. జగన్ చేయాల్సింది తాను చేసుకుంటూ పోతున్నారు. ఆ విషయంలో ఎవరి మాటా వినరు. ఆయనకు ఎవరూ లెక్కలేదని మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి అంటున్నారు. జగన్ కి దేవుడు భయం లేదు, మరేదీ ఆయనకు అడ్డుకాదు అని కూడా జగన్ చెప్పేస్తున్నారు. ఆయనే రాజు, ఆయనే మంత్రి అని కూడా అంటున్నారు. కానీ జగన్ ని ఆపగలిగే శక్త్రి ఈ భూప్రపంచంలో ఒక్కటే ఉందిట. అదే మోడీ శక్తి. మోడీ వల్లనే జగన్ ని కట్టడి చేయడం అవుతుందని జేసీ తరుణోపాయం చంద్రబాబుకు చెబుతున్నారు.

వింటారట….

జగన్ కి ఈ భూప్రపంచంలో ఎవరూ చెప్పేవారు లేరు. ఆయన సర్వశక్తి సంపన్నుడు అని కూడా జేసీ అంటున్నారు. అయితే మోడీ మాట మాత్రం జగన్ వింటారని అంటున్నారు. అయితే అది మోడీ మీద ఉన్న భయమో, భక్తో కాదట. సీబీఐ కేసులు కారణంగానే జగన్ మోడీ చెబితే దారికి వస్తారని అంటున్నారు. ఇదే మాటను ఆయన గతంలో కూడా చెప్పారు. ఇపుడు తన తమ్ముడు జేసీ ప్రభాకరరెడ్డి అరెస్ట్ కావడంతో ఇంకా గట్టిగా చెబుతున్నారు. అది చంద్రబాబు వినాలని కూడా ఒకటికి పదిసార్లు చెబుతున్నారు.

శరణు కోరాలా?

అయితే మోడీ ఏమీ చంద్రబాబు చుట్టం కాదు, పైగా గత ఎన్నికలకు ముందు చంద్రబాబు మోడీతో సున్నం పెట్టుకుని ఉన్నారు. అయితే ఓడిన తరువాత మాత్రం బాబు మోడీకి జై అంటున్నారు. అయినా సరే అటునుంచి స్పందన లేదు. చంద్రబాబుని మోడీ నమ్ముతారా లేదా అన్నది పక్కన పెడితే బాబుకు మాత్రం మోడీ అవసరం కచ్చితంగా ఉందని జేసీ మాటల బట్టి అర్ధమవుతోంది. నిజానికి మోడీని శరణు కోరమనే జేసీ మాటలకు అర్ధం. మరి చంద్రబాబు వరకూ శరణు కోరేందుకు సిధ్ధంగానే ఉన్నట్లుగా సీన్ ఉంది. ఆయన బీజేపీతో సమరమే లేద‌ని తెల్ల జెండా చూపుతున్నారు. కానీ అటునుంచి ఎలా నరుక్కురావాలో తెలియడంలేదు. మొత్తానికి మోడీకి మొక్కుకుంటే తప్ప ఏపీలో జగన్ దూకుడు ఆగదని చంద్రబాబుకు తెలిసిన సత్యమే జేసీ మళ్ళీ మళ్ళీ వల్లెవేస్తున్నాడు. ఇక బాబుకి మోడీ ప్రసన్నం ఒక్కటే ఇపుడు తరువాయిగా ఉంది.అది జరిగేపనేనా

Tags:    

Similar News