టీడీపీలో ఈ నేత ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడే?

గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి అనంత‌రం కృష్ణా టీడీపీలో ప‌లువురు నేత‌లు నిస్తేజ స్థితిలోకి వెళ్లిపోయారు. బొండా ఉమా లాంటి ఫైర్ బ్రాండ్లు కొద్ది రోజులు హ‌డావిడి చేసినా [more]

Update: 2021-01-13 03:30 GMT

గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి అనంత‌రం కృష్ణా టీడీపీలో ప‌లువురు నేత‌లు నిస్తేజ స్థితిలోకి వెళ్లిపోయారు. బొండా ఉమా లాంటి ఫైర్ బ్రాండ్లు కొద్ది రోజులు హ‌డావిడి చేసినా ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌డం లేదు.. నోరు పెగ‌ల్చనీయ‌డం లేదు. గెలిచిన వాళ్లలో ఎంపీ కేశినేని నాని ఉన్నా ఆయ‌న పార్టీలోనే పెద్ద అస‌మ్మతి ర‌గుల్చుతుంటారు. ఇక తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ ఎప్పుడూ పెద్దగా మాట్లాడేందుకు ఇష్టప‌డ‌రు. ఆయ‌న అధికారంలో ఉన్నా, ప్రతిప‌క్షంలో ఉన్నా విమ‌ర్శ చేసేందుకు ఇబ్బందిగా ఫీల‌వుతారు.

తక్కువ సమయంలోనే…..

ఇక పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు అధికారం చ‌క్కగా ఎంజాయ్ చేసిన వాళ్లు, దోచుకుని దాచుకున్న వాళ్లు ఇప్పుడు సెలెంట్ అయిపోతున్నారు. ఎవ‌రికి వాళ్లు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ కాడి కింద ప‌డేశారు. దీంతో కంచుకోట అయిన కృష్ణా జిల్లాలో టీడీపీ ప‌రిస్థితి చుక్కాలేని నావ మాదిరిగా మారింది. అయితే పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పార్టీ కేడ‌ర్‌కు నిరంత‌రం ట‌చ్‌లో ఉంటూ నియోజ‌క‌వ‌ర్గంపై త‌క్కువ స‌మ‌యంలోనే గ్రిప్ తెచ్చుకోవ‌డం విశేషం.

కాల్ మనీ ఆరోపణలొచ్చినా….

పార్టీ అధికారంలో ఉండ‌గా బోడే ప్రసాద్ పై కాల్‌మ‌నీ లాంటి ఆరోప‌ణ‌లు వ‌చ్చినా నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి విష‌యంలోనూ, పార్టీ కేడ‌ర్‌కు అందుబాటులో ఉండే విష‌యంలో మంచి మార్కులే వేయించుకున్నారు. పెన‌మ‌లూరు బీసీ + క‌మ్మ ఈక్వేష‌న్‌లో టీడీపీకి కుంచుకోట‌గానే ఉండేది. జ‌గ‌న్ ప్రభంజ‌నంలో ఈ కోట కూలి వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి పార్థసారథి గెలిచారు. చివ‌ర‌కు పార్టీ యువ‌నేత లోకేష్ సైతం ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌నుకున్నారంటే పార్టీ ఇక్కడ ఎంత స్ట్రాంగో ఊహించుకోవ‌చ్చు.

ఆయన వీక్ కావడంతో…

అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచిన యేడాదిన్నర‌కే మాజీ మంత్రి పార్థసార‌థి రాజ‌కీయం తేలిపోయింది. 2009లో పెన‌మ‌లూరులో గెలిచి మంత్రి అయిన‌ప్పుడు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాన్ని ఉరుకులు ప‌రుగులు పెట్టించేవారు. సార‌థి అంటేనే పెన‌మ‌లూరులోనే కాకుండా, జిల్లాలోనే హ‌డ‌ల్ అన్నట్టుగా ఉండేది. అలాంటి సార‌థి ఇప్పుడు రాజ‌కీయంగా యాక్టివ్‌గా ఉండేందుకు ఆస‌క్తితో ఉన్నట్టు క‌నిపించ‌డం లేదు. కార‌ణాలు ఏవైనా కావొచ్చు ఆయ‌న పార్టీలో నిరాశ‌క్తతో ఉన్నార‌న్నదే వాస్త‌వం.

ీసీనియర్ నేతగా ఉన్నా….

సీనియ‌ర్ నేత‌గా ఉండ‌డంతో పాటు ముగ్గురు ముఖ్యమంత్రుల ద‌గ్గర మంత్రిగా ప‌నిచేసి.. కృష్ణా జిల్లా రాజ‌కీయాల‌ను ఒంటి చేత్తో తిప్పిన సార‌థి ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాన్నే ముందుకు న‌డిపించ‌లేని ప‌రిస్థితి. ఆయ‌న ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న మంత్రి ప‌ద‌విని జ‌గ‌న్ ఇవ్వలేదు.. ఇక‌పై ఇస్తార‌న్న ఆశ కూడా లేదు. బీసీ కోటాలో ( బ‌ల‌మైన యాదవ వ‌ర్గం) ఆయ‌న మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్నా అనిల్ కుమార్ ఇదే వ‌ర్గంలో దూకుడుగా ఉండ‌డంతో పాటు స్టైట్ వైడ్‌గా సామాజిక వ‌ర్గంలో దూసుకు పోతున్నాడు. ఇదే సార‌థి ఆశ‌ల‌ను కూల్చేస్తోంది.

ఇచ్చిన హామీలను కూడా…

మంత్రి ప‌ద‌వి ఆశ పోవ‌డం ఒక‌టి అయితే.. క‌నీసం నియోజ‌క‌వ‌ర్గానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీలు కూడా ఆయ‌న నెర‌వేర్చలేక‌పోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మిన‌హా చెప్పుకోద‌గ్గ ప‌నులు జ‌ర‌గ‌లేదు. పైగా విజ‌య‌వాడ న‌గ‌రాన్ని ఆనుకుని ఉన్న పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో లెక్క‌కు మిక్కిలిగా స‌మ‌స్యలు ఉన్నా వాటిని ప‌రిష్కరించే ప్లానింగ్ కూడా సార‌థి చేయ‌ట్లేద‌ని వైసీపీ వ‌ర్గాలే అంటున్నాయి.

ఇలనే కంటిన్యూ చేస్తే…..

ఇక నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌కు అందుబాటులో లేక‌పోవ‌డంతో పాటు హైద‌రాబాద్‌లోనే ఎక్కువ ఉంటున్నార‌న్న టాక్ కూడా నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా వినిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌ను టీడీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చ‌క్కగా వాడేసుకుంటున్నారు. ఆయ‌న స్థానికంగా ఉండ‌డంతో పాటు అటు నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌కు, ఇటు పార్టీ కేడ‌ర్‌కు అందుబాటులో ఉంటున్నారు. ఇవ‌న్నీ ఇప్పుడు న్యూట్రల్ జ‌నాలు మ‌ళ్లీ బోడే ప్రసాద్ వైపు చూసేందుకు దోహ‌దం చేస్తున్నాయి. బోడే ప్రసాద్ ఈ ఊపు కంటిన్యూ చేస్తే సార‌థికి షాక్ త‌గిలే రోజులు ఎంతో దూరంలో లేవు.

Tags:    

Similar News