బాబు.. కేబినెట్‌కు, జ‌గ‌న్ కేబినెట్‌కు డిఫ‌రెన్స్ ఇదేనా..?

రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. గ‌తంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేక‌త కావొచ్చు.. వైసీపీ అధి నేత జ‌గ‌న్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌నే ఉద్దేశంతో కొవొచ్చు.. మొత్తంగా ప్రజ‌లు [more]

Update: 2020-07-06 08:00 GMT

రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. గ‌తంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేక‌త కావొచ్చు.. వైసీపీ అధి నేత జ‌గ‌న్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాల‌నే ఉద్దేశంతో కొవొచ్చు.. మొత్తంగా ప్రజ‌లు ఏపీలో ప్రభుత్వాన్ని మార్చే శారు. ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు ఏర్పడి.. ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో జ‌గ‌న్ పాల‌న ఎలా ఉంది ? అంటే.. ప్రతిప‌క్షాలు 'ఏముంది పంచుడేగా!' అని పెద‌వి విరుస్తున్నాయి. ఇక‌, అధికార ప‌క్షాన్ని ప్రశ్నిస్తే.. 'ప్రజ‌ల‌కు అన్ని విధాలా సంక్షేమం అందిస్తున్నాం“ అంటున్నాయి. ఇక‌, ప్రజ‌ల‌ను ఇదే విష‌యంపై ప్రశ్నిస్తే 60 : 40గా రియాక్ట్ అయ్యారు. అయితే, ఇక్కడే గ‌త ప్రభుత్వం చంద్రబాబు కేబినెట్‌కు, జ‌గ‌న్ కేబినె ట్‌కు మ‌ధ్య తేడాపై చ‌ర్చించుకుంటున్నారు.

ఎవరూ ఊహించని విధంగా….

వాస్తవానికి చంద్రబాబు కేబినెట్‌లో మైనార్టీ స‌హా ఎస్టీ వ‌ర్గాల‌కు అవ‌కాశం క‌ల్పించ‌లేదు. (ఎస్టీ వ‌ర్గానికి చివ‌రి ఐదున్నర నెల‌ల కాలంలో మాత్రమే అవ‌కాశం ఇచ్చారు. అది కూడా వైసీపీ నుంచి జంప్ అయిన నేత కుమారుడు శ్రవ‌ణ్‌కు) దీంతో ఆయా వ‌ర్గాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి ఏర్పడింది. అదే స‌మ‌యంలో అప్పటి ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీ కూడా ఈ అంశాల‌నే టార్గెట్ చేసింది. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో చాన్స్ ఇచ్చారు. ఎవ్వరూ ఊహించ‌ని విధంగా ఐదుగురు ఎస్సీల‌తో పాటు ఏకంగా ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి ప‌ద‌వులు క‌ట్టబెట్టారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. మ‌రి ఈ ఏడాది కాలంలో జ‌గ‌న్ కేబినెట్ దూకుడు ఎలా ఉంది? గ‌తంలో చంద్రబాబు కేబినెట్ ఎలా వ్యవ‌హ‌రించింది.. అనే కంపేరిజ‌న్ జ‌రుగుతోంది.

సరిచేసుకుందామనుకున్నా…..

నిశితంగా ప‌రిశీలిస్తే.. అప్పట్లోను, ఇప్పుడు కూడా.. మంత్రులు.. సీఎంను ప్రస్తుతించ‌డంలోను, స్త్రోత్ర పాఠాలు వ‌ల్లించ‌డంలోను, ఇంప్రెస్డ్ పాలిటిక్స్ చేయ‌డంలోను ఎవ‌రికి ఎవ‌రూ తీసిపోవ‌డం లేదు. అవ‌స‌రం ఉన్నా లేకున్నా.. గ‌తంలో చంద్రబాబును హీరోను చేశారు కేబినెట్ మంత్రులు. ఇక‌, రాష్ట్రం వెలిగిపోతోందని, విజ‌న్ ఉన్న సీఎం అని .. త‌మ‌దైన శైలిలో త‌మ మీడియా ద్వారా ప్రచారానికి తెర‌దీశారు. వీరికి ఎల్లో మీడియా కూడా తోడ‌య్యింది. ఇక‌, ఈ స్త్రోత్ర పాఠాల‌కు ముగ్దుడైన చంద్రబాబు.. త‌మ్ముళ్లు క్షేత్రస్థాయిలో దారిత‌ప్పినా.. మౌనం పాటించారు. ఫ‌లితం ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. చివ‌రికి స‌రిచేసుకుందామ‌ని అనుకున్నా సాధ్యం కాలేదు.

భయం అనేది ఉందట….

ఇక ఇప్పుడు జ‌గ‌న్ కేబినెట్‌లోనూ మంత్రులు కొంద‌రు స్త్రోత్రపాఠాలు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో కొంద‌రు మౌనం పాటిస్తున్నారు. ఇంకొంద‌రు దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. అయితే, జ‌గ‌న్ వీటిని గ‌మ‌నిస్తున్నా .. కొంత‌మేర‌కు 'అమ్మో.. బాస్‌కు తెలిస్తే!' అనే భ‌యాన్ని మాత్రం క‌లిగించ‌గ‌లిగారు. దీంతో తొలి ఏడాదిలో పెద్దగా గాడిత‌ప్పుతున్న మంత్రులు క‌నిపించ‌లేదు. కానీ, కుటుంబ స‌భ్యుల ప్రమేయాన్ని మాత్రం త‌గ్గించాల్సిన అవ‌స‌రం ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా తొలి ఏడాది జ‌గ‌న్ కేబినెట్‌.. గ‌తంలో చంద్రబాబు కేబినెట్ కంటే బెట‌ర్‌గానే ఉంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News