కమిట్ మెంట్ లేనోడికిస్తే ఇంతేగా? ఇంతేగా?

ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. అధిష్టానం చేసిన తప్పుల కారణంగానే టీడీపీ నేడు అక్కడ ఈ పరిస్థితిని ఎదుర్కొనాల్సి వస్తుంది. కమిట్ మెంట్ [more]

Update: 2020-04-05 03:30 GMT

ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. అధిష్టానం చేసిన తప్పుల కారణంగానే టీడీపీ నేడు అక్కడ ఈ పరిస్థితిని ఎదుర్కొనాల్సి వస్తుంది. కమిట్ మెంట్ లేని నేతలను ఆదరిస్తే కష్టకాలంలో ఇబ్బందులు తప్పవని చెప్పటానికి ఉదయగిరి నియోజకవర్గమే ఉదాహరణ. ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీకి నాయకత్వమే లేకుండా పోయింది. పార్టీ జెండాను పట్టుకునే వారే లేరు. ఇందుకు కారణం అధిష్టానం వైఖరి మాత్రమే కారణం.

క్యాడర్ కు అందుబాటులో లేకుండా….

2014 ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి బొల్లినేని రామారావు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. అక్కడ ఎమ్మెల్యేగా ఆయన అట్టర్ ప్లాప్ అయ్యారు. ఈ విషయాన్ని అనేకసార్లు ఉదయగిరి నియోజకవర్గం కార్యకర్తలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. కానీ పారిశ్రామికవేత్త అయిన బొల్లినేని రామారావుపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఐదేళ్లలో బొల్లినేని రామారావు ప్రజలకు అందుబాటులో ఉంది చాలా అరుదు అన్న విషయం అధిష్టానం దృష్టికి వచ్చినా పట్టించుకోలేదు.

తిరిగి ఆయనకే ఇచ్చి….

దీంతో ఎన్నికల సమాయనికి ఉదయగిరి నియోజకవర్గం టీడీపీలో అసంతృప్తి నెలకొంది. బొల్లినేని రామారావుకు టిక్కెట్ ఇవ్వవద్దంటూ అనేక మంది అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. 2014 ఎన్నికల్లోనే బొల్లినేని రామారావు వైసీపీ అభ్యర్థిపై కేవలం 2622 ఓట్ల తేడాతోనే గెలిచారు. పైగా ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలో సేవలు చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి కూడా టిక్కెట్ కోసం ప్రయత్నించారు. కానీ చంద్రబాబు చివరకు బొల్లినేని రామారావు కే టిక్కెట్ కేటాయించారు. భారీ ఓట్ల తేడాతో బొల్లినేని రామారావు వైసీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

పార్టీకి దిక్కు లేకుండా…..

అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఇక్కడ పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదు. టిక్కెట్ దక్కించుకుని ఓటమి పాలయిన బొల్లినేని రామారావు షరా మామూలుగా నియోజకవర్గానికి దూరంగా వెళ్లిపోయారు. అలాగే టిక్కెట్ దక్కని వారు తమకెందుకంటూ పక్కకు వెళ్లిపోయారు. దీంతో ఇటీవల పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలను కూడా ఎవరూ నిర్వహించలేదు. దీంతో పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కానీ కరోనా కారణంగా నేతలు చూపుతున్నప్పటికీ ఇక్కడ టీడీపీ కోలుకోవడం కష్టమే.

Tags:    

Similar News