కల చెదిరిపోనుందా…?

ఆంధ్రప్రదేశ్ కి వాస్తు లోపమని, సిరి అందుకే లేదని గతంలోనూ ఇపుడూ ఎన్నో సెంటిమెంట్ మాటలు వినిపించాయి. దానికి తగినట్లుగా ఆధారాలు కూడా చూపుతున్నారు కూడా. ఎందుకంటే [more]

Update: 2019-08-26 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ కి వాస్తు లోపమని, సిరి అందుకే లేదని గతంలోనూ ఇపుడూ ఎన్నో సెంటిమెంట్ మాటలు వినిపించాయి. దానికి తగినట్లుగా ఆధారాలు కూడా చూపుతున్నారు కూడా. ఎందుకంటే 66 ఏళ్ళ క్రితం ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికి మూడు రాజధానులను చూసింది. పిల్లి పిల్లల్ని పెట్టినట్లుగా ఊరూరా తిరిగింది, కానీ ఎక్కడా కుదురుకోలేదు. మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా వెనక్కి వచ్చేసిది. ఇపుడు చూస్తే ఏపీకి అమరావతి రాజధాని అంటున్నారు. కానీ అది ఎక్కడ ఉంది అంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు. అప్పట్లో టీడీపీ తమ్ముళ్ళ మెదళ్ళలో గ్రాఫిక్స్ ల రూపంలో అమరావతిని చంద్రబాబు పదిలం చేసి ఉంచారు. మరో వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కధ తెలిసిందే. లేనిది ఉన్నట్లుగా చెప్పి బూమ్ క్రియేట్ చేయడం అలవాటు. ఆ విధంగా రాజధాని అమరావతి రాజధాని నామ్ కే వాస్తే ఉంది తప్పితే ఇప్పటికీ రాజధానికి ఏపీ నోచుకోలేదు. ఈ నేపధ్యంలో ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది.

అధికార వికేంద్రీకరణ…..

జగన్ పాదయాత్ర చేయడం అన్నది చాలా మంచిదైంది. జనం మదిలో ఏముందో ఆయన బాగా తెలుసుకున్నారు. రాయలసీమ నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం కొసవరకూ తిరిగిన జగన్ కి ఎక్కడ చూసినా అభివృధ్ధి లేమి, అసమానతలు కనిపించాయి. దాంతో ఆయన తాను అధికారంలోకి వస్తే ఏం చేయాలన్నది అపుడే నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఆయన అమరావతి రాజధాని విషయంలో తెలివిగా అడుగులు వేస్తున్నారనే చెప్పాలి. మొత్తానికి మొత్తం అభివృధ్ధిని కుప్పపోసి ఒకే చోట చేరిస్తే మళ్లీ ప్రాంతీయ భేదాలు, రాజకీయ వివాదాలు తలెత్తుతాయి. అందుకే జగన్ అధికారాన్ని, అభివృద్దిని అన్ని ప్రాంతాలకు సమానంగా పంచిపెట్టాలనుకుంటున్నారు. అందుకోసం ఆయన ఒకే చోట రాజధాని అని ఉంచాలనుకోవడంలేదంటున్నారు.

కీలకమైన ప్రాంతాల్లో….

బాగా వెనకబడిన ప్రాంతాల్లో రాజధానులను ఏర్పాటు చేయడం ద్వారా అభివృధ్ధిని చేప‌ట్టాలని జగన్ నిర్ణయించారని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ చెబుతున్నారు. విజయన‌గరం, కాకినాడ, గుంటూరు, కడపలలో రాజధానులు ఏర్పాటు చేయాలన్నది జగన్ ఆలొచనగా ఆయన చెప్పారు. అదే నిజమైతే ఒక్క రాజధాని కోసం పోరాడి గుడ్ల నీరు కక్కుకుని ఓడిపోయిన భావనతో వెనక్కి వచ్చేసిన ఆంధ్ర ప్రజలకు నాలుగు రాజధానులు లభించబోతున్నాయన్నమాట. ఇది నిజంగా జరిగితే గొప్ప పరిణామమే. రాజధానితో పాటు చుట్టు పక్కల ప్రాంతాలు కూడా అభివృధ్ధి చెందుతాయి.

పదమూడు జిల్లాల్లో…..

మొత్తంగా చూస్తే పదమూడు జిల్లాలలో సమాన అభివృధ్ధి సాధ్యమవుతుంది. ఈ విధంగా చేస్తే జగన్ మంచి పాలకుడిగా కూడా జనంలో చిరకాలం గుర్తుండిపోతారు. జగన్ తెగింపు, దూకుడు ఇపుడు ఏపీ అభివ్రుధ్ధికి ఎంతగానో ఉపయోగపడబోతున్నాయని కూడా అనిపిస్తోంది. మొత్తానికి నవ్యాంధ్రకు నాలుగు రాజధానులు అంటే ఇది తెలివైన ఆలొచనగా రాజకీయాలకు అతీతంగా అంతా అంటున్నారు. ఉప ముఖ్యమంత్రులను అయిదుగురికి వివిధ సామాజిక వర్గాలకు ఇచ్చిన జగన్ ఇపుడు ప్రాంతాల మధ్య సమాన న్యాయం సాధించాలనుకోవడం ఆహ్వానిచదగిన పరిణామమే.దీంతో చంద్రబాబు కలల రాజధాని అమరావతి ఇప్పుడు ముక్కలు కానుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాియ.

Tags:    

Similar News