బాబు ఢిల్లీ దీక్ష వెనుక‌ ప‌క్కా వ్యూహం

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న చేతిలోని అన్ని అస్త్రాల‌ను పూర్తిగా వాడేస్తున్నారు. ఓ వైపు కొత్త సంక్షేమ ప‌థ‌కాలు, శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాల‌తో [more]

Update: 2019-02-09 00:30 GMT

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న చేతిలోని అన్ని అస్త్రాల‌ను పూర్తిగా వాడేస్తున్నారు. ఓ వైపు కొత్త సంక్షేమ ప‌థ‌కాలు, శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాల‌తో హోరెత్తిస్తూనే కేంద్రంపై పోరాటాన్ని తీవ్రంగా చేయాల‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ పాలిట బీజేపీ ఒక విల‌న్‌. ఆ విల‌న్‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న హీరోను తాను కావాల‌నేది చంద్ర‌బాబు ప్లాన్‌. ఇప్ప‌టికే జ‌గ‌న్.. బీజేపీతో కుమ్మ‌క్క‌యార‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున చేసినందున ఇప్పుడు బీజేపీకి వ్య‌తిరేకంగా తాను పెద్ద ఎత్తున ఉద్య‌మించ‌డం ద్వారా బీజేపీని వ్య‌తిరేకిస్తున్న ప్ర‌జ‌లు త‌న‌వైపు ఉంటార‌నేది ఆయ‌న వ్యూహంలా ఉంది. అందుకే ఆయ‌న ఛ‌లో ఢిల్లీ అంటున్నారు. ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్ష చేయాల‌ని సంక‌ల్పించారు. వాస్త‌వానికి చివ‌రి బ‌డ్జెట్ కూడా ప్ర‌వేశ‌పెట్టాక ఇప్పుడు దీక్ష చేసినా ఎటువంటి ప్ర‌యోజ‌న‌మూ ఉండ‌ద‌ని చంద్ర‌బాబు సైతం తెలుసు. అయితే, బీజేపీ ఏపీకి ద్రోహం చేసిన విష‌యాన్ని మ‌రింత చ‌ర్చ‌కు తేవాల‌నేది టీడీపీ వ్యూహం.

పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యేలా..!

ఢిల్లీ వేదిక‌గా చంద్ర‌బాబు దీక్ష‌కు భారీ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. స‌హ‌జంగానే ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి, అందునా బీజేపీయేత‌ర ప‌క్షంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు ఢిల్లీలో దీక్ష చేస్తున్నారంటే జాతీయ స్థాయిలో హైలెట్ అవుతుంది. ఈ దీక్ష‌కు పెద్ద ఎత్తున ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించేలా తెలుగుదేశం పార్టీ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింది. ఇందుకోసం ఏకంగా రెండు ప్ర‌త్యేక రైళ్ల‌నే బుక్ చేసింది.ఇక‌, నేత‌ల‌ను కూడా ఢిల్లీ రావాల్సిందిగా పార్టీ నాయ‌క‌త్వం స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది. కేవ‌లం టీడీపీ వారే కాకుండా ప్ర‌జాసంఘాలు, ఉద్యోగ సంఘాల‌ను కూడా ఢిల్లీ దీక్ష‌కు హాజ‌రుకావాల్సిందిగా టీడీవీ వ‌ర్గాలు కోరుతున్నాయి. ఇటీవ‌లి చంద్ర‌బాబు అఖిల‌ప‌క్ష స‌మావేశానికి వెళ్లిన సంఘాలన్నీ చంద్ర‌బాబు దీక్ష‌కు సైతం వెళ్లి సంఘీభావం తెలుప‌నున్నాయి.

ప్ర‌భుత్వం ఖ‌ర్చుతోనా..?

ఇక‌, చంద్ర‌బాబు దీక్ష‌కు జాతీయ స్థాయి నేత‌లు కూడా హాజ‌రుకానున్నారు. వీరంతా చంద్ర‌బాబుకు సంఘీభావం తెల‌ప‌నున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ హాజ‌ర‌వుతారా లేదా పార్టీ ప్ర‌తినిధిని పంపిపస్తారా తేలాల్సి ఉంది. మొత్తానికి ఢిల్లీలో ఒక రోజు దీక్ష ఎన్నిక‌ల వేళ చంద్ర‌బాబుకు బాగానే క‌లిసివ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే, అంతా బాగానే ఉన్నా… ఢిల్లీ దీక్ష‌కు ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి సొమ్ము ఖ‌ర్చు చేయ‌డం మాత్రం విమ‌ర్శ‌లకు తావిస్తోంది. ఇప్ప‌టికే ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లు, న‌వ నిర్మాణ దీక్ష‌ల పేరుతో డ‌బ్బు దుబారా చేశార‌నే విమ‌ర్శ‌లు ప్ర‌భుత్వంపై ఉన్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఇటువంటివి ఇబ్బందిగా మారే అవ‌కాశ‌మూ ఉంది.

Tags:    

Similar News