ఇష్టపడటం లేదటగా…!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడులో ఘోర ఓటమి తర్వాత చాలా మార్పు కన్పిస్తోంది. గతంలో ఆయన వ్యవహరించిన తీరుకు ప్రస్తుతం అనుసరిస్తున్న తీరుకు పొంతన లేకుండా ఉందన్నది [more]

Update: 2019-07-21 13:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడులో ఘోర ఓటమి తర్వాత చాలా మార్పు కన్పిస్తోంది. గతంలో ఆయన వ్యవహరించిన తీరుకు ప్రస్తుతం అనుసరిస్తున్న తీరుకు పొంతన లేకుండా ఉందన్నది పార్టీ సీనియర్ నేతలే అంగీకరిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచినా, ఓటమి పాలయినా చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో టచ్ లో ఉంటూ వారిని తిరిగి కార్యాన్మోఖులను చేసేవారు. అలాగే ఎవరైనా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నప్పటికీ స్వయంగా పిలిచి బుజ్జగింపు చర్యలు చేపట్టేవారు.

సన్నిహితులు వెళ్లినా….

కానీ ఈసారి ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబునాయుడు బుజ్జగింపుల మాట ఊసెత్తడం లేదంటున్నారు. ఎంతమంది నేతలు పార్టీని వీడి వెళుతున్నప్పటికీ వారిని పిలిచి మాట్లాడేందుకు చంద్రబాబునాయుడు ఇష్టపడటం లేదు. తనకు అత్యంత సన్నిహితులైన సుజనాచౌదరి, సీఎం రమేష్ వంటి నేతలుపార్టీని వీడినా ఆయన పట్టించుకోలేదు. వారితో పాటు మరికొందరు పార్టీని వీడతారని తెలిసినా వారితో కూడా చంద్రబాబు చర్చలకు ఇష్టం చూపలేదు.

ప్రచారం జరుగుతున్న నేతలను…..

ఇక వరసగా తెలుగుదేశంపార్టీని వీడే నేతలు ఎక్కువగా ఉన్నారు. అనేక మంది నేతలు నిత్యం ప్రచారంలో ఉంటున్నాయి. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలపైనే ఎక్కువగా గురిపెట్టింది. గంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలకు చెెందిన నేతల పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. ఇందులో సుదీర్ఘకాలం నుంచి పార్టీని కనిపెట్టుకున్న వారు కూడా ఉన్నారు. అయినా సరే చంద్రబాబునాయుడు వారిని పిలిపించుకుని మాట్లాడాలన్న ఉద్దేశ్యంతో లేరని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.

మార్పు ఇందుకేనట…..

గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ అనేక మంది అసంతృప్త నేతలతో భేటీ అయి బుజ్జగించిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. అయితే ఈసారి చంద్రబాబు దానికి స్వస్తి పలికినట్లు కనపడుతోంది. ఘోర ఓటమి తర్వాత నిజమైన పార్టీ నేతలు ఎవరో తెలుసుకునేందుకు ఈ ఐదేళ్ల కాలంలో ఉపయోగపడుతుందని చంద్రబాబునాయుడు భావిస్తున్నట్లుంది. అందుకే ఎవరు వెళ్లినా చంద్రబాబు ఇప్పడయితే మాత్రం అభ్యంతరం వ్యక్తం చేయడం, బుజ్జగించడం వంటివి చేయరన్నది సుస్పష్టం.

Tags:    

Similar News