ముంబయి పోలీసులా మజాకా అన్నారు.. ఇప్పుడేమైంది?

ముంబయి పోలీసుల తీరే వేరు. దేశ వ్యాప్తంగా ముంబయి పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ మాటలు ఎవరు అన్నవో కావు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ [more]

Update: 2020-09-04 16:30 GMT

ముంబయి పోలీసుల తీరే వేరు. దేశ వ్యాప్తంగా ముంబయి పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ మాటలు ఎవరు అన్నవో కావు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసును సీబీఐ కి అప్పగించాలన బీహార్ ప్రభుత్వ నిర్ణయంతో వీరు అన్న మాటలివి. ముంబయి పోలీసులు సుశాంత్ ఆత్మ హత్య కేసును దాదాపు పదిహేను రోజుల పాటు దర్యాప్తు చేసినా ఎటువంటి ఫలితం లేదు.

ఆసక్తికరమైన విషయాలు…..

సీబీఐ గత ఐదురోజులుగా చేస్తున్న విచారణలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముంబయి పోలీసులు ఈ కేసులో అనేక మందిని విచారించారు. సినీ నిర్మాతలతో పాటు సుశాంత్ సన్నిహితులను కూడా విచారించారు. కానీ ఎలాంటి పురోగతి కన్పించ లేదు. పైగా ముంబయి పోలీసులు కొందరిని కాపాడేందుకే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు కూడా విన్పించాయి. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ కేసును సీబీఐకి చేపట్టింది.

తడబడుతూ సమాధానాలు…..

సీబీఐ దర్యాప్తులో పలు ఆసక్తి కరమైన విషయాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి సీబీఐ ప్రశ్నలకు తడబడి సమాధానాలు చెబుతున్నారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఒక దశలో సీబీఐ అరెస్టు చేయాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. సీబీఐ దర్యాప్తులో డ్రగ్స్ వాడకంపై కూడా ఒక క్లారిటీ వచ్చింది. రియాకు డ్రగ్స్ డీలర్స్ తో ఉన్న సంబంధాలపై కూడా రియాను ప్రశ్నించారు. రియా ఫోన్ కాల్్ లిస్ట్ ల ద్వారా డ్రగ్స్ పై సీబీఐ ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించినట్లు తెలిసింది.

మృతదేహంపై వాతలు….

మరోవైపు సుశాంత్ మృతదేహం పై వాతలు ఉండటం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. సుశాంత్ చనిపోయిన వెంటనే ఆయన కంప్యూటర్ నుంచి డిస్క్ లను ధ్వంసం చేయడాన్ని కూడా సీబీఐ సవాల్ గా ఈకేసులో తీసుకుంది. పదకొండు నెలల్లో సుశాంత్ 4.60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వైనం పై కూడా సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది. రియా సోదరుడి కోసం తొమ్మిదిన్నర లక్షలు ఖర్చు చేశాడు. అలాగే రియా మేకప్ కోసం మూడున్నర లక్షలను ఖర్చు చేశారు. రియాతో పాటు ఆమె సోదరుడు షోయక్ చక్రవర్తిని విడివిడిగా సీబీఐ విచారణ చేశారు. అయితే ముంబయి పోలీసుల దర్యాప్తులో తేలని అంశాలు కూడా సీబీఐ దర్యాప్తులో బయటకు వస్తుండటంతో మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని తెలుస్తోంది.

Tags:    

Similar News