ఆ టాస్క్ ని అచ్చెన్న సక్సెస్ చేస్తారా ?

తెలుగుదేశం పార్టీలో ఎందరికి ఎన్ని పదవులు ఇచ్చినా వచ్చినా కూడా చంద్రబాబుదే ఫైనల్. ఆయనే సర్వాధికారి. ఆఖరుకు ఒక వార్డ్ కార్పొరేటర్ అభ్యర్ధిని నిర్ణయించాలన్న కూడా పై [more]

Update: 2020-12-23 13:30 GMT

తెలుగుదేశం పార్టీలో ఎందరికి ఎన్ని పదవులు ఇచ్చినా వచ్చినా కూడా చంద్రబాబుదే ఫైనల్. ఆయనే సర్వాధికారి. ఆఖరుకు ఒక వార్డ్ కార్పొరేటర్ అభ్యర్ధిని నిర్ణయించాలన్న కూడా పై నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే టీడీపీ పక్కా ప్రాంతీయ పార్టీ. రెండవ నాయకత్వానికి చోటు ఉండదు. కో పైలెట్ ల వల్ల ఎక్కువగా దెబ్బ తిన్న పార్టీ కూడా అదే కావడంతో చంద్రబాబు తన గుప్పిట్లోనే అన్నీ ఉంచుకున్నారని అంటారు.

టర్న్ చేయాలిగా …..?

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉత్తరాంధ్రా మూడు జిల్లాలూ టీడీపీకి రివర్స్ గా వెళ్లి భారీ షాక్ ఇచ్చాయి. అది కనుక జరగకపోయి ఉంటే చంద్రబాబుకు కనీసం యాభై దాకా అసెంబ్లీ సీట్లు వచ్చేవి. మరీ ఇంత ఘోరమైన అవమానం జరిగేది కూడా కాదు. అందుకే ఆయన‌ ఉత్తరాంధ్రా మీదనే మళ్ళీ నమ్మకం పెట్టుకున్నారు. ఉత్తరాంధ్రాన్లో పార్టీని పైకి లేపి పూర్వ వైభవం వచ్చేలా చూడాలని అనుకుంటున్నారు. దానికి గాను పెద్ద గొంతుతో ప్రత్యర్ధులపైన విరుచుకుపడే అచ్చెన్నాయుడుని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ చేశారు. నిజానికి అచ్చెన్న ఏపీ అంతా తిరిగి చేయాల్సిన పని కంటే ఉత్తరాంధ్రా మూడు జిల్లాలను గాడిన పెట్టి సైకిల్ జోరు పెరిగేలా చేయడమే అసలైన టాస్క్.

అంత నమ్మకమా …?

ఇక అచ్చెన్నాయుడు కొత్త సారధిగా అయిన దగ్గర నుంచి ఉత్తరాంధ్రా సమస్యలు ప్రస్తావిస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ విశాఖ రాజధానిని ఎవరు అడిగారు అంటూ ఆయన జగన్ని నిలదీయడమే ఇపుడు తమ్ముళ్లకు కూడా కాస్తా షాక్ ఇచ్చేలా ఉంది. ఇంతవరకూ చంద్రబాబు మరొకరో అమరావతి గురించి గట్టిగా మాట్లాడేవారు. ఇపుడు ఆ బాధ్యతను తీసుకున్న అచ్చెన్న జంకూ గొంకూ లేకుండా అమరావతే రాజధానిగా ఉంచాలని నినదిస్తున్నారు. అంతవర‌కూ బాగానే ఉన్నా మూడు రాజధానులు ఎవరూ కోరలేదని అనడం మాత్రం ఇబ్బంది అవుతుందా అన్నదే పార్టీలో చర్చగా ఉందిట. మరి విశాఖను రాజధానిగా వద్దు అని జనం అంటారని అచ్చెన్న నమ్మకంగా అయి ఉండాలి.

బూమరాంగ్ అయితే….?

ఎవరూ కూడా కోరుకుంటే అన్నీ రావు. అలా వచ్చినవి వద్దు అనుకునే రకాలు కూడా ఎవరూ ఉండరు. విశాఖవాసులకు 2014కు ముందే తమ ప్రాంతం రాజధాని అవుతుంది అన్న ఆలోచన ఉంది. కానీ అమరావతినే రాజధాని అని చంద్రబాబు ఫైనల్ చేయడం వల్ల పోరాటాలు అయితే చేయలేదు. కానీ అసంతృప్తి మాత్రం ఉంది. దాని ఫలితమే గత ఏడాది ఎన్నికల్లో టీడీపీకి భారీ దెబ్బ పడిందని అంటున్నారు. విశాఖ సిటీలో టీడీపీ గెలవడానికి వైసీపీ ఓడిపోవడానికి బలమైన క్యాండిడేట్లు ఆ పార్టీకి లేకపోవడమే తప్ప మరోటి కాదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇన్ని తెలిసినా అచ్చెన్న చంద్రబాబు మెప్పు కోసం అమరావతి మీద పదే పదే నోరు చేసుకుంటున్నారు. మరి తేడా కొడితే విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలలో మళ్ళీ సైకిల్ కి పంక్చర్ పెట్టడానికి ప్రజలు సిధ్ధంగా ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News