అప్పుడు జగన్ కు.. ఇప్పుడు బాబుకు ట్యాగ్ లైన్ ఛేంజ్?

చంద్రబాబు సీన్ ఇప్పుడు రివర్స్ అయింది. గతంలో జగన్ పై చేసిన విమర్శలు ఇప్పుడు ఆయనకే రివర్స్ లో వచ్చి తంతున్నట్లయింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు [more]

Update: 2020-04-05 14:30 GMT

చంద్రబాబు సీన్ ఇప్పుడు రివర్స్ అయింది. గతంలో జగన్ పై చేసిన విమర్శలు ఇప్పుడు ఆయనకే రివర్స్ లో వచ్చి తంతున్నట్లయింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ నాలుగేళ్ల పాటు హైదరాబాద్ నుంచే పార్టీ కార్యకలాపాలు కొనసాగించేవారు. అప్పట్లో టీడీపీ నేతలు రోజు జగన్ పై విమర్శలు చేసేవారు. పొరుగు రాష్ట్రంలో ఉంటూ తమపై విమర్శలు చేయడమేంటంటూ మండి పడేవారు. ఏపీ పై ప్రేమ లేదని, సీఎం కుర్చీ కోసమే జగన్ పాకులాట అంటూ విమర్శలు చేసేవారు. ఒకప్పుడు పొరుగు రాష్ట్రం అనే ట్యాగ్ లైన్ జగన్ కు ఉండగా, ఇప్పుడు చంద్రబాబకు తగులుకుంది.

ఎన్నికలకు ఏడాది….

ఎన్నికలకు ఏడాది ముందు జగన్ హైదరాబాద్ నుంచి బెజవాడకు ఫిఫ్ట్ అయ్యారు. అక్కడే సొంత ఇల్లు, పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. అయితే చంద్రబాబు అధికారంలో అయిదేళ్లు ఉన్నప్పటికీ సొంత ఇల్లు లేదు. పార్టీ కార్యాలయాన్ని మాత్రం ఇటీవలే నిర్మించుకున్నారు. అయితే గత పది రోజుల నుంచి చంద్రబాబు పొరుగు రాష్ట్రం తెలంగాణలో చిక్కుకుపోయారు. గత నెల 22వ తేదీన జరిగిన జనతాకర్ఫ్యూ నుంచి ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నారు.

చిక్కుకుపోయిన చంద్రబాబు….

లాక్ డౌన్ ఉండటం, సరిహద్దులు మూసివేయడం, కుటుంబం మొత్తం ఇక్కడే ఉండటంతో చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఇప్పుడు అదే చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. జగన్ పై గతంలో టీడీపీ చేసిన విమర్శలే ఇప్పుడు వైసీపీ నేతలు చంద్రబాబు పై చేస్తున్నారు. హైదరాబాద్ లో కూర్చుని విమర్శించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఏపీని గాలికి వదిలేసి వైరస్ కు భయపడి పారిపోయారని మంత్రులు సయితం చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు.

రివర్స్ లో విమర్శలు…..

చంద్రబాబు హైదారాబాద్ లో ఉండి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటంతో ఈ పొరుగు రాష్ట్రం నినాదాన్ని వైసీపీ నేతలు అందుకున్నారు. తమ ప్రభుత్వం అన్నీ పనులు చేస్తున్నా, తమక ప్రచార యావ లేదని, చంద్రబాబు మాత్రం హైదరాబాద్ లో ఉన్నా రోజూ టీవీల్లో కన్పించాలని తమపై నెపాలు మోపుతున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. గతంలో పొరుగు రాష్ట్రం ట్యాగ్ లైన్ ను ఇప్పుడు వైసీపీ నేతలు చంద్రబాబుకు తగిలించారు.

Tags:    

Similar News