రామక్రిష్ణులు మంత్రులవుతారా ?

మోడీ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా పదిహేను నెలలు కావస్తోంది. విస్తరణ అంటూ లేదు, ప్రమాణం చేసినపుడు ఉన్న వారే ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఈ మధ్యలో ఎన్నో రాజకీయ [more]

Update: 2020-08-14 15:30 GMT

మోడీ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా పదిహేను నెలలు కావస్తోంది. విస్తరణ అంటూ లేదు, ప్రమాణం చేసినపుడు ఉన్న వారే ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఈ మధ్యలో ఎన్నో రాజకీయ పరిణామాలు జరిగాయి. రాజ్యసభలో బలం పెరిగింది. కొందరికి ఆశ పెట్టారు, మరికొందరికి కచ్చితంగా పదవులు ఇవ్వాలి. ఇంకొన్ని చోట్ల పార్టీని బలోపేతం చేసుకోవడానికి మంత్రులను తీసుకోవాలి. ఈ మొత్తం కసరత్తు మీద మోడీ, అమిత్ షా త్వరలోనే దృష్టి పెడతారని అంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఈసారి మరిన్ని పదవులు వస్తాయని చెబుతున్నారు.

ఏపీ నుంచి ఎవరో…?

ఏపీ నుంచి చంద్రబాబు హయాంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండేవారు. ఎందుకంటే నాడు బాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇక్కడో రెండు పదవులు ఇచ్చి అక్కడ రెండు పదవులు తీసుకున్నారు. అలా అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలకు బెర్తులు దక్కాయి. జగన్ కి బీజేపీతో పొత్తు లేదు, పదవులు ఇస్తామన్నా వద్దంటున్నారు. ఇక ఏపీలో బీజేపీకి లోక్ సభ సభ్యులు లేరు, ఫిరాయింపు ఎంపీలు మాత్రం రాజ్యసభలో ఉన్నారు. దాంతో ఇస్తే గిస్తే వీరికే పదవులు ఇవ్వాలి. బీజేపీ తీరు చూస్తూంటే చంద్రబాబును దూరం పెట్టాలని ఉంది. కోరి కోరి సుజనాచౌదరికో, మరొకరికో పదవులు ఇస్తారా అన్నది ఒక డౌట్. మరి ఎవరికి చాన్స్ అన్నదే చర్చగా ఉంది.

ఆ ఇద్దరిలో ఒకరా …?

ఏపీ నుంచి వారణాసి రాం మాధవ్ అని ఒకరు బీజేపీలో దశాబ్దాల బట్టి పనిచేస్తున్న సంగతి ఈ రెండు మూడేళ్ళలోనే అందరికీ బాగా తెలిసింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయన మోడీ, అమిత్ షాలకు చాలా సన్నిహితుడు, తనకు పదవులు వద్దు పార్టీ ముద్దు అని బుద్దిగా పనిచేసుకునిపోయే ఆరెస్సెస్ భావజాలం నిండా ఉన్నవారు. ఆయన్ని కేంద్ర మంత్రి చేస్తారా అన్న చర్చ అయితే ఉంది. ఎందుకంటే బీజపీకి బ్రాహ్మణుల మద్దతు కావాలి. వారు మొదటి నుంచి ఆ పార్టీ పట్టుగొమ్మలుగా ఉన్నారు. ఏపీలో సామాజికవర్గాల పరంగా కొత్త ఎత్తులు వేస్తున్న వేస్తున్న బీజేపీ తన పాత మద్దతు కులాలను ప్రోది చేసుకుంటోందని అంటున్నారు. ఒకవేళ రాంమాధవ్ కాదంటే కనుక ప్రకాశం జిల్లాకు చెందిన జీవీఎల్ నరసింహారావుకు లక్కీ చాన్స్ దక్కవచ్చునని అంటున్నారు. ఆయన కూడా బ్రాహ్మణ సామాజికవర్గం నేతే. పైగా చంద్రబాబు అంటే రెచ్చిపోయి మరీ హాట్ కామెంట్స్ చేయగల నేర్పరి.

మురళీగానమేనా ….

ఇక తెలంగాణా నుంచి తీసుకుంటే మురళీధరరావుకి ఈ దఫా చాన్స్ తప్పకుండా దక్కుతుంది అంటున్నారు. ఆయన కూడా రాం మాధవ్ మాదిరిగా పార్టీ కోసం కష్టపడే నిఖార్స్ అయిన నేత. బీజేపీకి తెలంగాణాలో బ్యాక్ బోన్. బీసీ సామాజికవర్గానికి చెందిన మురళీధరరావుకు న్యాయం చేయాలని అటు మోడీకి, ఇటు అమిత్ షాలకు ఉందని చెబుతున్నారు. ఆయన కాకపోతే లక్ష్మణ్ రేసులో ఉన్నారట. ఇక తెలంగాణాకు ఎక్కువ ప్రాధాన్యత ఈసారి ఇస్తారని వినిపిస్తోంది. మొత్తం మీద ఏపీలో రామమాధవుడు, తెలంగాణాలో మురళీధరుడైన క్రిష్ణుడు ఇద్దరూ కేంద్ర మంత్రులు బీజేపీఅవుతారు అని జోరుగా వినిపిస్తున్న మాట.

Tags:    

Similar News