సేమ్ టూ సేమ్ … కానీ సీన్ రివర్స్

అమరావతి ని రాజధానిగా ప్రకటించేటప్పుడు గత ప్రభుత్వ అధినేత చంద్రబాబు వెనుకబడిన ప్రాంతాలకు వరాలు ప్రకటించారు. ఉత్తరాంధ్ర కేంద్రం విశాఖను నాలెడ్జ్ హబ్ గా చేస్తామని, రాయలసీమను [more]

Update: 2019-12-27 05:00 GMT

అమరావతి ని రాజధానిగా ప్రకటించేటప్పుడు గత ప్రభుత్వ అధినేత చంద్రబాబు వెనుకబడిన ప్రాంతాలకు వరాలు ప్రకటించారు. ఉత్తరాంధ్ర కేంద్రం విశాఖను నాలెడ్జ్ హబ్ గా చేస్తామని, రాయలసీమను పారిశ్రామికంగా తీర్చిదిద్దుతాం అంటూ చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు అదే ఫార్ములా వైసిపి ఉపయోగిస్తుంది. అమరావతిని నాలెడ్జ్ హబ్ చేస్తామంటూ గతంలో చంద్రబాబు విశాఖకు ఇచ్చిన హామీని తిప్పికొట్టింది వైసిపి సర్కార్. రాయలసీమ లో కూడా న్యాయ రాజధాని ఒక్కటే సరిపోదన్న ఆందోళన మొదలైంది.

మాకేంటి …?

ఇప్పుడు రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల్లో ఒక చర్చ మాత్రం మొదలైంది. అదే ఇప్పుడు మాకేంటి అని ? మా ప్రాంతానికి ఈ సర్కార్ ఏమి చేస్తుందన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి లోనే రాజధాని వుండాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మొదలు పెట్టడం లేదా అనుకూలంగా తీర్మానాలు చేయించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రాంతాలవారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. తమ తమ ప్రాంతాల అభివృధ్ధికోసం గళం విప్పుతున్నారు. ప్రాంతాల వారీగా తమ కు దక్కాలిసిన వాటాను ఇవ్వలిసిందే అంటున్నారు.

సీమలో గొంతెత్తిన నేతలు …

ఈ విషయంలో రాయలసీమ నుంచి గట్టిగా అక్కడి నేతల నుంచి గొంతు వినవస్తుంది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి, మైసూరా రెడ్డి, టిజి వెంకటేష్ వంటివారంతా సీమ సంగతి తేల్చాలని అనడం గమనిస్తే ఇప్పట్లో త్రిబుల్ కేపిటల్స్ పై మొదలైన వివాదం ఇప్పట్లో చల్లారేలా కానరావడం లేదు. అది గమనించే ఇటీవల సీమలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కడప లో ముఖ్యమంత్రి శంఖుస్థాపనలు చేశారు. చేనేతలకు జగన్ అనంతపురం వేదికగా వరాలు కురిపించారు. ఇలా సీమ లో అలజడి రేగకుండా సీఎం ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా అక్కడ నిరసన జ్వాలలు శ్రీబాగ్ ఒప్పందం అమలు అంటూ గట్టిగానే అంతా ప్రశ్నిస్తున్నారు. ప్రాంతాల వారి వస్తున్న డిమాండ్ లను ఇప్పుడు సర్కార్ ఎలా సర్దుమణిగేలా చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News