బుద్ధాకు బోల్ట్ లు బిగించేయడం ఖాయమా ?

టిడిపి ఎమ్యెల్సీ బుద్ధా వెంకన్న ప్రత్యర్థులకు స్ట్రాంగ్ గానే కౌంటర్ లు విసురుతారు. మాటలు తూటాల్లా పేలుస్తూ వుంటారు. టిడిపి పొలిటికల్ ఎన్ కౌంటర్ టీం లో [more]

Update: 2019-06-22 04:22 GMT

టిడిపి ఎమ్యెల్సీ బుద్ధా వెంకన్న ప్రత్యర్థులకు స్ట్రాంగ్ గానే కౌంటర్ లు విసురుతారు. మాటలు తూటాల్లా పేలుస్తూ వుంటారు. టిడిపి పొలిటికల్ ఎన్ కౌంటర్ టీం లో ఆయన ఫ్రంట్ రోల్ లోనే వుంటారు. నూటికి వెయ్యిశాతం తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు డంకా బజాయించి చెబితే బుద్ధా వెంకన్న ఒక అడుగు ముందుకు వేసి సినిమాల్లో బాలకృష్ణ లా తొడకొట్టి మరి చెబుతున్నా అని చెప్పే దమ్మున్నోడు. మరి అధికారంలోకి రాలేదు కదా తొడ అప్పుడు ఎందుకు కొట్టారని అడిగితె క్యాడర్ ఉత్సహం కోసం కొడితే తప్పేంటని సమర్ధించుకోగల నాయకుడాయన. ఇలా ఎన్నో ఉత్సహ వంతమైన మీడియా ఫైర్ గన్ కి పార్టీకి చెందిన మాజీ నేతనుంచే వార్నింగ్ రావడం తట్టుకోలేక పోతున్నారు వెంకన్న. వైసిపి అధినేత నుంచి అందరిని ఇంకా దారుణంగా తిట్టినా ఎప్పుడు ఆ పార్టీ ఇలా వార్నింగ్ ఇవ్వలేదని కానీ ఇప్పుడు ఈరకమైన వార్నింగ్ రావడం పట్ల బుద్ధా వెంకన్న భగ్గు భగ్గుమంటున్నారు.

పొద్దున్న లేస్తే అందరిని తిట్టినా …

ఉదయం లేచింది మొదలు తిట్టిన తిట్టు తిట్టకుండా ప్రత్యర్థి పార్టీలను తిట్టడం తాజా రాజకీయాలపై ఘాటుగా వ్యాఖ్యలు చేయడం బుద్ధా వెంకన్న ఉద్యోగం. ఇప్పటివరకు ఆయన ఎంతమందిని తిట్టినా వార్నింగ్ లు ఫెస్ చేయనేలేదు. అయితే తాజాగా టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్ అయిన తరువాత రొటీన్ గానే వెంకన్న తన స్కూల్ స్టార్ట్ చేసేసారు. ఆయన సుజనా చౌదరి బృందాన్ని ఇలా తూర్పారబట్టారో లేదో ఆయనకు కాల్ వచ్చేసింది. ఫోన్ చేసింది పెద్దాయనే కదా అని లిఫ్ట్ చేస్తే రోజు తాను తిట్టే తిట్లు అన్ని రివర్స్ లో ఆయన తిట్టడం విని షాక్ అయ్యారు. తిట్టడమే కాదు నువ్వు మళ్ళీ ఎక్కువ మాట్లాడితే బోల్ట్ లు బిగించేస్తాం, జైల్లో పడేస్తాం అంటూ మాజీ ఎంపి యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ సాక్షాత్తు సుజనా చౌదరి ఇంటి నుంచి ఫోన్ చేసి బెదిరించారన్నది వెంకన్న ఆరోపణ. ఈ వ్యవహారంపై వెనక్కి తగ్గేది లేదని యార్లగడ్డ పై డిజిపికి ఫిర్యాదు చేస్తా అని తాను ఏ నేరం చేయకపోయినా జైల్లో ఎలా పెడతారని ప్రశ్నించారు ఆయన. తాను చదువుకోలేదని కాల్స్ రికార్డ్ చేయడం తెలియకపోవడం వల్ల ఆడియో ఆధారాలు ఇవ్వలేక పోతున్నా అంటూ రెచ్చిపోయిన బుద్ధా వెంకన్న ఇకపై మరింత చెలరేగిపోతారేమో చూడాలి.

Tags:    

Similar News