దానిపైనే ఆశలు… అదీ ఎదురు తంతే?

నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారనుంది. సిట్టింగ్ సీటు కాకపోయినా అక్కడున్న సెలబ్రటీ కారణంగానే ఈ సీటుకు [more]

Update: 2020-12-21 12:30 GMT

నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారనుంది. సిట్టింగ్ సీటు కాకపోయినా అక్కడున్న సెలబ్రటీ కారణంగానే ఈ సీటుకు ప్రాధాన్యత లభిస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడంతో ఈ సీటుకు అంత ప్రయారిటీ లభిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలవడం అత్యవసరం. ఇక్కడ గెలిస్తే కొంత కాంగ్రెస్ కు తిరిగి ప్రాణం పోసినట్లవుతుంది.

అందరూ సమిష్టిగా…..

అందుకే నాగార్జునసాగర్ ఎన్నికపై కాంగ్రెస్ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు. అందరూ సమన్వయంతో పనిచేసి ఈ స్థానాన్ని గెలిపించుకోవాలని నిర్ణయించారు. బీజేపీ బలాన్ని తగ్గించాలన్నా, తమ పరువును కాపాడుకోవాలన్నా నాగార్జు సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కు సవాల్ గా మారింది. అందుకే ఇక్కడ అన్ని రకాలుగా మొహరించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయించారు. పార్టీ ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ కూడా నేతలకు దిశా నిర్దేశం చేశారు.

కాంగ్రెస్ ను వీడనని….

నిన్న మొన్నటి దాకా జానారెడ్డిపై కాంగ్రెస్ కు ఉన్న అనుమానాలు కూడా పటాపంచలయ్యాయి. తాను కాంగ్రెస్ ను ఎట్టి పరిస్థితుల్లో వీడేది లేదని జానారెడ్డి ప్రకటించడంతో కాంగ్రెస్ నేతలందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉప ఎన్నికల్లో జానా రెడ్డి కాని, ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డిని కాని బరిలోకి దింపాలన్న యోచనలో ఉన్నారు. మరో మూడేళ్లు మాత్రమే పదవీ కాలం ఉండటంతో జానారెడ్డి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.

ఇక్కడ గెలిస్తే…..

వరస ఓటములతో కుదేలయిపోయిన కాంగ్రెస్ పార్టీకి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో విజయం సాధిస్తే ఊపిరి పోస్తుందనే చెప్పాలి. కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఎన్నికపై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గత ఎన్నికలోనే జానారెడ్డి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. ఈసారి ఖచ్చితంగా గెలుపు గ్యారంటీ అన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ప్రజలు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ నేతలు గెలిచినా టీఆర్ఎస్ లోకి వెళుతుండటమే ఇందుకు కారణం. కానీ జానారెడ్డి కుటుంబం కాంగ్రెస్ కు నమ్మకంగా ఉండటంతో ఈ సారి గెలుపు కు ఢోకాలేదంటున్నారు సీనియర్ నేతలు. మరి ఏం జరుగుతుందోచూడాలి.

Tags:    

Similar News