చల్లా కలను జగన్ నెరవేరుస్తారా?

చల్లా రామకృష్ణారెడ్డి సీనియర్ నేత. రాయలసీమలో పట్టున్న నేత. ఆయన మృతితో కర్నూలు జిల్లాలో ఒక కీలక నేతను వైసీపీ కోల్పోయిందనే చెప్పాలి. చల్లా రామకృష్ణారెడ్డికి జగన్ [more]

Update: 2021-01-09 12:30 GMT

చల్లా రామకృష్ణారెడ్డి సీనియర్ నేత. రాయలసీమలో పట్టున్న నేత. ఆయన మృతితో కర్నూలు జిల్లాలో ఒక కీలక నేతను వైసీపీ కోల్పోయిందనే చెప్పాలి. చల్లా రామకృష్ణారెడ్డికి జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. తొలుత కాంగ్రెస్ లో తర్వాత టీడీపీలో అనంతరం వైసీపీలో చల్లా రామకృష్ణారెడ్డి చేరారు. చల్లా రామకృష్ణారెడ్డి 2014 ఎన్నికల్లోనే బనగాన పల్లె నియోజకవర్గం టిక్కెట్ ఆశించినా చంద్రబాబు టిక్కెట్ ఇవ్వలేదు. తర్వాత ఎమ్మెల్సీ ఇస్తానని కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన 2019 ఎన్నికలకు ముందు చల్లా రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరిపోయారు.

వైసీపీలో చేరేటప్పుడు…..

వైసీపీలో చేరిన వెంటనే జగన్ చల్లా రామకృష్ణారెడ్డికి హామీ ఇచ్చారు. నిజానికి చల్లా రామకృష్ణారెడ్డి తన కుమారుడు చల్లా భగీరధరెడ్డి భవిష్యత్ కోసమే వచ్చానని జగన్ కు వివరించారు. “అన్నా భగీరధ్ సంగతి నాకు వదిలెయ్. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నీకు మాత్రం ఎమ్మెల్సీ ఇస్తాను” అని జగన్ నాడు హామీ ఇచ్చారు. అలా చెప్పినట్లుగానే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చల్లా రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

కుమారుడి భవిష్యత్ ను…..

అయితే ఇప్పుడు ఆయన మృతితో చల్లా భగీరధరెడ్డి రాజకీయ భవిష్యత్ జగన్ పైనే ఆధారపడి ఉందంటున్నారు. చల్లాకు మాట ఇచ్చినట్లుగానే చల్లా భగీరధరెడ్డికి పార్టీలోనూ కీలక పదవి దక్కే అవకాశముందంటున్నారు. ఈ మేరకు జగన్ హామీ ఇచ్చారని చల్లా రామకృష్ణారెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. బనగానపల్లి నియోజకవర్గంలో గత ఎన్నికలలో వైసీపీ గెలవడానికి కూడా చల్లా రామకృష్ణారెడ్డి సహకారం వల్లనేనని జగన్ అన్నారని తెలుస్తోంది.

తండ్రికిచ్చిన పదవినే…..

దీంతో చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు భగీరధరెడ్డికి ఎమెల్సీ పదవి ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారంటున్నారు. తండ్రి పదవినే తనయుడికి ఇవ్వాలన్నది జగన్ నిర్ణయంగా కన్పిస్తుంది. కేవలం ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టకుండా పార్టీలోనూ కీలక పదవిని అప్పగించాలని జగన్ నిర్ణయించారంటున్నారు. మొత్తం మీద జగన్ చల్లా రామకృష్ణారెడ్డికి మాట ఇచ్చిన విధంగానే ఆయన కుమారుడు రాజకీయ భవిష్యత్తును తానే చూసుకుంటానని కుటుంబ సభ్యులకు జగన్ చెప్పినట్లు తెలిసింది.

Tags:    

Similar News