ఇద్దరిలో ఇంత తేడా ఎందుకుంది?

అభ‌ద్రత ఎక్కడ ఉంటుందో.. అక్కడ చంద్రబాబు ఉంటారు. అని గతంలో ఆయ‌న‌ను ఉద్దేశించి అనేక‌మంది చెప్పేవారు. ప్రభుత్వంలో ఉండి తాను చేయాల్సిన ప‌నులు చేయ‌డం వ‌ల్ల ప్రజ‌ల‌కు [more]

Update: 2020-04-18 13:30 GMT

అభ‌ద్రత ఎక్కడ ఉంటుందో.. అక్కడ చంద్రబాబు ఉంటారు. అని గతంలో ఆయ‌న‌ను ఉద్దేశించి అనేక‌మంది చెప్పేవారు. ప్రభుత్వంలో ఉండి తాను చేయాల్సిన ప‌నులు చేయ‌డం వ‌ల్ల ప్రజ‌ల‌కు ఆయ‌న ఏం చెప్పాలో.. ఏం చేయాలో.. అన్నీ చేరిపోతాయ‌నేది ప్రతి ఒక్కరూ అనేమాట‌. దీనికి పెద్ద ఎత్తున ప్రచారం అవ‌స‌రం లేదు. అయితే, గ‌తంలో ఐదేళ్లు పాలించిన చంద్రబాబు మాత్రం ప్రతి విష‌యాన్నీ ప్రచార కోణంలోనే చూశారు. తాను ఏం చేసినా ముందు ప్రచారం.. త‌ర్వాత ప్రచారం.. అనే విధంగా ఆయ‌న ముందుకు సాగారు. నిజానికి అధికారంలో ఉన్నవారు చేయాల్సింది చేస్తే.. దాని తాలూకు ఫ‌లాలు అందుకున్న వారు ఎప్పటికీ మ‌రిచిపోర‌నేది వాస్తవం. ప్రభుత్వం నుంచి సాయం అందుకున్న వారు ప్రభుత్వాన్ని ఎలా మ‌రిచిపోతారు? నాయ‌కుడిని ఎందుకు మ‌రిచిపోతారు? దీనికి ప్రచారం అవ‌స‌ర‌మా?

ఎంత ప్రచారం చేసుకున్నా…..

ఈ ప్రచారం వ‌ల్ల ఒరిగేది ఏంటి ? ఈ విష‌యం చంద్రబాబు తెలిసినా.. ఎవ‌రైనా చెప్పినా.. గ‌తంలో ఆయ‌న ప‌ట్టించుకోలేదు. ఏదైనా విష‌యంపై గంట‌ల త‌ర‌బ‌డి ఆయ‌న మీడియా మీటింగులు నిర్వహించి.. లాంగ్ లాంగ్ ఎగో.. సోలాంగ్ ఎగో.. అంటూ త‌న ప‌నిని తానే పొగుడుకునేవారు. అయితే, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ అధినేత జ‌గ‌న్ మాత్రం తాను చేయాల్సింది చేస్తున్నారు. ప్రజ‌ల‌కు పావ‌లా ఇచ్చి ముప్పావ‌లా ప్రచారం చేసుకోవాల‌నే తాప‌త్రయం ఆయ‌న‌కు ఎక్కడా లేద‌నేది ఆది నుంచి ప్రజ‌ల‌కు తెలిసిందే. అమ్మ ఒడి కింద రూ. 15 వేల‌ను ఒకేసారి ప్రజ‌ల ఖాతాల్లో డంప్ చేసిన‌ప్పుడు కూడా మీడియా ముందుకు వ‌చ్చిన సంద‌ర్భం ఎక్కడా క‌నిపించ‌లేదు. అదే స‌మ‌యంలో పేద‌లకు క‌ల‌ల గూడు క‌ల్పించే ఉద్దేశంతో ఇళ్లు ఇవ్వాల‌నుకున్నప్పుడు కూడా ఆయ‌న ప్రచారం చేసుకోలేదు.

నియంత్రణలో విఫలమయ్యారనే..?

అదే స‌మయంలో ఇప్పుడు క‌రోనా ఎఫెక్ట్‌తో ప్రజ‌లు అల్లాడుతుంటే.. దేశంలో ఏరాష్ట్రం కూడా తీసుకోని విధంగా అనేక చ‌ర్యల‌ను తీసుకుంటున్నారు. కేర‌ళ‌లో క‌రోనా క‌ట్టడి అయింది. దీనికి అనేక చ‌ర్యలు తీసుకున్నారు. ఈ విష‌యాన్ని చంద్రబాబు అనుకూల మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే, అదే స‌మ‌యంలో ఇలాంటి చ‌ర్యల‌నే ఏపీ ప్రభుత్వం తీసుకుంటోంది. అయితే, ఒక్క మాటంటే ఒక్క మాట కూడా రాయడం లేదు. టీడీపీ అనుకూల మీడియాలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి చాలా ఎక్కువ ఉంద‌న్న వార్తలే క‌నిపిస్తున్నాయి.

ఎన్ని విమర్శలు వచ్చినా…?

అయినా కూడా జ‌గ‌న్ దీనిపై ఎక్కడా స్పందించ‌లేదు. అలాగ‌ని మంత్రుల‌ను కూడా పుర‌మాయించి గంట‌కోర‌కంగా ఊద‌ర‌గొట్టమ‌ని కూడా ఆదేశించ‌లేదు. కేవ‌లం ప‌నిని న‌మ్ముకున్న నాయ‌కుడిగా ముందుకు వెళుతున్నట్టే క‌నిపిస్తోంది. మంత్రులు సైతం ఇంత జ‌రుగుతున్నా మీడియాలో ఎందుకు స్పందించ‌డం లేద‌న్న ప్రశ్నల‌కు త‌మ‌కు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంత ప‌బ్లిసిటీ పిచ్చిలేద‌ని చెపుతున్నారు. అదే టైంలో జ‌గ‌న్ చేయాల్సింది చేస్తున్నా ఎక్కువగా మీడియా ముందుకు వ‌చ్చేందుకు మాత్రం ఇష్టప‌డ‌న‌ట్టే క‌నిపిస్తోంది. మ‌రి ఇది చూస్తున్న చంద్రబాబు.. ప్రచారం లేక‌పోవ‌డాన్ని కూడా త‌ప్పుప‌డుతున్నారా? అనే సందేహం వ్యక్తమ‌వుతోంది. అందుకే ఆయ‌న ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారా? అనే వ్యాఖ్యలు కూడా వ‌స్తున్నాయి.

Tags:    

Similar News