ఒక్క ఫోన్ కాల్ “‘సీన్” మొత్తాన్ని మార్చేసిందా?

ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ సంభాషణ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరంతకీ ఏం మాట్లాడుకున్నారు? కరోనా కట్టడి అంశాల వరకే [more]

Update: 2020-04-15 03:30 GMT

ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ సంభాషణ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరంతకీ ఏం మాట్లాడుకున్నారు? కరోనా కట్టడి అంశాల వరకే పరిమితమయ్యారా? లేక రాజకీయాలు ప్రస్తావనకు వచ్చాయా? అన్నది ఏపీ పాలిటిక్స్ లో చర్చగా మారింది. చంద్రబాబు, మోడీ దాదాపు పథ్నాలుగు నెలల తర్వాత మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. ఎన్నికలకు దాదాపు ఏడాది ముందునుంచే వారి మధ్య మాటలు లేవు. తాజాగా వీరిమధ్య జరిగిన మాటలు భవిష్యత్తు రాజకీయాలకు బాటలు వేయనున్నాయా? అన్న చర్చ జరుగుతోంది.

మళ్లీ ఇద్దరూ కలుస్తారా?

ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు ఇప్పటి నుంచే కాదు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్పటి నుంచి చంద్రబాబు మోదీపై విమర్శలు చేస్తున్నారు. గోద్రా అల్లర్ల తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి మోదీని తొలగించాలని డిమాండ్ చేసింది చంద్రబాబే. అలాగే ఇప్పటికి రెండుసార్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. రెండు సార్లు కటీఫ్ చెప్పారు. కేంద్ర మమంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన తర్వాత మోదీ చివరిసారి చంద్రబాబుకు ఫోన్ చేశారు. అప్పుడు కూడా బతిమాలలేదు. నిర్ణయంపై పునస్సమీక్షించుకోవాలని మాత్రమే కోరారు. వీటన్నింటి నేపథ్యంలో మారోసారి రాజకీయంగా ఈ ఇద్దరూ కలిసే అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.

అన్ని రకాలుగా ఇబ్బందులతో…..

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి గా జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా పార్టీని, పార్టీ నేతలను గత పదినెలలుగా నష్టపరుస్తూనే ఉన్నారు. ఇలాగే కొనసాగితే పార్టీ మనుగడకే కష్టం. అందుకే చంద్రబాబు గత కొద్ది రోజుల నుంచి హస్తిన వైపు చూస్తున్నారు. జగన్ కు చెక్ పెట్టాలంటే మోదీతో చేతులు కలపటమే బెటర్ అన్న అభిప్రాయానికి చంద్రబాబుతో పాటు మెజారిటీ సీనియర్ నేతలందరూ వచ్చేశారు. శాసనమండలి రద్దు, రాజధాని మార్పు వంటి కీలక అంశాల్లో కేంద్రం సాయం ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు అవసరం. అందుకే కరోనా సమయంలో వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు వినియోగించుకున్నారంటున్నారు.

జగన్ కు జర్క్ ఇవ్వడానికేనా?

అయితే వైసీపీ నేతలు మాత్రం వీటిని కొట్టిపారేస్తున్నారు. చంద్రబాబును బీజేపీ నమ్మే పరిస్థితి లేదన్నది వారి ధీమా. చంద్రబాబు మోదీ తో ఫోన్ సంభాషణలు జరిపిన తర్వాత ఢిల్లీలో వాస్తవ పరిస్థితులపై వైసీపీ నేతలు కూపీ లాగినట్లు తెలుస్తోంది. అయితే అది క్యాజువల్ కాల్ మాత్రమేనని ఢిల్లీ కమలం పెద్దలు కొందరు చెప్పడంతో వైసీపీ నేతలు సయితం కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే మోదీ ఫోన్ కాల్ జగన్ కు జర్క్ ఇవ్వడానికేనన్నది వాస్తవం. మోదీతో చంద్రబాబు టచ్ లో ఉన్నారని తెలిస్తే కొంత జగన్ దూకుడు తగ్గిస్తారని టీడీపీ నేతలు సయితం భావిస్తున్నారు. కరనా ముగిసిన తర్వాత చంద్రబాబు హస్తిన ప్రయాణం కూడా ఉండొచ్చంటున్నారు టీడీపీ నేతలు. మొత్తం మీద ఒక ఫోన్ కాల్ ఏపీ పొలిటికల్ సీన్ ను మారుస్తుందో? లేదో? రానున్న కాలమే చెప్పాల్సి ఉంటుంది.

Tags:    

Similar News