టీడీపీ ఎన్నిక‌ల టీం రెడీ అయిపోతుంది..?

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ముంచుకు వ‌స్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ టీడీపీ విజ‌యం సాధించాల్సిన అవ‌స‌రం ఉంది. దీంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆ దిశ‌గానే అడుగులు వేస్తున్నారు. గ‌త [more]

Update: 2018-12-29 03:30 GMT

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ముంచుకు వ‌స్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ టీడీపీ విజ‌యం సాధించాల్సిన అవ‌స‌రం ఉంది. దీంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆ దిశ‌గానే అడుగులు వేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ఇప్పుడు రాబోయే ఎన్నిక‌ల‌కు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో ద్విముఖ పోటీ మాత్ర‌మే ఉంది. టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ అనే కోణంలోనే ఎన్నిక‌ల కురుక్షేత్రం సాగింది. ఇక‌, అప్ప‌ట్లో చంద్ర‌బాబుకు కొండంత బ‌లంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. న‌రేంద్ర‌మోడీ వ్య‌వ‌హ రించారు. దీంతో ఆయ‌న అప్ప‌టి ఎన్నిక‌ల్లో సునాయాసంగా విజ‌యం సాధించారు. దీనికితోడు ఆయ‌న అనుస‌రించిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌ర‌ళి, ఎంచుకున్న బృందం కూడా క‌లిసి వ‌చ్చాయి.

పవన్ ఎంట్రీతో….

అయితే, ఇప్పుడు ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌లు ద్విముఖం నుంచి త్రిముఖ పోటీగా మారాయి. జ‌న‌సేన‌-వైసీపీ-టీడీపీ మ‌ధ్యే పోరు ఎక్కువ‌గా సాగ‌నుంది. అంతేకాదు… కొన్ని జిల్లాల‌ను టార్గెట్ చేసుకున్న ప‌వ‌న్ అక్క‌డ టీడీపీ సంప్ర‌దాయ ఓటు బ్యాంకును త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనికితోడు సామాజిక వ‌ర్గ ప్ర‌భావం మ‌రింత ఎక్కువ‌గా వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌నిపించ‌నుంది. ఇక‌, జ‌గ‌న్ కూడా ఇదే త‌ర‌హాలో రాజ‌కీయం చేస్తున్నా.. ఈయ‌న‌కు గ‌తంలో ఉన్న ప్ర‌భావమే ఉంటుంద‌ని చెబుతున్నారు. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను ఎదుర్కొన్న విధంగానే ఇప్పుడు టీడీపీ పావులు క‌దిపితే చాల‌నేది నాయ‌కుల మ‌నోగ‌తం.

శిక్షణ ఇప్పించి….

కానీ, ప‌శ్చిమ‌, తూర్పు గోదావ‌రి జిల్లాలు, శ్రీకాకుళం, విజ‌య‌న‌గరం, అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల్లో ప‌వ‌న్ హ‌వాను త‌ట్టు కునేందుకు ప్ర‌త్యేకంగా వ్యూహాల‌ను సిద్ధం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు త‌మ్ముళ్లు. ఈ క్ర‌మంలోనే ఆయా జిల్లాల్లో మెరిక‌ల్లాంటి మాట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే వారి కోసం చంద్ర‌బాబు గాలిస్తున్నారు. అవ‌స‌ర‌మైతే.. తెలంగాణాలో టీడీపీ నాయ‌కులు నున్నూరి న‌ర్సిరెడ్డి వంటి వారిని ఏపీకి తీసుకు వ‌చ్చి ఎన్నిక‌ల వేళ ప్ర‌తిప‌క్షాల‌ను ఎలా ఎండ‌గ‌ట్టాలి? ప్ర‌జ‌ల‌ను ఎలా ఆక‌ర్షించాల‌నే విషయంపై స్వ‌ల్ప శిక్ష‌ణ ఇప్పించాల‌ని కూడా చూస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

నోరున్న నేతల కోసం….

ఎన్నిక‌ల్లో విప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్ట‌డంతో పాటు టీడీపీ అమ‌లు చేస్తోన్న ప్ర‌జాసంక్షేమ ప‌థ‌కాలు బ‌లంగా జ‌నాల్లోకి తీసుకు వెళ్లేందుకు ఇలాంటి నాయ‌కుల అవ‌స‌రం చాలా ఉంద‌ని బాబు భావిస్తున్నారు. ఏదేమైనా రాష్ట్రంలో నోరున్న , మాట‌కారి నాయ‌కుల‌కు కొన్ని జిల్లాల‌ను అప్ప‌గించాల‌ని బాబు భావిస్తున్నారు. అయితే, ఈ బృందంలో ఎవ‌రుంటారు? అనేది ఇంకా స్ప‌ష్టం కాక‌పోయినా.. త్వ‌ర‌లోనే దీనిపై మ‌రింత క‌స‌ర‌త్తు చేయ‌నున్నార‌ని స‌మాచారం.

Tags:    

Similar News