వైసీపీకి కావాల్సింది అదేనా…?

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు పరిస్థితి దయనీయం. మూడు మార్లు ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి శాసనసభలో సీనియర్ నేతగా ఉన్న వ్యక్రి ఇపుడు అక్కడ పడరాని మాటలు [more]

Update: 2019-07-19 06:30 GMT

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు పరిస్థితి దయనీయం. మూడు మార్లు ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి శాసనసభలో సీనియర్ నేతగా ఉన్న వ్యక్రి ఇపుడు అక్కడ పడరాని మాటలు పడుతున్నారని తమ్ముళ్ళు వాపోతున్నారు. మరో వైపు చేసుకున్న వారికి చేసుకున్నంత అంటున్నారు వైసీపీ నాయకులు. ఏది ఏమైనా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడును ఓ ఆట ఆడేసుకుంటున్నారు. బాబుకు ఉన్నది అచ్చంగా 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. అందులో కూడా ఆయన వైపు నిలబడి గట్టిగా మాట్లాడేవారు పెద్దగా ఎవరూ లేరు. మరో వైపు మితిమీరిన బలంతో ఉన్న అధికార పక్షం ఇదే సందు అంటు చంద్రబాబు నాయుడు మీద వరస బాణాలు వేస్తోంది. ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి, అంబటి రాంబాబు బాబుకు సుద్దులు చెబుతూ ఆయన గత పాలన నాటి ముచ్చట్లు గుర్తుచేస్తూంటే చంద్రబాబు నాయుడు తెగ బాధపడాల్సింది మరి. చంద్రబాబు నాయుడుకు ఇపుడు ఇదే అసహనాన్ని పెంచుతోంది. పదే పదే ఆయన మాటల్లో చేతల్లో నియంత్రణ తప్పుతున్నారు. తన అనుభవాన్నే తానే అవమానించేలా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఇదే ఇపుడు వైసీపీ సర్కార్ కి కూడా కావాల్సింది.

స్పీకర్ తో చెప్పించుకునే స్థాయిలో…

తాను దేశంలోనే సీనియర్ని అంటూ చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇపుడు స్పీకర్ చేత క్లాసులు తీసుకుంటున్నారు. ఒకనాటి టీడీపీ తమ్ముడే ఇపుడు అసెంబ్లీ స్పీకర్. అదొక రకంగా చంద్రబాబు నాయుడుకు మంటగా ఉంటే ఆ స్పీకర్ బాబుకు సభా సంప్రదాయాల గురించి చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు ముందు పద్ధతిగా ఉండాలని కూడా ఆదేశిస్తున్నారు. తనకే రూల్స్ చెప్పవద్దంటూ తమ్మినేని సీతారాం చంద్రబాబు నాయుడు వైపు తర్జని చూపించి హెచ్చరిస్తూంటే బిత్తరపోవడం బాబు వంతు అవుతోంది. ఇక అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుబు అపుడే సౌండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చి ఎక్కువ రోజులు కాలేదు. జగన్ పాలన ఇంకా తెలియాల్సివుంది. ఈ పాటి దానికే ఆవేశపడిపోయి బాబు మీరెంచేస్తారు అంటూ ప్రతీ దానికి ప్రశ్నిస్తూ పోతున్నారు. తనని తాను తగ్గించుకుంటున్నారు.

పక్కా వ్యూహంతోనే…..

ఇక అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుని ఎదుర్కోవడం ఇపుడున్న పరిస్థితుల్లో వైసీపీకి నల్లేరు మీద నడక. ఆ పార్టీకి మొత్తానికి మొత్తం హౌస్ లో బలం ఉంది. అయినా సరే చంద్రబాబు నాయుడుని వైసీపీ సీరియస్ గానే తీసుకుంటోంది. చంద్రబాబు నాయుడు అడిగిన ప్రతీ ప్రశ్నకూ జవాబు చెప్పాలని జగన్ భావిస్తున్నారు. మంత్రులకు కూడా అలాగే ఆదేశాలు ఆయన జారీ చేశారు. చంద్రబాబు నాయుడు ఏది అడిగినా తిరిగి ఆయన పాలనకే అంటకడుతూ వైసీపీ నేతలు గట్టిగానే బదులిస్తున్నారు. దీంతో చంద్రబాబు నాయుడుకు మ‌నో వేదన బాగా పెరిగిపోయి అది అసహంగా మారుతోంది. ఇలా చూసి చూసి ఓ దశలో బాబు అసెంబ్లీకి రాం రాం అనేసేలా ఉన్నారంటున్నారు. అచ్చంగా వైసీపీకి కావాల్సింది అదే. ఏ అచ్చెన్నకో, బుచ్చెన్నకో పార్టీ బాధ్యతలు అప్పగించి బాబు తప్పుకుంటే ఇక ఏపీ అసెంబ్లీలో టీడీపీ మరిన్ని చిక్కుల్లో పడుతుంది. ఈ మాస్టర్ ప్లాన్ నే పక్కాగా ఇపుడు వైసీపీ అమలుచేస్తోందంటున్నారు.

Tags:    

Similar News