పీక్స్ లోకి ఫ్రస్టేషన్

తెలుగుదేశం పార్టీ నాయకులకు ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్ళిపోతోంది. అధికారం శాశ్వతం అని భావించిన పసుపు పార్టీ తమ్ముళ్లకు కళ్ళు బైర్లు కమ్మేలా తీర్పు రావడంతో తట్టుకోలేకపోతున్నారు. [more]

Update: 2019-08-08 12:30 GMT

తెలుగుదేశం పార్టీ నాయకులకు ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్ళిపోతోంది. అధికారం శాశ్వతం అని భావించిన పసుపు పార్టీ తమ్ముళ్లకు కళ్ళు బైర్లు కమ్మేలా తీర్పు రావడంతో తట్టుకోలేకపోతున్నారు. తమను ఓడించిన జనాలనే నిందించడం ఇక్కడ విశేషం. ఎన్నికలు జరిగి నాలుగు నెలలు అయ్యాయి. ఫలితాలు వచ్చి మూడు నెలలు అయ్యాయి. అయినా టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం ఎందుకు ఓడిపోయామో అర్ధం కావడంలేదు. తాజాగా గుంటూర్లో జరిగిన పార్టీ మీటింగులోనూ ఆయన ఇదే విషయం చెబుతున్నారు. మరి తనను తాను వంచించుకుంటున్నారో లేక క్యాడర్ని మభ్యపెడుతున్నరో కానీ చంద్రబాబు చేయాల్సిన కామెడీ అంతా చేస్తున్నారు.

తప్పు చేయకపోయినా శిక్ష….

తాను అయిదేళ్ళ పాటు అన్ని రకాలుగా మంచిగా పాలించానని చంద్రబాబు అంటున్నారు. పట్టిసీమకు నీళ్ళు తెచ్చి కృష్ణాకు ఇవ్వడం తప్పా, అన్న క్యాంటీన్లు పెట్టడం తప్పా, పోలవరం తొందరగా పూర్తి చేయాలనుకోవ‌డం తప్పా, అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దాలనుకోవడం తప్పా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. తాను ఇచ్చిన పట్టిసీమ నీళ్ళు తాగుతూ జగన్ కి ఎలా ఓటు వేస్తారని బాబు డైరెక్ట్ గానే ఏపీ ప్రజలను నిలదీస్తున్నారు. తన చేత అన్ని పనులూ చేయించుకుని అధికారం మాత్రం వైసీపీకి ఇస్తారా అంటూ ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు. ఇది పధ్ధతేనా అని కూడా ఆవేశపడిపోతున్నారు. తనకు 23 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడమేంటి అంటూ మండిపోతున్నారు చంద్రబాబు.

చినబాబుది ఇదే రూట్….

అచ్చం చంద్రబాబులాగానే చినబాబు వైఖరి కూడా ఉంది. ట్వీట్లతో లోకేష్ కోట్లాది ఏపీ ప్రజలనే నిలదీస్తున్నారు. హాయిగా ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్లు ఇచ్చే చంద్రబాబుని కాదనుకుని జగన్ కి ఓటేస్తే టైం కి పించన్లు ఇవ్వడం లేదుగా అంటూ సెటైర్లు వేస్తున్నారు. పేదలకు బువ్వ కోసం అన్న క్యాంటీన్లు టీడీపీ పెడితే ఆ ముద్దను తింటూ రావాలి జగన్ అన్నారు, ఇపుడేమైంది అంటూ ఎద్దేవా చేస్తున్నారు. పరిపాలనాదక్షుడైన చంద్రబాబుని కాదనుకుని ఏపీ నష్టపోయిందని కూడా లోకెష్ అంటున్నారు. మొత్తానికి చూస్తే తండ్రీ కొడుకులు ఇద్దరూ ప్రజా తీర్పుని అవహేళన చేస్తున్నారు. తమను ఓడించినందుకు మీకు బాగా జరిగిందా అంటూ ఎకసెక్కం ఆడుతున్నారు. దేశంలో చాలా చోట్ల అధికార పార్టీ ఓడింది. కానీ ఈ తీరున జనాలను తప్పు పట్టిన నాయకులు లేరు. మళ్ళీ జనం వద్దకే వెళ్ళి తప్పు చేశామని చెప్పుకుని వారి మన్నమ పొందే రాజకీయమే ఇంతవరకూ చూశాం, ఇపుడు ఏపీలో టీడీపీ పుణ్యమాని కొత్తరకం రాజకీయం నడుస్తోంది, పార్టీలు, నాయకులు అయిపోయారు, ఓటేసినందుకు, ఓడించినందుకు జనాన్నే టార్గెట్ చేయడం నయా ట్రెండ్ గా ఉంది. ఇదే ధోరణిలో వెళ్తే టీడీపీకి అది ఎంతవరకూ ఉపయోగమో ఆ పార్టీ నాయకత్వమే నిర్ణయించుకోవాలి.

Tags:    

Similar News