బొత్సను బుల్ డోజ్ చేసేశారా?

సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ ప్రభుత్వంలో ఉత్సవ విగ్రహంగా మారారా? కీలకమైన విషయాల్లో బొత్స సత్యనారాయణ ప్రమేయం లేకుండా చేస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. బొత్స [more]

Update: 2019-12-19 06:30 GMT

సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ ప్రభుత్వంలో ఉత్సవ విగ్రహంగా మారారా? కీలకమైన విషయాల్లో బొత్స సత్యనారాయణ ప్రమేయం లేకుండా చేస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. బొత్స సత్యానారాయణ మున్సిపల్ మంత్రిగా ఉన్నారు. ఆయన కీలకమైన సీఆర్డీఏ విషయాలను కూడా చూస్తున్నారు. రాజధాని అమరావతి విషయంలో పొంతన లేన ప్రకటనలు చేయడం తప్పించి బొత్స సత్యనారాయణకు కీలక నిర్ణయాల్లో చోటు దక్కడం లేదట. ఇది తన సన్నిహితుల వద్ద బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

సీనియర్ నేతగా…..

బొత్స సత్యనారా‍యణ సీనియర్ నేత. విజయనగరం జిల్లాను శాసించిన నేత. దశాబ్దకాలం కాంగ్రెస్ హయాంలో కీలక పదవులను అధిరోహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అలాంటి బొత్స సత్యనారాయణ రాష్ట్ర విభజనతో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపునే పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఎన్నికల్లో ఎవరికీ డిపాజిట్ దక్కకపోయినా బొత్స సత్యనారాయణ డిపాజిట్ దక్కించుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఇక రాష్ట్రంలో కోలుకోలేదని భావించిన బొత్స సత్యనారాయణ వైసీపీలోకి జంప్ అయ్యారు. ఈ ఎన్నికల్లో తన వాళ్లందరికీ విజయనగరం జిల్లాలో టిక్కెట్లు ఇప్పిించుకున్నారు.

కీలక పదవి ఇచ్చినా…..

అంతేకాకుండా విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఫలితంగానే జగన్ తన తొలి మంత్రివర్గంలోనే బొత్స సత్యనారాయణకు చోటు కల్పంచారు. కీలకమైన మున్సిపల్ శాఖను అప్పగించారు. అయితే రాజధాని అమరావతి విషయంలో బొత్స సత్యనారాయణ కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. ఈ విషయంలో జగన్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనపడుతోంది. రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ సంస్థను తప్పించడంలోనూ, వారితో చర్చించడంలోనూ బుగ్గన మాత్రమే కీలకంగా వ్యవహరించారు.

బుగ్గనకే ప్రాధాన్యత…..

ఇక తాజాగా అసెంబ్లీలో జరిగిన రాజధానిపై చర్చ విషయంలోనూ సంబంధిత మంత్రి బొత్స సత్యనారాయణ కంటే బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టంగా కన్పించింది. రాజధాని అమరావతిపై మంత్రిగా బొత్స సత్యనారాయణ స్పందించాల్సి ఉన్నా రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతల పేర్లను బుగ్గన మాత్రమే బయటపెట్టారు. ఇక మూడు రాజధానుల కీలక ప్రకటన కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేశారు. మంత్రిగా చర్చను ఎండ్ చేయాల్సిన బొత్స సత్యనారాయణకు ఇక చెప్పేటందుకు మిగిలిందేమీ లేదు. అయితే బొత్స సత్యనారా‍యణ మాటలు సరిగా అర్థం కావని, అందుకే బుగ్గన, జగన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద తమనేత బొత్స సత్యనారాయణను బుల్ డోజ్ చేస్తున్నారని ఆయన సన్నిహితులు ఆవేదన చెందుతున్నారు.

Tags:    

Similar News