గంటా…. బొత్స… మల్టీస్టారర్ పొలిటికల్ మూవీ ?

ఉత్తరాంధ్రను రాజకీయంగా కాపు కాద్దామని ఇద్దరు కీలక నేతలు పట్టుపడుతున్నారా. అందుకేనా గంటా శ్రీనివాసరావు అర్జంటుగా వైసీపీలోకి జంప్ చేస్తున్నారా. అంటే సామాజిక సమీకరణలు చూసి అదే [more]

Update: 2020-08-04 12:30 GMT

ఉత్తరాంధ్రను రాజకీయంగా కాపు కాద్దామని ఇద్దరు కీలక నేతలు పట్టుపడుతున్నారా. అందుకేనా గంటా శ్రీనివాసరావు అర్జంటుగా వైసీపీలోకి జంప్ చేస్తున్నారా. అంటే సామాజిక సమీకరణలు చూసి అదే సమాధానం అనుకోవాలేమో. బొత్స తూర్పు కాపు, గంటా ఓసీ కాపు. అయినా ఇద్దరు కీలక సామాజకివర్గానికి చెందిన వారే. ఇక బొత్సకు వైసీపీలో రాజకీయంగా పట్టు చిక్కడంలేదు. ధర్మాన కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇక రానున్న రోజుల్లో విజయనగరం జిల్లాలో పట్టు జారేట్టుంది. జగన్ ఆలోచనలు చూస్తూ భవిష్యత్తుని ఊహిస్తున్న బొత్స తోడు కోసం గంటాను పార్టీలోకి స్వయంగా లాక్కొస్తున్నారన్న ప్రచారం అయితే బలంగా సాగుతోంది.

అడ్డుకట్టకే…..

వైసీపీలో ఇపుడు అసంతృప్తి గట్టిగానే ఉంది. ఆ బడబాగ్ని బద్దలు అయ్యేందుకు సమయం పడుతుందేమో కానీ ఏదీ లేదు అనుకుంటే మాత్రం పొరపాటే అంటున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో నెల్లూరు పెద్దారెడ్డి అవతారంలో విజయసాయిరెడ్డి రావడాన్ని బొత్స వర్గం జీర్ణించుకోలేకపోతోందని టాక్ చాలా కాలంగా ఉంది. మూడు జిల్లాల్లో ఏం జరిగినా విజయసాయిరెడ్డినే సంప్రదించడం, ఆయన చేతుల మీదనే అన్ని కార్యక్రమాలు జగన్ చేయించడం వంటివి బొత్స బొత్తిగా తట్టుకోలేకపోతున్నారుట. అందుకే గంటా ద్వారా కాగల కార్యం నడిపించేందుకే మాస్టర్ స్కెచ్ వేశారని అంటున్నారు.

అవసరాలు అలా …..

ఇక గంటా సంగతి తీసుకుంటే ఆయన ఏడాదిగా ఏ పదవీ లేకుండా ఖాళీగా ఉన్నారు. ఆయనకు అది అసలు అలవాటు లేదు, ఇక అనుచరగణం కూడా చలో వైసీపీ అంటోంది. గంటా మంత్రిగా ఉన్నపుడు విశాఖలో పెద్ద ఎత్తున భూదందా జరిగింది. ఇపుడు అధికారం మారడంతో వారంతా చిక్కుల్లో పడ్డారు. తమ కోసమైనా పార్టీ మారాలన్న వత్తిడి గంటా మీదకు వస్తోందిట. ఇంకోవైపు చూసుకుంటే గంటా కూడా ఏపీలో టీడీపీ మళ్ళీ అధికారంలోకి రాదని డిసైడ్ అయ్యారు. దాంతో ఆయన అడుగులు ఇటువైపు పడ్డాయని చెబుతున్నారు. ఇక విజయసాయిరెడ్డి ద్వారానే గంటా మొదట్లో వైసీపీలో చేరాలనుకున్నారు. కానీ రెడ్డి గారు సరిగ్గా స్పందించకపోవడంతో ఈసారి బొత్స వంటి వారి ద్వారా డైరెక్ట్ గా జగన్ తోనే కధ నడిపించారని అంటున్నారు.

కాంబో హిట్టేనా….?

బొత్స, గంటా ఇద్దరూ కాంగ్రెస్ లో మంత్రులుగా చేశారు. ఇక బొత్స పీసీసీ ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరించారు. ఆయనకు అప్పట్లో గంటా సన్నిహితుడుగా మెలిగారు. ఇవన్నీ ఇలా ఉన్నా ఇరుగుపొరుగు జిల్లాల నేతలుగా ఇద్దరూ ఏ పార్టీలో ఉన్నా కూడా లోపాయికారి సహకారం కూడా మామూలేనని అంటున్నారు. ఇపుడు గంటాను రంగంలోకి దించితే బలమైన విజయసాయిరెడ్డికి చెక్ పెట్టడంతో పాటు రాజకీయంగా కూడా తన హవాను కొనసాగించవచ్చునని బొత్స భావిస్తున్నారని అంటున్నారు. అయితే బొత్స విషయంలో హై కమాండ్ ఆలోచనలు ఎలా ఉన్నా ఈ రకమైన ప్రచారం తరువాత ఆయన మీద కచ్చితంగా విజయసాయిరెడ్డి వర్గం కన్ను పడుతుందని, గంటా వ్యవహారంలో తేడా ఏం జరిగినా కూడా టార్గెట్ మాత్రం బొత్స అవుతారని వైసీపీలో వినిపిస్తోంది. మరి వైసీపీలో ఉన్న పాత‌ కాపులు, బొత్స వ్యతిరేకులు ఈ కధను ముందుకు సాగనిస్తారా అన్నది కూడా చర్చగా ఉందిట.

Tags:    

Similar News