విజయ్ కాంత్ కు మరో దారిలేకనేనా?

నాయకత్వం అంటే నలుగురికి దారి చూపేలా ఉండాలి. ఏ నాయకుడైనా తాను ముందుండి నేతలను నడిపించాలి. కానీ తమిళనాడులో మాత్రం పాలిటిక్స్ డిఫరెంట్ గా కన్పిస్తున్నాయి. డీఎండీకే [more]

Update: 2021-03-30 18:29 GMT

నాయకత్వం అంటే నలుగురికి దారి చూపేలా ఉండాలి. ఏ నాయకుడైనా తాను ముందుండి నేతలను నడిపించాలి. కానీ తమిళనాడులో మాత్రం పాలిటిక్స్ డిఫరెంట్ గా కన్పిస్తున్నాయి. డీఎండీకే అధినేత విజయ్ కాంత్ పోటీ చేయడం లేదు. విజయ్ కాంత్ పోటీ చేయకపోవడం డీఎండీకేలోనే చర్చనీయాంశంగా మారింది. ఆరోగ్య సమస్యల కారణంగానే పోటీకి దూరంగా ఉంటున్నానని విజయ్ కాంత్ చెబుతున్నప్పటికీ క్యాడర్ లో మాత్రం వేరే సంకేతాలు వెళ్లాయి.

ఆ కూటమి నుంచి బయటకు వచ్చి…..

నిజానికి డీఎండీకే అన్నాడీఎంకే కూటమిలో వెళ్లాల్సి ఉంది. అయితే అక్కడ సీట్ల సర్దుబాటులో తేడా కొట్టడటంతో విజయకాంత్ కూటమి నుంచి బయటకు వచ్చారు. నిజానికి తొలి నుంచి కమల్ హాసన్ తృతీయ కూటమిలోకి రావాలని విజయ్ కాంత్ ను ఆహ్వానిస్తునే ఉన్నారు. డీఎంకే కూడా ప్రయత్నించింది. అయితే అన్నాడీఎంకే పైనే విజయ్ కాంత్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. పార్టీని ఆర్థికంగా నడపలేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

ఆరోగ్య కారణాలతో….

విజయ్ కాంత్ గత కొంతకాలం నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా ఆయన పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. దీంతో పార్టీ కోశాధికారి, విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత అంతా తానే అయి చూసుకుంటున్నారు. పొత్తుల్లో భాగంగా అన్నాడీఎంకే నేతలతో పరోక్షంగా ప్రేమలత చర్చలు జరిపారు. అయితే చివరకు అన్నాడీఎంకే నుంచి బయటకు రావడంతో ప్రేమలత సూచన మేరకు దినకరన్ పార్టీ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ ఎన్నికల్లోనే దూరం…..

దినకరన్ పార్టీ పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. శశికళ కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. దీంతో దినకరన్ తమ పార్టీకి 60 స్థానాలు ఇచ్చారని చెప్పుకోవడానికి బాగుంటుందే కాని విజయ్ కాంత్ కు పెద్దగా స్థానాలు దక్కే అవకాశాలు లేవన్న అంచనా ఉంది. అందుకే విజయ్ కాంత్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించారు. అయితే ఆయన ప్రేమలత మాత్రం విరుదాచలం నుంచి పోటీ చేస్తున్నారు. 2006 నుంచి పోటీ చేస్తున్న విజయ్ కాంత్ ఈసారి పోటీకి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News