ఛీ.. ఛీ.. ఇక్కడ కూడా కులం కంపేనా?

రాష్ట్ర రాజకీయాల్లో ఇపుడు కుల రాజకీయం జోరుమీద ఉంది. రెడ్లు ఇపుడు సీఎం సీట్లో కూర్చున్న్నారు. అందువల్ల కమ్మలు రగులుతున్నారు. అయితే దీన్ని పైకి టీడీపీ, వైసీపీల [more]

Update: 2020-07-06 13:30 GMT

రాష్ట్ర రాజకీయాల్లో ఇపుడు కుల రాజకీయం జోరుమీద ఉంది. రెడ్లు ఇపుడు సీఎం సీట్లో కూర్చున్న్నారు. అందువల్ల కమ్మలు రగులుతున్నారు. అయితే దీన్ని పైకి టీడీపీ, వైసీపీల మధ్య రాజకీయ యుధ్ధంగా చూపిస్తున్నా కూడా బలమైన సామాజికవర్గాల మధ్య భీకర సమరమే సాగుతోంది. సరే ఈ సమరంలో కూడా మానవులు, దానవులు అన్న కొత్త చర్చ ఇపుడు సోషల్ మీడియా వేదికగా ముందుకువస్తోంది. కమ్మవారు ఎపుడూ మానవ జాతి హితం కోరుకుంటారని, వారు అన్నివిధాలుగా ముందుండి అందరి శ్రేయస్సుని కాంక్షిస్తారని సోషల్ మీడియాలో పోస్టింగుల యుధ్ధం సాగుతోంది. ఇంతకీ కధ ఏంటి అంటే కరోనా వేళ వ్యాక్సిన్ కనిపెడుతున్న ఓ సంస్థ కమ్మవారిదిట.

నిజమేనా….?

తమ సంస్థ తయారు చేసే వ్యాక్సిన్ ఇపుడు మానవులందరికీ ప్రాణ వాయువు అని ఆ సామాజికవర్గం రెట్టించిన ఉత్సాహంతో సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతోంది. మా మీద కక్షతో వ్యాక్సిన్ తీసుకోవడం మానేయకండి అంటూ అక్కడ రెడ్లను రెచ్చగొడుతున్నారు. అయితే దేశంలో కానీ ఇతర దేశాలో తయారయ్యే వ్యాక్సిన్ లో రెడ్లకు చెందిన బయోఫార్మా పరిశ్రమలు ఉన్నాయని రెడ్డి మద్దతుదార్లు రిప్లై ఇస్తున్నారు. సరే ఇపుడు కరోనా నుంచి తప్పించుకోవడానికి వ్యాక్సిన్ అవసరం అందరికీ ఉంది. మరి ఇందులో కూడా కుల ప్రస్తావన ఏంటి, ఇందులో కూడా ఏపీ రాజకీయాల రొచ్చు ఏంటి అన్నది కూడ మేధావులు బాధపడేలా ఉందంటున్నారు.

అంతా గొప్పవారే….

ఇక ఈ సోషల్ మీడియా యుధ్ధం ఎలా ఉంది అంటే కమ్మ వారికి కులం లేదని, సమాజం ఉద్ధరణే వారికి ముఖ్యమని అంటున్నారు. తాము ఎపుడూ ప్రపంచంతో నడుస్తూ ఒక అడుగు మిగిలిన సామాజికవర్గాల కన్నా ముందుంటామని చెప్పుకోవడమే కొత్త రచ్చకు దారితీస్తోంది. చరిత్ర ఒకసారి చూస్తే ఈ దేశంలో అన్ని కులాలా వారు పాలించారు. ఓట్ల రాజకీయం కాబట్టి బ్రాహ్మణులు ఇతర అగ్రకులాలు వెనకబడ్డాయి కానీ ఎవరికి తెలివి లేదు. ఎవరు తక్కువ తిన్నారు అన్నది మేధావులు వేస్తున్న ప్రశ్న.

ఇదే ప్రమాదమా…?

కవులు, కళాకారులు అన్ని కులాల్లో ఉన్నారు. ఇక పాలకులు కూడా ఉన్నారు. అభ్యుదయకాములు కూడా అన్ని సామాజికవర్గాలలో ఉన్నారు. ఇపుడు సైంటిస్టులు పరిశోధనలు చెసేవారికి కులాన్ని అంటగట్టగలమా. అది కూడా మానవజాతికే పెను సవాల్ చేస్తున్న కరోనా మహమ్మారి వీర విహారం చేస్తున్న వేళ మా కులం వాళ్ళు వ్యాక్సిన్ అంటూ ఎవరైనా చెప్పుకుంటే అంతకటే మానవత్వానికి మచ్చ లేదుగా. ఏది ఏమైనా కులాలు ఉన్నాయి, ఇది అంగీకరించాల్సిన విషయం. అలాగే అందరూ మానవులే, ఆపదలో ఒక్కటిగా ఉండాలి. ఇది కూడా నిజాయతీగా ఒప్పుకుని తప్పులు దిద్దుకుని అంతా ఒక్కటే అన్న భావనకు రావాలి. కానీ రాజకీయం కులం కంపు కొడుతూ ఇపుడు వ్యాక్సిన్ దాకా రావడం అంటే కరోనా కంటే ఇదే ప్రమాదకారమే మరి.

Tags:    

Similar News