ఆ ఆశలు మాత్రం పెట్టుకోకండి.. ఏప్రిల్ 14 తర్వాత కూడా?

లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. ఏప్రిల్ 14వ తేదీ వరకూ కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. పదిహేనో తేదీ నుంచి లాక్ [more]

Update: 2020-04-09 18:29 GMT

లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. ఏప్రిల్ 14వ తేదీ వరకూ కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. పదిహేనో తేదీ నుంచి లాక్ డౌన్ ఎత్తి వేస్తారని కోట్లాది మంది ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు ఉపాధి లేక గత ఇరవై రోజుల నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వాలు ఆదుకుంటుంది అరకొరమాత్రమే. దీంతో లాక్ డౌన్ ను ఈ నెల 15వ తేదీకి ఎత్తి వేయాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు.

అన్ని రాష్ట్రాలూ….

కానీ రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజటివ్ కేసులు కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. నాలుగు రోజలకు ఒకసారి డబుల్ అవుతున్నాయి. ఏప్రిల్ పథ్నాలుగో తేదీకి మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది. కరోనా పాజిటివ్ కేసులు కంట్రోల్ కాకుంటే లాక్ డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై కేంద్రప్రభుత్వం పెద్దలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వెయ్యి నుంచి రెండు వేలకు చేరడానికి ఐదు రోజులు పడితే రెండు నుంచి మూడు వేల కు చేరడానికి కేవలం రెండు రోజులే సమయం పట్టింది.

పునరాలోచనలో పడిందా?

దీంతో కరోనా వైరస్ విస్తృతి ఎక్కువగా ఉందని అంచనా వేసింది. అందుకే లాక్ డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడిందని ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. లాక్ డౌన్ ను మరికొంత కాలం పొడిగిస్తే బాగుంటుందని నిపుణులు సయితం సూచిస్తున్నారు. దీంతో అంత కఠిన ఆంక్షలు కాకుండా కొంత సడలింపు చేస్తే బాగుంటుందని సూచనలు అందుతున్నాయి. ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతాల్లో మాత్రం నిషేధం ఏప్రిల్ 14 వ తేదీన తర్వాత కూడా కొనసాగిస్తారు.

పథ్నాలుగు తర్వాత కూడా….

నిత్యావసర వస్తువులు, మెడికల్ షాపులకు మాత్రం పదిహేనో తేదీ తర్వాత కూడా అనుమతి ఉంటుంది. ఇక పర్యాటక ప్రదేశాలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు వంటి వాటిని మరికొంత కాలం మూసివేయక తప్పదన్న అభిప్రాయంలో ఉంది. దీంతోపాటు ప్రజా రవాణాను పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఆ యా రాష్ట్రాల్లో పరిస్థితిని బట్టి ఆ ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయి. కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మరి కొంత కాలం లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉంటుంది. అలాగే విమానాలకు దేశీయంగా అనుమతివ్వాలని అనుకుంటున్నారు. మొత్తం మీద ఏప్రిల్ 14వ తేదీతో లాక్ డౌన్ ముగిసినా.. అనధికారికంగా లాక్ డౌన్ మాత్రం కొనసాగుతుందని చెబుతున్నారు.

Tags:    

Similar News