బుగ్గన స్టయిలే వేరు

ఆంధ్రప్రదేశ్ ఆర్ధికమంత్రులుగా కొణిజేటి రోశయ్య, యనమల రామకృష్ణుడు, ఆనం రామ నారాయణ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టే తీరు ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉండేవి. కాకలు తీరిన [more]

Update: 2019-07-12 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ ఆర్ధికమంత్రులుగా కొణిజేటి రోశయ్య, యనమల రామకృష్ణుడు, ఆనం రామ నారాయణ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టే తీరు ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉండేవి. కాకలు తీరిన రాజకీయ అనుభవం వున్న వారి తో పోలిస్తే వైసిపి ప్రభుత్వంలో కొత్తగా ఆర్దికమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కి అంతా కొత్తే . అయితే ప్రతి అంశాన్ని అధ్యయనం చేసి మాట్లాడే బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి జగన్ అంచనాలకు తగినట్లే బుగ్గన బాగానే ప్రిపేర్ అయ్యి వచ్చారు ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి. ఆయన ఎపి శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ చేసిన ప్రసంగం లో పిట్టకథలు, సామెతలు, సంస్కృత శ్లోకాలు ఆంగ్లంలో చెబుతూ సాగించిన తీరు ఆకట్టుకుంది. వాస్తవానికి బుగ్గన చేసే ప్రసంగాలు చక్కగా లెక్కలతో నడుస్తాయి. మాటలు విరుస్తూ చెణుకులు రువ్వుతూ రాజేంద్రనాధ్ మాట్లాడుతూ వుంటారు. అయితే ఆయన రాసుకున్న ప్రతులను చదవడంలో మాత్రం తెలుగులో తడబాట్లు వస్తుంటాయి. ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం చేయడంతో బుగ్గన తెలుగు పట్టి పట్టి మాట్లాడతారు.

ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ గా కూడా …

వైసిపి విపక్షంలో వున్నప్పుడు క్యాబినెట్ స్థాయిలో వుండే ప్రజాపద్దుల కమిటీ ఛైర్మెన్ గా వ్యవహరించారు. అప్పుడు కూడా చంద్రబాబు సర్కార్ ను అడుగడుగునా తూర్పారబట్టడంలో దూసుకుపోయేవారు. కాగ్ నివేదికల్లో సర్కార్ చేసే తప్పులను ఎత్తిచూపుతూ సామాన్యుడికి కూడా అర్ధం అయ్యేలా విపులీకరించి విశ్లేషించేవారు. ప్రభుత్వ బడ్జెట్ అనేది సామాన్యులకు అర్ధం కాని జడపదార్ధం లాంటిది. అలాంటి బడ్జెట్ ను అందరికి అర్ధం అయ్యేలా బుగ్గన తాజాగా వైసిపి సర్కార్ ఏర్పడ్డాకా ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ను ఆవిష్కరించి అందరి మన్ననలు అందుకున్నారు. తెలుగు చదవడంలో అక్కడక్కడా తడబాటు లు ఎదురైనా మొత్తం మీద బుగ్గన రాజేంద్రనాధ్ తాను ఎవ్వరికి తీసిపోనని చాటి చెప్పేశారు. తన స్టైలే వేరబ్బా అని చేసి చూపించారు బుగ్గన.

Tags:    

Similar News