నెక్ట్స్ టైమ్ బెటర్ లక్

సి. రామచంద్రయ్య…సీనియర్ నేత. సి.రామచంద్రయ్యకు ఖచ్చితంగా వైఎస్ జగన్ ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తారనుకున్నారు. కానీ తొలి దఫాలో సి.రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. మూడు ఎమ్మెల్సీ [more]

Update: 2019-08-17 14:30 GMT

సి. రామచంద్రయ్య…సీనియర్ నేత. సి.రామచంద్రయ్యకు ఖచ్చితంగా వైఎస్ జగన్ ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తారనుకున్నారు. కానీ తొలి దఫాలో సి.రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. మూడు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అయితే అందులో ముగ్గురిని ఎంపిక చేశారు జగన్. ఒకరు మంత్రి మోపిదేవి వెంకటరమణ కాగా, ఇద్దరు రాయలసీమ జిల్లాలకు చెందిన చల్లా రామకృష్ణారెడ్డి, మహ్మద్ ఇక్బాల్. అయితే తనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని సిఆర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

వారికంటే ముందు చేరినా….

నిజానికి సి.రామచంద్రయ్య మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డిల కంటే ముందుగా పార్టీలో చేరారు. తెలంగాణలో 2018 లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడాన్ని సి.రామచంద్రయ్య వ్యతిరేకించారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని తప్పు చేశారంటూ బహిరంగంగానే విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చిన సి.రామచంద్రయ్య తర్వాత ప్రజారాజ్యంలో చేరి కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఆ పార్టీలోనే కొనసాగారు. ఆయనకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు.

కాపు నేత కావడం….

ఇక టీడీపీతో కాంగ్రెస్ పొత్తును తెలంగాణ ఎన్నికల్లో పెట్టుకున్నాక సి.రామచంద్రయ్య వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ పాదయాత్ర విజయనగరంలో ఉన్నప్పుడు 2018 నవబంరు నెలలో సిఆర్ పార్టీ కండువా కప్పుకున్నారు. సి.రామచంద్రయ్య కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో ఆయన రాకతో పార్టీకి మరింత బలం చేకూరింది. అంతేకాదు చంద్రబాబును విమర్శించేందుకు కూడా మరొక గొంతు దొరికిందని అప్పట్లో వైసీపీ నేతలు అన్నారు కూడా.

రెండో దఫాలో…..

కానీ సి.రామచంద్రయ్యకు తొలి దఫా ఎమ్మెల్సీ పదవి రాకపోవడానికి కారణమంటూ ఏమీ లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కడప జిల్లాకు చెందిన నేత కావడంతోనే జగన్ తొలి దఫా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని కూడా అభిప్రాయం ఉంది. సీఆర్ కు ఖచ్చితంగా జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తారని, అయితే అది ఎప్పుడనేది మాత్రం తెలియదని వైసీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. మొత్తం మీద సి.రామచంద్రయ్య ఎమ్మెల్సీ పదవి దక్కుతుందనుకున్నా దక్కలేదు. రెండో దఫాలో అవకాశముంటుందని గట్టిగా సి.రామచంద్రయ్య నమ్ముతున్నారు. మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో…?

Tags:    

Similar News