ఏపీ రాజ‌కీయాల్లో కొత్త వార‌సులొస్తున్నారోచ్‌

రాజ‌కీయాలు, సినిమాల్లో వార‌స‌త్వానికి కొద‌వ ఉండ‌దు.. అందులోనూ తెలుగు నేల‌పై ఈ రెండు రంగాల్లో ఎవ‌రైనా తాము ఇండ‌స్ట్రీలో ఏళ్లకు ఏళ్లుగా పాతుకు పోవ‌డంతో పాటు వార‌సుల‌ను [more]

Update: 2021-01-15 00:30 GMT

రాజ‌కీయాలు, సినిమాల్లో వార‌స‌త్వానికి కొద‌వ ఉండ‌దు.. అందులోనూ తెలుగు నేల‌పై ఈ రెండు రంగాల్లో ఎవ‌రైనా తాము ఇండ‌స్ట్రీలో ఏళ్లకు ఏళ్లుగా పాతుకు పోవ‌డంతో పాటు వార‌సుల‌ను కూడా బ‌ల‌వంతంగా రంగ‌ప్రవేశం చేయించేస్తారు. ఈ వార‌సుల మ‌ధ్య సినిమా, రాజ‌కీయ రంగాల్లో కొత్తోళ్లు వ‌చ్చి నిల‌దొక్కుకోవాలంటే ఎంతో టాలెంట్ ఉండాలి. ఏపీలో అయినా.. తెలంగాణ‌లో అయినా వార‌సుల రాజ‌కీయ‌మే ఇప్పుడు రాజ్యమేలుతోంది. వైఎస్‌. జ‌గ‌న్, నారా లోకేష్‌, కేటీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ పార్టీలో అయినా వార‌సుల‌దే హంగామా.. ఇక ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లోనే ఎక్కువ మంది వార‌సులు పోటీ చేశారు. ప్రధాన పార్టీలు అయిన టీడీపీ, వైసీపీ నుంచి ఎక్కువ మంది వార‌సులు త‌ల‌ప‌డ్డా.. వీరిలో టీడీపీ నుంచే ఎక్కువ మంది పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే టీడీపీ వార‌సుల్లో ఎక్కువ మందికి ప‌రాజ‌య‌మే ప‌ల‌క‌రించింది.

గత ఎన్నికల్లో…..

గ‌త ఎన్నిక‌ల్లో ఎంట్రీ ఇచ్చిన రాజ‌కీయ వార‌సుల లిస్ట్ చూస్తే ప‌రిటాల శ్రీరామ్‌, గౌతు శిరీష‌, ఆదిరెడ్డి భ‌వానీ, కేఈ శ్యాంబాబు, గాలి భానుప్రకాష్ నాయుడు, కాగిత కృష్ణ ప్రసాద్‌ ఇలా చాలా మంది నేత‌లే పోటీ చేశారు. వీరిలో రాజ‌మహేంద్రవ‌రం సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భ‌వానీ మిన‌హా ఎవ్వరూ గెల‌వ‌లేదు. ఇక ఇప్పుడు మ‌రింత మంది రాజ‌కీయ వార‌సులు ఏపీ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ వ‌ర్క్ జ‌రుగుతోంది. అస‌లే ఇప్పుడు ఏపీలో టీడీపీ ప‌రిస్థితి దీనంగా ఉంది. చాలా మంది సీనియ‌ర్లు గ‌త ఎన్నిక‌ల్లోనే పోటీ చేయ‌కుండా వార‌సుల‌ను రంగంలోకి దించ‌గా.. మ‌రి కొంద‌రు మాత్రం గ‌త ఎన్నిక‌లే త‌మ‌కు చివ‌రి ఎన్నిక‌లు అని.. ఆఖ‌రు సారిగా ల‌క్ ప‌రీక్షించుకుని ఓడిపోయారు.

ఈ జిల్లా నుంచే ఇద్దరు….

ప్రస్తుతం పార్టీలో యువ‌ర‌క్తాన్ని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియ‌ర్ నేతలు కూడా త‌మ వార‌సుల‌ను రంగంలోకి దించేందుకు ఇదే స‌రైన టైం అని ఎదురు చూస్తున్నారు. ఈ లిస్టులో కూడా ఒక‌రిద్దరు వైసీపీ నేత‌లు ఉన్నా… టీడీపీ నేత‌లే ఎక్కువ మంది ఉన్నారు. దివంగ‌త మాజీ స్పీక‌ర్ కోడెల శివ ప్రసాద‌రావు లేక‌పోవ‌డంతో ఆయ‌న వార‌సుడు కోడెల శివ రామ‌కృష్ణ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతున్నారు. అయితే స‌రైన గ్రౌండ్ ( నియోజ‌క‌వ‌ర్గం) కోస‌మే ఆయ‌న వెయిటింగ్‌. ఇక గ‌త ఎన్నిక‌ల్లోనే పోటీకి ఉవ్విళ్లూరిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావు త‌న‌యుడు రాయ‌పాటి రంగారావు సైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతుండ‌డంతో పాటు స‌రైన నియోజ‌క‌వ‌ర్గం వేట‌లో ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచే ఈ ఇద్దరు రాజ‌కీయ వార‌సుల పొలిటిక‌ల్ ఎంట్రీ ఆస‌క్తిక‌రం.

ఉత్తరాంధ్ర నుంచి…..

వీరితో పాటు పార్టీ సీనియ‌ర్ నేత‌లు కొమ్మాల‌పాటి శ్రీథ‌ర్‌, య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు త‌న‌యులు కూడా ఏదో ఒక పద‌వి ( జిల్లా స్థాయిలో అయినా) ద‌క్కించుకుని వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కీల‌క నేత‌లుగా అవ‌తారం ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక అయ్యన్న పాత్రుడు త‌న‌యుడు విజ‌య్ గ‌త ఎన్నిక‌ల్లోనే న‌ర్సీప‌ట్నం నుంచి పోటీ చేయాల‌నుకున్నా చంద్రబాబు ఈ సారికి అయ్యన్నే ఉండాల‌ని ప‌ట్టుబ‌ట్టడంతో కుద‌ర్లేదు. వచ్చే ఎన్నిక‌ల్లో విజ‌య్ పోటీకి న‌ర్సీప‌ట్నంలో గ్రౌండ్ రెడీ అవుతోంది. ఇక పెందుర్తిలో సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బండారు స‌త్యనారాయ‌ణ మూర్తి త‌న‌యుడు అప్పల‌నాయుడు కూడా పెందుర్తిలో పోటీకి రెడీ అవుతున్నారు.

యనమల కుమార్తెను….

ఇక వార‌సులు లేని మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు త‌న కుమార్తె దివ్యను ఏదోలా రాజ‌కీయంగా నిల‌బెట్టాల‌ని అష్టక‌ష్టాలు ప‌డుతున్నారు. ఆమెను తుని లేదా రాజాన‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అయితే సామాజిక స‌మీక‌ర‌ణ‌లు అడ్డు రావ‌డంతో య‌న‌మ‌ల కుమార్తెకు గ‌త ఎన్నిక‌ల్లోనే సీటు ఇచ్చేందుకు చంద్రబాబు ఇష్టప‌డ‌లేదు. ఇక బుచ్చయ్య చౌద‌రి సైతం వ‌య‌స్సు పైబ‌డ‌డంతో త‌న రాజ‌కీయ వార‌సుడిగా త‌న సోద‌రుడి కుమారుడిని తెర‌మీద‌కు తీసుకు వ‌స్తున్నారు. ఇక వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లోనే శిల్పా వార‌సుడు ర‌వికిషోర్ రెడ్డి ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పుడు స్పీక‌ర్ త‌మ్మినేని కుమారుడు మాత్రం రంగంలో ఉన్నారు. మ‌రి వీరిలో ఎంద‌రు రాణిస్తారు ? ఎవ‌రికి ఎదురు దెబ్బలు త‌ప్ప‌వ‌న్న‌ది వ‌చ్చే ఎన్నిక‌లే నిర్ణ‌యించాలి.

Tags:    

Similar News