పొరుగు జిల్లాను కెలుకుతున్న బొత్స ?

ఉత్తరాంధ్రాలో సీనియర్ మోస్ట్ మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్న సంగతి విధితమే. ఆయనకు కీలకమైన మునిసిపల్ శాఖను కూడా కేటాయించారు. ఇదిలా ఉంటే తన జిల్లా వరకూ [more]

Update: 2021-08-24 15:30 GMT

ఉత్తరాంధ్రాలో సీనియర్ మోస్ట్ మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్న సంగతి విధితమే. ఆయనకు కీలకమైన మునిసిపల్ శాఖను కూడా కేటాయించారు. ఇదిలా ఉంటే తన జిల్లా వరకూ రాజకీయాల్లో ఎటూ చక్రం తిప్పుతున్న బొత్స సత్యనారాయణ పొరుగు జిల్లాలోనూ వేలు పెడుతున్నారు. దాంతో శ్రీకాకుళం జిల్లా వైసీపీ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలవుతున్నాయి. ఇప్పటికి దాదాపుగా పదకొండేళ్ళుగా శ్రీకాకుళం పట్టణానికి పాలక వర్గం లేదు. వైఎస్సార్ హయాంలో ఒకసారి ఎన్నికలు జరిగితే శ్రీకాకుళం మునిసిపాలిటీలో చైర్మన్, కౌన్సిలర్లు జనాలలో నాడు కనిపించారు. ఆ తరువాత కార్పోరేషన్ గా అప్ గ్రేడ్ చేస్తామన్నారు. ఆ ప్రతిపాదనలు ఒక కొలిక్కి రాక పలు మార్లు ఎన్నికలు జరగలేదు.

ఈసారి ఖాయమే…?

ఈ నేపధ్యంలో ఈసారి ఎన్నికలు మాత్రం జరగడం ఖాయమని అంటున్నారు. పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే తొందరలోనే శ్రీకాకుళం కార్పోరేషన్ ని ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. మేయర్ పదవి కోసం జిల్లాలోని ప్రధానంగా మూడు సామాజికవర్గాలు పోటీ పడుతున్నారు. కాపులు, కాళింగులు, వెలమలు ఈ పదవి కోసం పోటీకి దిగిపోతున్నారు. ఇందులో కాపులకు మంత్రి బొత్స సత్యనారాయణ మద్దతు ఉందని అంటున్నారు. ఇక ఇక్కడ వార్డుల ఏర్పాటు, రిజర్వేషన్ల మీద కూడా కొంత గందరగోళం ఉంది. దాని మీద అన్యాయం జరిగింది అని ఎస్సీలు గొడవ చేస్తున్నారు.

గుస్సా అవుతున్నారుగా…?

కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి బొత్స సత్యనారాయణకు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో వేలు పెట్టడం అలవాటే అంటున్నారు. నాడు కూడా ధర్మాన జిల్లాకు మినిస్టర్ గా ఉన్నా కూడా బొత్స తన వర్గం వారితో హడావుడి చేసేవారు. ఇపుడు కూడా కార్పోరేషన్ ఎన్నికల నేపధ్యంలో తన సామాజికవర్గం వారికి ఆయన అభయహస్తం ఇచ్చారని టాక్. వారే రేపటి రోజున సిక్కోలు మేయర్ తమ వర్గానికే అని కూడా చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలు సహజంగానే సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయిన ధర్మానకు గుస్సా కలిగిస్తున్నాయట. ఆయన తన మనిషిని మేయర్ కుర్చీ ఎక్కించాలని తాపత్రయపడుతున్నారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు.

వర్గ పోరుతోనే …?

శ్రీకాకుళం కార్పోరేషన్ తొలి మేయర్ ఎవరు అవుతారు అన్నది ఇపుడు ఆసక్తిగా మారింది. మొత్తం యాభై వార్డులు ఉన్న చోట 26 సీట్లు ఎవరికి వస్తే వారే తొలి పౌరుడు అవుతారు. అయితే ఈ మధ్య టీడీపీ కూడా కొంత పుంజుకుంది అంటున్నారు. మరో వైపు చూస్తూంటే ఎక్స్ అఫీషియో సభ్యులతో వైసీపీ బలంగా ఉంది. కచ్చితంగా అత్యధిక సీట్లు గెలుచుకుంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ వర్గ పోరు ఎక్కువగా ఉంది. ముందే మేయర్ పీఠం కోసం గ్రూపులుగా విడిపోయి సొంత పార్టీలోనే కత్తులు దూసుకుంటే అది చివరికి ప్రత్యర్ధికి వర్గంగా మారినా ఆశ్చర్యంలేదు అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఉత్తరాంధ్రా వైసీపీ ఇంచార్జి విజయసాయిరెడ్డి సిక్కోలు రాజకీయాల మీద దృష్టి పెడతారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News