ఇక కాపాడుకోవాల్సిందెలా?

మహారాష్ట్ర రాజకీయం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పలేం. అందుకు అర్థరాత్రి జిరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనం. దేవేంద్ర ఫడ్నవిస్ కు బలనిరూపణ కోసం గవర్నర్ వారం [more]

Update: 2019-11-23 17:30 GMT

మహారాష్ట్ర రాజకీయం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పలేం. అందుకు అర్థరాత్రి జిరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనం. దేవేంద్ర ఫడ్నవిస్ కు బలనిరూపణ కోసం గవర్నర్ వారం రోజులు సమయం ఇచ్చారు. ఈ నెల 30వ తేదీ లోగా దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. వారంరోజుల సమయం బీజేపీకి ఎక్కువేనని చెప్పాలి. ఎందుకంటే ఆరుగంటల్లో ఒక పార్టీని చీల్చిన ఘనత ఉన్న బీజేపీ వారం రోజుల వ్యవధిలో ఏదైనా? ఏమైనా? చేయగలదు. ఇప్పుడు అదే టెన్షన్ అన్ని పార్టీల్లోనూ నెలకొని ఉంది.

వారం రోజులు సమయం……

భారతీయ జనతా పార్టీ, ఎన్సీపీలు కలసి ప్రభుత్వాన్ని ప్రస్తుతానికి ఏర్పాటు చేశాయి. ఎన్సీపీ ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేసి ఇవ్వడంతో గవర్నర్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎమ్మెల్యేలు తమ వెంటే ఉన్నారని చెబుతున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేల చేత మీడియా సమావేశంలోనూ మాట్లాడించారు. కానీ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో 22 నుంచి 35 మంది వరకూ శాసనసభ్యులున్నారని చెబుతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉంటే బీజేపీ బలనిరూపణ పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

అనర్హత వేటుపడుతుందని…..

కానీ శరద్ పవార్ చేసిన హెచ్చరికలతో ఎన్సీపీ ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోతేనే అసలు సమస్య తలెత్తుతుంది. శరద్ పవర్ అజిత్ పవార్ వెంట వెళ్లే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. ఇప్పటికే ఎన్సీపీలో చీలిక తెచ్చిన బీజేపీ శివసేన, కాంగ్రెస్ లను కూడా వదలిపెట్టకపోవచ్చన్న అనుమానం ఆ పార్టీ నేతల్లో కలుగుతోంది. అందుకే హుటాహుటిన కాంగ్రెస్ అగ్రనేతలు ముంబయికి చేరుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

శిబిరాలకు తరలింపు…..

వారం రోజుల్లో ఏదైనా జరగొచ్చని భావించిన ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు తమ పార్టీ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లో ఉన్న రిసార్ట్స్ కు తరలించాలని ఈ మూడు పార్టీలూ భావిస్తున్నాయి. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో అక్కడయితే సేఫ్ అని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ చేజారి పోకుండా చూసుకునేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగారు. ఫడ్నవిస్ బలాన్ని నిరూపించుకోలేకపోతే ఛాన్స్ దక్కే అవకాశముండటంతో ఇప్పుడు ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లు ఉన్నాయి.

Tags:    

Similar News