బుట్టాకు చిన్న ఆశ అట…. అది తీరుతుందా?

బుట్టారేణుక.. వన్ టైం ఎంపీ. స్వయంకృతాపరాధం కారణంగా రెండోసారి కనీసం పోటీ కూడ చేయలేెకపోయారు. బుట్టా రేణుక బీసీ సామాజికవర్గానికి చెందిన నేత. కర్నూలు జిల్లాలో ఆ [more]

Update: 2021-03-27 08:00 GMT

బుట్టారేణుక.. వన్ టైం ఎంపీ. స్వయంకృతాపరాధం కారణంగా రెండోసారి కనీసం పోటీ కూడ చేయలేెకపోయారు. బుట్టా రేణుక బీసీ సామాజికవర్గానికి చెందిన నేత. కర్నూలు జిల్లాలో ఆ సామాజకవర్గం బలంగా ఉండటంతో 2014లో జగన్ కర్నూలు ఎంపీ సీటను కేటాయించారు. వైసీపీ ఎంపీగా గెలిచిన బుట్టారేణుక తర్వాత టీడీపీలో చేరిపోయారు. అక్కడ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చేరడంతో తనకు టిక్కెట్ రాదని భావించి 2019 ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీలో చేరారు.

రాజ్యసభ తనకు ఇవ్వరని…..

అయితే బుట్టారేణుక ఏదో ఒక పదవి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఆమె కోరిక నెరవేరడం లేదు. రాజ్యసభ పదవి కోసం ప్రయత్నించినా అది సాధ్యమయ్యే పని కాదని ఆమె గుర్తించారు. అందుకోసమే తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని బుట్టా రేణుకు ఇటీవల ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జగన్ ను కలసి తన మనసులో మాటను వివరించాలని బుట్టా రేణుక భావిస్తున్నారు. జగన్ అపాయింట్ మెంట్ దొరికితే తనకు పదవి వచ్చినట్లేనని బుట్టారేణుక నమ్ముతున్నారు.

రానున్న కాలంలో ఖాళీ అయ్యే….

రానున్న కాలంలో దాదాపు 18 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇవన్నీ వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. దీంతో సామాజికవర్గం కోటాలో తనకు ఇవ్వాలని బుట్టా రేణుక కోరనున్నారని చెబుతున్నారు. ఇప్పటికే కర్నూలు మున్సిపల్ ఎన్నికల్లో బుట్టా రేణుక పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించారు. పలువురు అభ్యర్థులను ఆర్థికంగా కూడా ఆదుకున్నారని చెబుతున్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఇవ్వాలని జగన్ ను అడగాలని బుట్టారేణుక భావించారు.

సీమలో సీనియర్ నేత ద్వారా..

అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే టిక్కెట్ కూడా కష్టమేనని తేలింది. ఎమ్మిగనూరు అయితే తనకు గెలుపు సులువు అని ఆమె చెప్పినా పార్టీ అధినాయకత్వం నమ్మే పరిస్థితి లేదు. దీంతో ఆమె ఎమ్మెల్సీ పైనే ఆశల పెట్టుకున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిని ఒక సీనియర్ నేతతో బుట్టా రేణుక ఇప్పటికే ఈ విషయమై చర్చించినట్లు చెబుతున్నారు. మరి జగన్ బుట్టా రేణుక కు అవకాశమిస్తారా? లేదా? అన్నది మాత్రం సందేహమే. మరి చూడాలి బుట్టా ఫేట్ ఎలా ఉంటుందో?

Tags:    

Similar News