చంద్రబాబు అడిగిన వెంటనే జగన్ ఆ పని చేస్తారా?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజురోజుకూ క్రమంగా పెరుగుతోంది. విస్తరిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహాయిస్తే పదకొండు జిల్లాల్లో కరోనా వ్యాప్తి చెందింది. అయితే అధికారంలో ఉన్న [more]

Update: 2020-04-08 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజురోజుకూ క్రమంగా పెరుగుతోంది. విస్తరిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహాయిస్తే పదకొండు జిల్లాల్లో కరోనా వ్యాప్తి చెందింది. అయితే అధికారంలో ఉన్న వైసీపీ కిందా మీదా పడుతుంది. అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పటిష్ట చర్యలను చేపడుతుంది. ముఖ్యమంత్రి జగన్ అయితే గంటకోసారి సమీక్ష చేస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా విపక్షాలన్నీ ఇప్పుడు రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి.

అఖిలపక్షం ఏర్పాటు చేయాలని….

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అఖిలపక్షం సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తమ సలహాలు తీసుకోకుండా జగన్ ఏకపక్షంగా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారని చంద్రబాబుతో సహా అన్ని పార్టీలూ నిందిస్తున్నాయి. ప్రధాని మోదీయే అఖిలపక్ష సమావేశాన్ని పెడుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. తాము క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలియజేస్తామని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లో…..

ఇందుకు పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. అక్కడ యడ్యూరప్ప అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సీపీఐ నేత రామకృష్ణ కూడా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలంటూ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశరు. అయితే ఇది సాధ్యం కాదని వైసీపీ నేతలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాలను రాష్ట్రంలో అమలుపర్చడం తప్ప కరోనా కట్టడికి కొత్తగా చేయగలిగిందేమీ లేదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ససేమిరా అంటున్న….

గతంలో చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉంటే ముఖ్యమైన విషయాల్లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్సాటు చేశారా? అని ప్రశ్నిస్తున్నారు. రాజధాని నిర్ణయంపై చంద్రబాబు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారా? అని నిలదీస్తున్నారు. హైదరాబాద్ లో క్వారంటైన్ లో ఉన్న చంద్రబాబు సలహాలు తమకు అవసరం లేదని వైసీపీ నేతలు తెగేసి చెబుతున్నారు. కరోనా రక్కసిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని, ఉచిత సలహాలు అవసరం లేదని, విమర్శలు, బురద జల్లడం మానుకుంటే చాలని వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలా ఏపీలో అఖిలపక్ష సమావేశంపై యాగీ కొనసాగుతూనే ఉంది.

Tags:    

Similar News