అక్కడ టీడీపీ పూర్తిగా క్లీన్ బౌల్డ్ .. కారణం ఇదేనా?

ఏపీలో ప్రధాన ప్రతిప‌క్షంగా ఉన్న టీడీపీ ప‌రిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దారుణ‌మైన స్థితిని ఎదుర్కొంటోందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీలో ప్రతిప‌క్షంగా ఉన్నప్పటికీ.. [more]

Update: 2020-07-16 08:00 GMT

ఏపీలో ప్రధాన ప్రతిప‌క్షంగా ఉన్న టీడీపీ ప‌రిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దారుణ‌మైన స్థితిని ఎదుర్కొంటోందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీలో ప్రతిప‌క్షంగా ఉన్నప్పటికీ.. పార్టీలో నేత‌ల‌ను కాపాడుకోలేక పోతోంద‌నే విమ‌ర్శలు ఎదుర్కొంటోంది. అదే స‌మ‌యంలో ప్రభుత్వం దూకుడు ముందు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే ప్రయ‌త్నం కూడా చేయ‌లేక పోతోంద‌నే వాద‌న టీడీపీ విష‌యంలో వినిపిస్తున్నది. సీనియ‌ర్ నేత‌లు పార్టీ మారిపోయారు. చంద్రబాబుకు పూర్తిగా దూరంగా ఉన్న నాయ‌కుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అదే స‌మ‌యంలో ప్రభుత్వం టీడీపీని టార్గెట్ చేస్తున్న తీరును కూడా పార్టీ నిలువ‌రించే ప్రయ‌త్నం చేయలేక పోతోంది.

30 నియోజకవర్గాలకు….

దీంతో ఏపీలో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. అయితే, చంద్రబాబు ఆయ‌న పార్టీ సీనియ‌ర్లు మాత్రం అవ‌కాశం ఉన్న మేర‌కు ప్రభుత్వంపై విరుచుకు ప‌డుతున్నారు. కానీ, త‌మ పార్టీ నేతల‌ను కానీ, పార్టీని కానీ కాపాడుకునే ప్రయ‌త్నం చేయ‌డం లేదు. ఇప్పటికే పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా కాగా.. వీరిలో చంద్రబాబు సామాజిక వ‌ర్గానికి చెందిన వారే ఏకంగా ఇద్దరు ఉన్నారు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి ఇన్‌చార్జ్‌లు కూడా లేరు. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాలు ఏపీలో 30 వ‌ర‌కు ఉన్నాయి.

అక్కడ పూర్తిగా…..

ఏపీలో పార్టీ ప‌రిస్థితి ఇలా ఉంటే.. తెలంగాణలో దీనికి మ‌రింత దారుణంగా ఉంది. 2018 డిసెంబ‌రులో జ‌రిగినతెలంగాణ ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌క్షాన గెలిచిన ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య చంద్రబాబుకు దూర‌మ‌య్యారు. స‌త్తుప‌ల్లి నుంచి ఆయ‌న టీడీపీ త‌ర‌పున ఏకంగా మూడుసార్లు విజ‌యం సాధించారు. ఇక ఇప్పుడు అక్కడ టీడీపీకి కేవలం ఒక్క అశ్వారావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర‌రావు మాత్రమే మిగిలారు. దీంతో చంద్రబాబును ప‌ట్టించుకునే నాథుడు లేడు. పోనీ, పార్టీని బ‌లోపేతం చేసుకుందామా? అంటే.. కేడ‌ర్ కూడాలేదు. ఏదో పేరుకు మాత్రమే టీడీపీ తెలంగాణ‌లో ఉంది త‌ప్ప.. ఉనికి మాత్రం ఎక్కడా క‌నిపించ‌డంలేదు. పార్టీ అధ్యక్షుడుగా ఎల్వీ ర‌మ‌ణ అతి క‌ష్టంమీద కొన‌సాగుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తున్నది.

బాబు ఎత్తుగడలు…

ఆయ‌న కూడా రేపో మాపో త‌న దారి తాను చూసుకునేందుకు రెడీగానే ఉన్నార‌ని టాక్‌.. ? మ‌రికొందరు సీనియ‌ర్లు కూడా ఈయ‌న బాట‌లోనే క‌ష్టం మీద నెట్టుకొస్తున్నారు. అక్కడి అధికార పార్టీ టీఆర్ఎస్‌ను ప‌న్నెత్తు మాట కూడా అన‌లేని, విమ‌ర్శించ‌లేని ప‌రిస్థితిలో టీడీపీ నేత‌లు ఉన్నారు. కీల‌క‌మైన నాయ‌కులను వ్యూహాత్మకంగా చంద్రబాబే గోడ దూకించార‌ని కొన్నాళ్ల కింద‌ట ప్రచారం జ‌రిగినా.. ఇప్పుడు వారు కూడా పార్టీకి అందిరావ‌డం లేదు. దీంతో తెలంగాణ‌లో టీడీపీ అనేది చ‌రిత్రే అనే మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. చంద్రబాబు వ్యూహాలు, ఎత్తుగ‌డ‌లు తెలంగాణ‌లో ఎక్కడా ప‌నిచేయ‌డం లేదు.

Tags:    

Similar News