బాబు డిమాండ్ కి నైతికత ఉందా ?

చంద్రబాబునాయుడుని రాజకీయ చతురుడు అంటారు. తిమ్మిని బమ్మిని చేయడం ఆయనకే సాధ్యం. అనుకూలతలన్నీ తనవైపు ఉంచుకుని ప్రతికూలతలు ఇతరుల మీదకు నెట్టడంతోనూ బాబు దిట్ట. ఇక తాను [more]

Update: 2019-06-14 02:50 GMT

చంద్రబాబునాయుడుని రాజకీయ చతురుడు అంటారు. తిమ్మిని బమ్మిని చేయడం ఆయనకే సాధ్యం. అనుకూలతలన్నీ తనవైపు ఉంచుకుని ప్రతికూలతలు ఇతరుల మీదకు నెట్టడంతోనూ బాబు దిట్ట. ఇక తాను చెప్పిన మాటకు కట్టుబడిఉండకపోవడమే కాదు, దానికి సైతం తనకు వీలుగా మార్చుకునే నేర్పు కూడా బాబుదే. అప్పట్లో ఎనిమిదిన్నరేళ్ళు, ఇపుడు అయిదేళ్ళు, వెరశి పదమూడేళ్ళ పాటు ఏపీని పాలించిన చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా ఇకపై గడపాల్సిఉంది. ఆయన పార్టీకి తాజా ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు వచ్చారు. అందువల్ల ఈ పరిమితమైన బలంతో బాబు రాజకీయ యుధ్ధం చేయాలి. ఓ విధంగా చెప్పుకుంటే టీడీపీకి ఇది అస్థిత్వ పోరాటం

హామీ ఎవరిది:

ఇదిలా ఉండగా చంద్రబాబు ఇపుడు తనకున్న పరిధులు, పరిమితులు బాగా అర్ధం చేసుకున్నాక కొత్త వ్యూహాలతొ జగన్ సర్కార్ పై విరుచుకుపడేందుకు రంగం సిధ్ధం చేసుకుంటున్నారు. పట్టుమని పదిహేను రోజులు కూడా నిండని కొత్త ప్రభుత్వంపై నిందలు వేయడానికి, విమర్శలు చేయడానికి బాబు తయారైపోయారు. ఇక్కడ కూడా ఆయన ముందే చెప్పినట్లుగా ఆరు నెలల సమయం జగన్ కి ఇద్దాం అన్న మాటను మరచి యూ టర్న్ తీసుకున్నారు. సరే విమర్శలు చేయడం బాబు హక్కు అనుకున్నా అందులో సహేతుకత ఎంతవరకు ఉంది అన్నది ఇపుడు చర్చకు వస్తోంది. రైతులకు చివరి రెండు విడతల రుణ మాఫీ భారం జగన్ సర్కార్ దేనని అనడం ద్వారా బాబు దివాళాకోరు రాజకీయాలకే తెర తీశారని చెప్పాలి. అసలు రైతులకు రుణ మాఫీ హామీ ఎవరిది. ఆ హామీతో రాజకీయంగా లాభపడింది ఎవరు, అయిదేళ్ళు ముఖ్యమంత్రి పదవి అనుభవించి మరీ అయిదు దశల్లోనూ హామీని నరవేర్చలేని చంద్రబాబు జగన్ సర్కార్ మీద నిందలు వేయడానికి తయారైపోవడాన్ని ఏ విధంగా చూడాలి.

అలా చేస్తే జగనే కదా సీఎం :

ఇక రైతులకు మొత్తం రుణాలను ఒక్క విడతలో మాఫీ చేస్తానంటూ జగన్ కనుక 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి ఉంటే అప్పట్లోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారు కదా. గత ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీ పోస్ట్ మార్టం లో ఇదే విషయం కూడా వెల్లడైంది. మరి రుణ మాఫీ పెను భారమని, దాన్ని అమలు చేయలేమని జగన్ భావించబట్టే అటువంటి హామీ ఇవ్వలేదు. దీన్ని చాలాసార్లు జగన్ కూడా గత అయిదేళ్ళలో చెప్పుకున్నారు. అటువంటి జగన్ మెడకు బాబు తాను స్వయంగా ఇచ్చిన రైతు రుణ మాఫీ హామీ తగిలించడం అంటే రాజకీయంగా ఇంతకంటే దారుణం మరోకటి ఉండదంటున్నారు. చంద్రబాబు హామీ ఇచ్చిన నాటికి ఏపీలో రైతు రుణాలు 87 వేల కోట్లకు పై బడి ఉన్నాయి. దాన్ని అయిదు విడతలుగా విభజించడమే కాదు 24 వేల కోట్లకు కుదించారు. అయినా చివరి రెండు విడతలు ఇచ్చి హామీను నిలబెట్టుకోలేకపోయారు. . మరి ఈ పాపం పూర్తిగా చంద్రబాబుదే అవుతుంది. బురద జల్లడానికి రైతులకు రుణాలు మాఫీ చేయలేదంటూ జగన్ మీదకు నెట్టడం మాజీ ముఖ్యమంత్రికి తగని పని.

Tags:    

Similar News