మేయర్ కు మరో అవకాశం లేదా?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నవంబరులో జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ ఇందుకు సిద్దమవుతోంది. బ్యాలట్ పద్ధతిలోనే ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అయితే ప్రస్తుత మేయర్ బొంతు [more]

Update: 2020-10-12 11:00 GMT

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నవంబరులో జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ ఇందుకు సిద్దమవుతోంది. బ్యాలట్ పద్ధతిలోనే ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అయితే ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ కు ఈ సారి పదవి దక్కే అవకాశం లేదు. మేయర్ పదవి మహిళలకు రిజర్వ్ కావడమే ఇందుకు కారణం. బొంతు రామ్మోహన్ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ లో ఉన్నారు. మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు.

అందుకే అసెంబ్లీ టిక్కెట్ …..

గత అసెంబ్లీ ఎన్నికల్లోనే బొంతు రామ్మోహన్ అసెంబ్లీ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. అయితే అప్పట్లో కొన్ని కారణాల కారణంగా ఆయనకు టిక్కెట్ దక్కలేదు. రొటేషన్ పద్ధతిలో మేయర్ స్థానాన్ని రిజర్వ్ చేస్తారు. రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో చేస్తారు కాబట్టి ఈసారి జనరల్ మహిళకు మేయర్ పదవి దక్కే అవకాశముంది. దీంతో బొంతు రామ్మోహన్ కు ఆ పదవి పై ఇక ఆశలు లేనట్లేనని చెప్పక తప్పదు.

జనరల్ మహిళకు…..

జనరల్ మహిళకు రిజర్వ్ అయినా బొంతు రామ్మోహన్ తన భార్యకు మేయర్ పదవి ఇప్పించుకోవచ్చనే యోచనలో ఉన్నారు. కానీ జనరల్ మహిళ అయితే పోటీ ఎక్కువగా ఉంటుంది. ఐదేళ్ల పాటు మేయర్ గా పనిచేసిన అదే కుటుంబానికి తిరిగి పదవి ఇవ్వడాన్ని అంగీకరించే అవకాశం ఉండదు. దీనికి తోడు టీఆర్ఎస్ లో బలమైన సామాజికవర్గం కూడా ఈసారి మేయర్ పదవి కోసం పట్టుబట్టే అవకాశముంది.

లాబీయింగ్ షురూ…..

గతంలోనే కేకే కుమార్తె మేయర్ పదవి కోసం పోటీ పడ్డారు. ఇప్పటికే కొందరు తమ భార్యలను పోటీకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. వారందరూ కేటీఆర్ వద్ద లాబీయింగ్ ను షురూ చేసినట్లు తెలుస్తోంది. బొంతు రామ్మోహన్ కుటుంబానికి మాత్రం తిరిగి మేయర్ పదవి ఇవ్వడం అసాధ్యమని చెబుతున్నారు. ఆయనకు మరో పదవి కేటాయించవచ్చన్నది టీఆర్ఎస్ వర్గాల నుంచి విన్పిస్తుంది.

Tags:    

Similar News