ఎక్కడ ఓడామో… అక్కడే ఎగరేయాలని?

ఎక్కడ ఓడామో అక్కడే గెలిచి మళ్లీ జెండా పాతాలన్న లక్ష్యం రాజకీయ నేతలకు ఉండాలి. ఎప్పుడో ఎన్నికల సమయానికి వచ్చి ఊరేగుదామంటే కుదరదు. అందుకే ఇప్పుడిప్పుడే టీడీపీ [more]

Update: 2020-10-03 06:30 GMT

ఎక్కడ ఓడామో అక్కడే గెలిచి మళ్లీ జెండా పాతాలన్న లక్ష్యం రాజకీయ నేతలకు ఉండాలి. ఎప్పుడో ఎన్నికల సమయానికి వచ్చి ఊరేగుదామంటే కుదరదు. అందుకే ఇప్పుడిప్పుడే టీడీపీ నేతలు నియోజకవర్గం బాట పడుతున్నారు. పదిహేను నెలలుగా పూర్తిగా వ్యాపారాలకు పరిమితమైన నేతలు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు వస్తున్నారు. అందులో శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఒకరు. ఆయన పదిహేను నెలలుగా వ్యాపారాలకే పరిమితమయ్యారు.

పూర్తిగా ఫోకస్…..

ఇప్పుడు పూర్తిగా శ్రీశైలం నియోజకవర్గంలోనే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఫొకస్ పెట్టారు. ప్రధానంగా భారీ వర్షాలకు పంట నీటి మునిగి రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి పంట నష్టం కూడా ప్రభుత్వం నుంచి అందలేదు. దీనిపై ఆందోళన చేయాలని బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిర్ణయించారు. రైతు సమస్యలపై పోరాడేందుకు బుడ్డా రాజశేఖర్ రెడ్డి రెడీ అయ్యారు. గత పదిహేను నెలలుగా శ్రీశైలం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగకపోవడాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి…..

నిజాని బుడ్డా రాజశేఖర్ రెడ్డి 2014 ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగానే గెలిచారు. అయితే అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లారు. ఒక దశలో ఆయన పోటీకి కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. చివరకు చంద్రబాబు బలవంతం మీద 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

ఇక నుంచి అందరికీ అందుబాటులో…..

ఇక అప్పటి నుంచి శ్రీశైలం నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. కానీ ఇటీవల కాలంలో తిరిగి బుడ్డా రాజశేఖర్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. పార్టీ కోసం పనిచేయడానికి తాను ముందుంటానని చెబుతున్నారు. తన అనుచరులతో పాటు పార్టీ క్యాడర్ ను, ఓటు బ్యాంకును నిలుపుకునేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఇటీవల చంద్రబాబు కర్నూలు జిల్లా సమీక్ష సమావేశంలోనూ బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ప్రశంసించారు. మొత్తం మీద టీడీపీలో ఒక్కొక్క నేత ఎట్టకేలకు నియోజకవర్గాల బాట పట్టడం ఆ పార్టీకి శుభపరిణమమే.

Tags:    

Similar News