Butta renuka : మళ్లీ దశ తిరగనుందా?

వైఎస్ జగన్ ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వెళ్లారు. ఆయన దృష్టంతా వచ్చే ఎన్నికలపైనే ఉంది. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ అభ్యర్థులను కూడా గరిష్టంగా గెలుచుకుంటే కేంద్ర [more]

Update: 2021-10-11 02:00 GMT

వైఎస్ జగన్ ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వెళ్లారు. ఆయన దృష్టంతా వచ్చే ఎన్నికలపైనే ఉంది. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ అభ్యర్థులను కూడా గరిష్టంగా గెలుచుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వైసీపీ అవసరం వాటికి పడాలన్నది జగన్ కోరుకుంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుల ఎంపిక కూడా జగన్ ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు. బలహీనంగా ఉన్న చోట అభ్యర్థులను కూడా మార్చేందుకు జగన్ సిద్దమయ్యారు.

రెండుసార్లు బీసీలనే….

కర్నూలు పార్లమెంటునే తీసుకుంటే అక్కడ రెండు సార్లు బీసీ అభ్యర్థిని నిలబెట్టి జగన్ గెలిపించుకోగలిగారు. 2014లో బుట్టా రేణుకను, 2019 లో డాక్టర్ సంజీవ్ కుమార్ ను ఎంపిక చేసి గెలపించారు. కర్నూలు పార్లమెంటు అంటేనే గతంలో రెడ్డి సామాజికవర్గం నుంచే పార్లమెంటుకు ఎంపిక అయ్యేవారు. అయితే జగన్ ఈ చరిత్రను మార్చి బీసీలను ఎంపీలుగా చేశారు. అయితే ఈసారి కర్నూలు పార్లమెంటుకు అభ్యర్థిని మారుస్తారన్న చర్చ జరుగుతుంది.

యాక్టివ్ గా లేకపోవడంతో….

వైసీపీ ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ పెద్దగా యాక్టివ్ గా లేరు. పార్టీని బలోపేతం చేయడంలోనూ పెద్దగా సక్సెస్ కాలేదు. ఆయనను మరోసారి ఎంపీగా కొనసాగించే ఆలోచన జగన్ కు లేదు. ఆయన డాక్టర్ గా కర్నూలు ప్రాంతంలో ప్రసిద్ధులు. బీసీ సామాజికవర్గం కావడంతో జగన్ ఆయనకు పిలిచి మరీ టికెట్ ఇచ్చారు. అయితే ఆయన తనకు ఇచ్చిన అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోలేక పోతున్నారన్న అభిప్రాయం పార్టీలో వినపడుతుంది.

పోటీకి సిద్ధంగా ఉండాలని….

అందుకే వచ్చే ఎన్నికలకు కర్నూలు ఎంపీగా మరోసారి పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని మాజీ ఎంపీ బుట్టా రేణుకకు సంకేతాలు పార్టీ నుంచి అందాయంటున్నారు. నిజానికి బుట్టా రేణుక 2014లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి తర్వాత టీడీపీలోకి వెళ్లారు. అనంతరం ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అయితే ఆమెకు ఎటువంటి పదవి ఇంతవరకూ జగన్ ఇవ్వలేదు. కానీ ఈసారి ఎంపీ గా పోటీ చేయడానికి రెడీ గా ఉండాలని సంకేతాలు అందడంతో ఆమె వర్గీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News