సీబీఐ ఐదేళ్లు ఏపీలో విచారణ చేయాలేమో?

విపక్షాలను కట్టడి చేయడానికి సీబీఐ సరైన సమాధానంగా అధికార పార్టీకి కన్పిస్తున్నట్లుంది. అందుకే ప్రతి కేసును సీబీఐ కి ఇచ్చేందుకే ఏపీ ప్రభుత్వం ఇష్టపడుతుంది. ఇందుకు కారణాలు [more]

Update: 2020-09-22 00:30 GMT

విపక్షాలను కట్టడి చేయడానికి సీబీఐ సరైన సమాధానంగా అధికార పార్టీకి కన్పిస్తున్నట్లుంది. అందుకే ప్రతి కేసును సీబీఐ కి ఇచ్చేందుకే ఏపీ ప్రభుత్వం ఇష్టపడుతుంది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. సీబీఐ విచారణ అంటేనే గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. వారి నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పే పరిస్థితి ఉండదు. జగన్ ఈ రకమైన ప్రశ్నలను గతంలో ఎదుర్కొన్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ లకు కూడా సీబీఐ రుచి చూపించాలని భావిస్తున్నట్లుంది.

తాజాగా వీటిపై కూడా…..

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం సీబీఐ కాలం నడుస్తున్నట్లుంది. తాజాగా అంతర్వేది రధం దగ్దంతో పాటు అమరావతి రాజధాని భూముల కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ లో జరిగిన అవినీతిపై సీబీఐకి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పట్టుబడుతుంది. దీంతో సీబీఐ విచారణ కేసుల సంఖ్య ఏపీలో పెరిగిపోతున్నాయి. ప్రత్యర్ధులను ఇరకాటంలో పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సీబీఐ మంత్రం పఠిస్తున్నట్లు స్పష్టంగా కనపడుతుంది.

బాబు నాడు వద్దని…..

ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు విషయానికొస్తే గతంలో అధికారంలో ఉన్నప్పుడు సీబీఐని వద్దు పొమ్మన్నారు. రాష్ట్రంలో అడుగుపెట్టనీయమని జీవో తెచ్చారు. మమత బెనర్జీతో కలసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోల్ కత్తాలో ధర్నాలో కూడా పాల్గొన్నారు. కానీ చంద్రబాబు ప్రతిప‌క్షంలోకి వచ్చిన తర్వాత ప్రతి విష‌యానికీ సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఆయన కోరుకున్నట్లుగానే ఇప్పుడు అమరావతి, ఫైబర్ గ్రిడ్ లను కూడా జగన్ సీబీఐకి అప్పగించేందుకు సిద్ధమయ్యారు.

ఖచ్చితత్వం ఉన్నా… విచారణ మాత్రం….?

ఇంతకీ సీబీఐ కేసుల్లు వాస్తవికత అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆధారాలతో సహా సీబీఐ దోషులను పట్టుకుంటుందన్న నమ్మకం ఉంది. అయితే సీబీఐపై మరో ఆరోపణ కూడా లేకపోలేదు. కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అన్న విమర్శను పక్కన పెడితే సీబీఐ విచారణ ఎంతకాలం పడుతుందనేది చెప్పలేని పరిస్థితి. ఏళ్ల పాటు విచారణ జరిగిన కేసులు కూడా ఉన్నాయి. దీంతో రాజకీయ వేధింపుల కోసమే సీబీఐని వాడతారన్న వాదన కూడా లేకపోలేదు. మొత్తం మీద ఏపీలో సీబీఐకి చాలా పని ఉన్నట్లు కనపడుతుంది.

Tags:    

Similar News