తగిలించిన తబ్లిగీని వదిలిపెట్టరట

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన తబ్లిగి జమాతే పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ మేరకు ఇప్పటికే తబ్లిగి జమాతే చీఫ్ మౌలానా [more]

Update: 2020-05-15 18:29 GMT

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన తబ్లిగి జమాతే పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ మేరకు ఇప్పటికే తబ్లిగి జమాతే చీఫ్ మౌలానా ఆజాద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా విదేశాల నుంచి భారీగా విరాళాలు సేకరించినందుకు మనీ ల్యాండరింగ్ కింద కూడా కేసు నమోదు చేసి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తుంది. భవిష్యత్తులో తబ్లిగి జమాతే కార్యకలాపాలపై కన్నేసి ఉంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రార్థనలే ప్రధాన కారణం కావడంతో…..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి తబ్లిగి జమాతే ప్రార్థనలే కారణమని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలకూ వైరస్ వ్యాప్తి చెందడానికి కారణం దీనివల్లనేనన్నది అందిరికీ తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి వీరు మూకుమ్మడి సమావేశాలు నిర్వహించారు. ఇక్కడే వ్యాధి అంటుకుంది. విదేశాల నుంచి వచ్చిన వారితో వ్యాధి సంక్రమించి అది దేశ వ్యాప్తంగా విస్తరించడానికి కారణమయింది.

విచారణలో ఆసక్తికరమైన…..

అయితే పోలీసు విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. మార్చి 13 నుంచి 24వ తేదీ వరకూ నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో ప్రార్థనలు జరిగాయి. అయితే మొన్నటి వరకూ ఈ సమావేశంలో కేవలం ఎనిమిది వేలమంది మాత్రమే పాల్గొన్నారని భావించారు. కానీ విచారణలో మాత్రం దాదాపు 16,500 మంది పాల్గొన్నట్లు తేలింది. జమాతే ప్రార్థనల్లో పాల్గొన్న వారి సెల్ ఫోన్ల ఆధారంగా అందరి వివరాలను సేకరించారు.

ట్రేస్ చేయడానికి…..

మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం వీరిలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. వారిని ట్రేస్ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమించాల్సి వచ్చింది. ప్రధానంగా తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు వెళ్లారు. ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి వీరందరినీ ట్రేస్ చేయడానికి తల ప్రాణం తోకకు వచ్చింది. వీరిందరితో పాటు వారితో కాంటాక్టు అయిన వారిని క్వారంటైన్ కు తరలించాల్సి వచ్చిందని పోలీసు శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించిన తబ్లిగి జమాతే సంస్థపై నిషేధం విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News