సెంటిమెంట్ రంగరించారే

వారిద్దరిది ఐదేళ్ళ స్నేహమే. జీవితకాల మిత్రులు కానే కాదు. అది కూడా ఇద్దరు ఒక పార్టీలో వున్నప్పుడు మాత్రమే. ఇద్దరి మిత్రుల పార్టీలు వేరు అయ్యాయి. సిద్ధాంతాలు [more]

Update: 2019-07-19 03:30 GMT

వారిద్దరిది ఐదేళ్ళ స్నేహమే. జీవితకాల మిత్రులు కానే కాదు. అది కూడా ఇద్దరు ఒక పార్టీలో వున్నప్పుడు మాత్రమే. ఇద్దరి మిత్రుల పార్టీలు వేరు అయ్యాయి. సిద్ధాంతాలు వేరు. కానీ లక్ష్యం ఒక్కటే. రాజకీయంగా అత్యున్నత స్థాయికి చేరుకోవడమే. దానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గం అనుసరించారు. సొంత మామ పై పోటీ చేసి గెలుస్తా అని తిరిగి ఆయన చెంతన చేరి అవకాశం సృష్ట్టించుకుని ఆశించిన ముఖ్యమంత్రి స్థానం అందుకున్నారు. దీనికి వెన్నుపోటు అని ప్రత్యర్ధులు హేళన చేసినా ఆయన పట్టించుకోలేదు. దానికి ఆయన తగిలించుకున్న పేరు పార్టీని కాపాడుకున్నాం అనే ట్యాగ్ లైన్. ఆయనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.

ఈయన దారి మాత్రం రహదారి ….

ఆయన మిత్రుడు నమ్ముకున్న పార్టీలోనే కొనసాగారు. గ్రూప్ ల మయంగా వుండే పార్టీలో ఒకే ఒక్కడుగా అవతరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి పదవిని రెండు సార్లు చేపట్టారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో అకాల మృత్యువు పొందే వరకు చంద్రబాబు వైఎస్ నడుమ ఉప్పు నిప్పులాగే పరిస్థితి కొనసాగేది. ఇదంతా చరిత్ర. ఇప్పుడు ఆ చరిత్ర గుర్తుకు వచ్చేలా చంద్రబాబు కు వైఎస్ కుమారుడు ప్రస్తుత ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న టార్చర్ పని చేసిందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.

స్నేహితుడు కుమారుడికి …

ఇద్దరం ప్రాణ స్నేహితులం. ఒకే రూమ్ లో ఉండేవారం. అలాంటి తండ్రి స్నేహితుడి ని ఇలా ఇక్కట్లు పాలు చేస్తావా అంటూ సెంటిమెంట్ ముడిపెట్టారు ఇప్పుడు మాజీ సిఎం చంద్రబాబు. అదే విషయం ఇప్పుడు వైసిపి గుర్తు చేస్తుంది. వైఎస్ మరణం తరువాత చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలిపి కేసులు పెడుతూ అడుగడుగునా చుక్కలు చూపించారని గుర్తు చేస్తున్నారు. మరి అప్పుడు స్నేహితుడు కుమారుడు తండ్రి పోయిన కష్టాలలో వున్నాడని ఎందుకు మరిచిపోయారని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ కి బాబు కి పోలికే లేదని ఇప్పుడు ఆయనకు కష్టాలు చుట్టుముట్టడంతో రాజశేఖర రెడ్డి కళ్ళముందు కనిపించారని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చంద్రబాబు చేసిన పనులకు ఇంకా ఎన్నో చవిచూడవలిసి ఉంటుందని వారు చెప్పడం చూస్తే టిడిపి అధినేతకు ఇంకెన్ని సార్లు వైఎస్ స్నేహం గుర్తుకు వస్తుందో చూడాలి.

Tags:    

Similar News