బోండా అసలు కధ ఇదీ

తెలుగుదేశం పార్టీ అధినేత బోండా ఉమామహేశ్వరావు చంద్రబాబు నాయుడితో భేటీ అయిన తర్వాత మనసు మార్చుకున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే బోండా [more]

Update: 2019-08-13 06:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత బోండా ఉమామహేశ్వరావు చంద్రబాబు నాయుడితో భేటీ అయిన తర్వాత మనసు మార్చుకున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే బోండా ఉమామహేశ్వరరావు ఒక పద్ధతి ప్రకారమే ఈ డ్రామాకు తెరలేపినట్లు సమాచారం. బోండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీని వీడతారని గత కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. బోండా ఉమామహేశ్వరావు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడే ఈ ప్రచారం ప్రారంభమయింది.

ప్రచారాన్ని ఖండించకుండా…..

ఆస్ట్రేలియాలో ఉన్న బోండా ఉమామహేశ్వరరావు ఈ ప్రచారాన్ని ఖండించకపోగా, అది నిజమన్నట్లుగా ట్వీట్ చేశారు. తాను బంగీ జంప్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో బోండా ఉమామహేశ్వరరావు పార్టీ మారడం ఖాయమని అందరూ భావించారు. కానీ కావాలనే ఇది ఆయన చేసినట్లు టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత బోండా ఉమామహేశ్వరరావు పార్టీని పెద్దగా పట్టించుకోవడంలేదు.

వైసీపీలోకి వెళ్లినా…..

ఇప్పుడు బోండా ఉమామహేశ్వరరావుకు పార్టీలో ప్రాధాన్యత అవసరం. ఆ ప్రాధాన్యత కోసమే ఆయన తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించలేదంటున్నారు. నిజానికి బోండా ఉమామహేశ్వరరావు పార్టీ మారినా ప్రయోజనం లేదు. ఆయన ప్రాతినిధ్యం వహించిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తప్ప ఆయనకు మరెక్కడా భవిష్యత్తు లేదు. టీడీపీలో మాత్రమే సెంట్రల్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లోనూ సీటు వచ్చే అవకాశముంది. వైసీపీలో ఆ ఛాన్స్ లేదు. ఇది బోండా ఉమామహేశ్వరరావుకు తెలియంది కాదు.

వంగవీటి అడ్డురాకుండా….

కాకుంటే వచ్చే ఎన్నికల్లో వంగవీటి రాధా తనకు సీటు కోసం పోటీ వస్తారని భావించి బోండా ఉమామహేశ్వరరావు తనపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా కామా పెట్టారు. దీంతో చంద్రబాబునాయుడు నుంచి పిలుపు వచ్చింది. ఈ సమావేశంలో తనకు పార్టీలో పదవితో పాటు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ను కూడా బోండా ఉమామహేశ్వరరావు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయిన బోండా ఉమామహేశ్వరరావు వంగవీటి రాధా తనకు పోటీ కాకుండా ఇప్పటి నుంచే పావులు కదిపారన్న వ్యాఖ్యలు టీడీపీలోనే విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News