ఆశ్చర్యం…. ఇంత మార్పా…?

అనుభ‌వం ఎంత‌టి వారికైనా పాఠం నేర్పుతుంది..! ఇప్పుడు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే త‌ర‌హా మార్పు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు త‌మ్ముళ్లు. ఎన్నిక‌ల‌కు [more]

Update: 2019-11-17 09:30 GMT

అనుభ‌వం ఎంత‌టి వారికైనా పాఠం నేర్పుతుంది..! ఇప్పుడు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే త‌ర‌హా మార్పు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు త‌మ్ముళ్లు. ఎన్నిక‌ల‌కు ముందు, ఐదేళ్ల పాటు నిరా ఘాటంగా అధికారంలో ఉన్నప్పుడు, త‌ర్వాత ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్పుడు కూడా పార్టీలోని కీల‌క నేత‌ల‌తో త‌ప్ప చంద్రబాబు పెద్దగా ఎవ‌రితోనూ మాట్లాడింది లేదు. వారి స‌మ‌స్యలు ఆల‌కించింది లేదు. ఇక‌, సుధీర్ఘ కాలం పార్టీలో ఉండి సేవ‌లు అందించిన నాయ‌కుల‌కు కూడా చంద్రబాబు ద‌ర్శనభాగ్యం అంతంత మాత్రమే. ఇక‌, ద‌ర్శన‌మే అంతంత అయిన‌ప్పడు వారి కోరిక‌లు నెర‌వేరే ప‌రిస్థితి ఎక్కడ ఉంది.

మారరని అనుకుంటే….?

ఇలాంటి నేప‌థ్యంలోనే పార్టీలో అనేక‌మంది నాయ‌కులు త‌మ డిమాండ్లను చెప్పలేక పోయారు. త‌మ స‌మస్యల‌ను చంద్రబాబుతో పంచుకునే అవ‌కాశం లేక ఇబ్బంది ప‌డ్డారు. ఇదే ప‌ద్ధతిని చంద్రబాబు ఇటీవల ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత కూడా కొన‌సాగించారు. అయితే, ఇక‌, చంద్రబాబు ఇప్పట్లో మార‌డ‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన నాయ‌కులు చాలా మంది పార్టీ నుంచి జంప్ చేయ‌డం ప్రారంబించారు. తోట త్రిమూర్తులు నుంచి వ‌ల్లభ‌నేని వంశీ వ‌ర‌కు చాలా మంది పార్టీని వ‌దిలేశారు. దీంతో షాకైన చంద్రబాబు ఇప్పుడు త‌న ప‌ద్ధతిని మార్చుకున్నారు. నేనున్నాను! అంటూ.. తమ్ముళ్లకు ట‌చ్‌లోకి వ‌స్తున్నారు.

సమస్యలు తెలుసుకుంటూ….

వారి స‌మ‌స్యలు వినేందుకు స‌మ‌యం కేటాయిస్తున్నారు. ముఖ్యంగా వివిధ కేసుల్లో జైలు పాలైన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌, ఐటీ దాడులు ఎదుర్కొన్న గొట్టిపాటి ర‌వి, బీద మ‌స్తాన్ రావు సోద‌రులు.. సీబీఐ కేసును ఎదుర్కొంటున్న గుర‌జాల మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు వంటి వారిని ప‌రామ‌ర్శిస్తున్నారు. వారి స‌మ‌స్యలు తెలుసుకుంటున్నారు చంద్రబాబు. నేనున్నాను… ఈ స‌మ‌స్యలు తాత్కాలిక‌మే అంటూ వారిలో భ‌రోసా నింపే ప్రయ‌త్నం చేస్తున్నారు. జైల్లో ఉన్న చింత‌మ‌నేని ద‌గ్గర‌కు త‌న కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్‌ను పంపారు. తాను కూడా సందేశం ఇచ్చారు.

అనూహ్యంగా…..

ఇక‌, రేపో మాపోతానే స్వయంగా జైలుకు వెళ్లి ప‌రామ‌ర్శించాల‌ని నిర్ణయించుకున్నారు. ఇలాంటి మార్పు అవ‌స‌ర‌మే. నాయ‌కులు కూడా దీనినే కోరుకున్నారు. అయితే, ఇన్నాళ్లు పార్టీ నేత‌ల‌ను వ‌దిలి కేవ‌లం త‌న హ‌వాతోనే నెట్టుకురావాల‌ని ప్రయ‌త్నించిన చంద్రబాబులో అనూహ్యమైన ఈ మార్పు చూసి.. త‌మ్ముళ్లు ఆశ్చర్యానికి గుర‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News