Tdp : బెజవాడ బుద్దాకు కేశినేని కితకితలు

రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు మామూలే. కానీ సమయం, సందర్భం వచ్చినప్పుడు తమ ప్రత్యర్థిని దెబ్బతీసేందుకే నేతలు ప్రయత్నిస్తుంటారు. బెజవాడ తెలుగుదేశం పార్టీ రాజకీయం కూడా ఇలాగే [more]

Update: 2021-11-04 12:30 GMT

రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు మామూలే. కానీ సమయం, సందర్భం వచ్చినప్పుడు తమ ప్రత్యర్థిని దెబ్బతీసేందుకే నేతలు ప్రయత్నిస్తుంటారు. బెజవాడ తెలుగుదేశం పార్టీ రాజకీయం కూడా ఇలాగే సాగుతోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ నేతలకు చెక్ పెట్టేందుకు మళ్లీ రగడ మొదలయింది. కేశినేని నాని వ్యూహాత్మకంగా అడుగులు వేసి వారిద్దరికి చెక్ పెట్టే ప్రయత్నాలు చేేస్తున్నారు.

నాలుగు దశాబ్దాలుగా….

బెజవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీకి ఎప్పుడూ అనుకూలంగా లేదు. ఇక్కడ సామాజికవర్గ సమీకరణాలతో టీడీపీ కేవలం ఒకే ఒక్కసారి గెలిచింది. టీడీపీ ఆవిర్భవించిన తొలినాళ్లలో 1983లో ఆ పార్టీ నుంచి జయరాజ్ విజయం సాధించారు. అదే టీడీపీికి ఇక్కడ ఆఖరి గెలుపు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ టీడీపీకి విజయం అనే మాట లేదు. అయినా ఇక్కడ టీడీపీ నేతలకు కొదవలేదు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తెచ్చుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ఇద్దరు నేతలే…

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు టీడీపీ నేతలుగా ఉన్నారు. వీరిద్దరూ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జలీల్ ఖాన్ కుటుంబం మొన్నటి వరకూ సైలెంట్ గానే ఉంది. అయితే కేశినేని నానితో బుద్దా వెంకన్న, నాగుల్ మీరాల విభేదాలు ఇటీవల కాలంలో తీవ్రమయ్యాయి. కానీ అనూహ్యంగా కేశినేని నాని పార్టీలో తిరిగి యాక్టివ్ కావడంతో జలీల్ ఖాన్ సయితం యాక్టివ్ అయ్యారు.

ఖాన్ యాక్టివ్ కావడంతో…

ఆయన ఇటీవల చంద్రబాబు దీక్ష వద్దకు వచ్చారు. కేశినేని నాని మద్దతుతోనే జలీల్ ఖాన్ తిరిగి యాక్టివ్ అయ్యారని చెబుతున్నారు. చంద్రబాబు వద్ద తిరిగి తనకు గ్రిప్ లభించడంతో కేశినేని నాని జలీల్ ఖాన్ ను రంగంలోకి దించారంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలకు చెక్ పెట్టేందుకే జలీల్ ఖాన్ తిరిగి పార్టీలో యాక్టివ్ అయ్యారంటున్నారు. మొత్తం మీద బెజవాడ టీడీపీలో మళ్లీ రగడ మొదలవుతుందనే అంటున్నారు. అయితే జనసేన, టీడీపీ పొత్తు కుదిరితే ఇది జనసేనకు కేటాయించే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News