జగన్ కు చంద్రబాబు ఈజీ చేశారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జగన్ పనిని సులువు చేసినట్లే కనపడుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కట్టడి చేస్తున్నట్లు కనపడుతుంది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు [more]

Update: 2020-10-10 11:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జగన్ పనిని సులువు చేసినట్లే కనపడుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కట్టడి చేస్తున్నట్లు కనపడుతుంది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు పోరాటం చేసిన తర్వాత వైసీపీకి ఆంధ్రప్రదేశ్ లో అధికారం దక్కింది. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా అభివృద్ధి పనులను పక్కన పెట్టి సంక్షేమ పథకాలకే నిధులు వెచ్చిస్తున్నారు. దీంతో అభివృద్ధి పనులు జరగడం లేదు.

ఎమ్మెల్యేలు ఆర్థికంగా….

అభివృద్ధి పనులు జరగకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్థికంగా నిలదొక్కుకోలేెక పోతున్నారు. గత ఎన్నికల్లో పెట్టిన ఖర్చును సయితం రాబట్టుకోలేక పోతున్నారు. దీంతో వారికి ఇసుక వరంగా మారింది. అనేక మంది ఎమ్మెల్యేలు ఇసుక దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక అధికారులు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఏమీ అన లేక మిన్న కుండి పోతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ ప్రతి స్పందన కార్యక్రమంలో ఇసుక దందా ఎవరు చేసినా ఊరుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

ఇసుక దందా విషయంలో….

ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఇసుక అక్రమ తవ్వకాలపై ఎమ్మెల్యేలపై సూటిగా ఆరోపణలు చేస్తున్నారు. పేర్లతో సహా చెప్పి విమర్శలు చేస్తుండటంతో ఎమ్మెల్యేల దూకుడుకు అడ్డుకట్ట పడింది. స్థానిక అధికారులను మచ్చిక చేసుకుని ఇసుక దందా చేసుకుందామనుకున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఆరోపణలు అడ్డంకి గా మారాయి. బాబు ఆరోపణలతో జగన్ పిలిచి మందలిస్తాడని భావించి ఎమ్మెల్యేలు ఇసుక దందాకు దూరంగా జరిగారంటున్నారు.

ఇళ్ల స్థలాలపైనా…

ఇక ఇళ్ల స్థలాల ఎంపిక విషయంలోనూ చంద్రబాబు చేస్తున్న విమర్శలు వైసీపీ ఎమ్మెల్యేలకు బాగానే తాకాయి. పేదలకు ఇళ్ల స్థలాల కోసం తమ భూములను ఎక్కువ ధరకు ప్రభుత్వం చేత కొనుగోలు చేయించడంపై ఉదాహరణలతో సహా చంద్రబాబు చెప్పడంతో ఇప్పుడు ఆ స్థలాల విషయంలో కొందరు వెనక్కు తగ్గారంటున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని జగన్ చెప్పడం, చంద్రబాబు అదే రకమైన ఆరోపణలు చేస్తుండటంతో ఎమ్మెల్యేలను జగన్ కంట్రోల్ చేయాల్సి ఉండగా, చంద్రబాబు కట్టడి చేస్తున్నారని వైసీపీలో చర్చ జరుగుతుండటం విశేషం. మొత్తం మీద జగన్ పనిని చంద్రబాబు మరింత సులువు చేశారని చెప్పకతప్పదు.

Tags:    

Similar News