అలా అయితే నారా ఎందుకవుతారు?

అసలే ఓడిపోయి ఉన్న పార్టీని గాడిన పెట్టాల్సిన పరిస్థితి. అలాగే పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వాల్సిన సందర్భం. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం గతంలో లాగానే [more]

Update: 2019-08-17 06:30 GMT

అసలే ఓడిపోయి ఉన్న పార్టీని గాడిన పెట్టాల్సిన పరిస్థితి. అలాగే పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వాల్సిన సందర్భం. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం గతంలో లాగానే దీనిని నాన్చడాన్ని కొందరు పార్టీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విషయంలో చంద్రబాబు నాయుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారన్న చర్చ పార్టీలో విస్తృతంగా జరుగుతుంది. సొంత పార్టీ కార్యకర్తలే కోడెల శివప్రసాద్ కుటుంబంపై కేసులు పెడుతున్నా చంద్రబాబు మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్నది పార్టీలో ప్రస్తుతం నడుస్తున్న టాక్.

కోడెల కుటుంబంపై…..

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడి మీద రానంత అవినీతి ఆరోపణలు కోడెల శివప్రసాద్ కుటుంబంపై వచ్చాయి. కోడెల కుమారుడు, కుమార్తెలపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే తొలినాళ్లలో ఇది కక్షపూరితంగా పెడుతున్న కేసులేనని భావించినా… రాను రాను సొంత పార్టీ నేతలే కోడెల కుటుంబం అవినీతిపై రచ్చ చేస్తుండటంతో టీడీపీకూడా మౌనంగా ఉంది.

సొంత పార్టీ నేతలే….

దీంతో పాటు సత్తెనపల్లి ఇన్ ఛార్జి పదవి నుంచి కోడెల శివప్రసాద్ ను తొలగించాలని ఆ పార్టీ నేతలే చంద్రబాబును కలసి విన్నవించారు. అయితే ఇప్పటి వరకూ కోడెల శివప్రసాద్ పై పార్టీ పరంగా చర్యలు తీసుకోకపోవడాన్ని కొందరు సీనియర్ నేతలు తప్పుపడుతున్నారు. కోడెల శివప్రసాద్ పై ఎటువంటి చర్య తీసుకోకుంటే పార్టీ క్యాడర్ లో అలుసయిపోమా? అని కొందరు నేతలు సూటిగానే ప్రశ్నిస్తున్నారు.

చర్యలకు దిగితే….

కానీ కోడెల శివప్రసాద్ విషయంలో చంద్రబాబు ఆచితూచి నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. కోడెల కుటుంబానికి ఇప్పటికీ గుంటూరు జిల్లాలో పట్టుంది. పార్టీ ఆవిర్భావం నాటి నుంచి కోడెల శివప్రసాద్ పార్టీనే నమ్ముకుని ఉన్నారు. అలాంటి కోడెలపై చర్యలకు దిగితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురవుతాయని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ గుంటూరు జిల్లా టీడీపీ నేతలు మాత్రం కోడెల పై చర్య తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇప్పటికే పార్టీ కోడెలను కొంత దూరంగా పెట్టిందంటున్నారు. మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News