బోడే భయపడుతుందంతా?

ఆయ‌న యువ నాయ‌కుడు. ఓడిపోయినా.. ప్రజ‌ల మ‌ధ్యకు వెళ్లి.. “న‌న్ను ఎందుకు ఓడించార‌మ్మా.. నేనేం ద్రోహం చేశాను?“ అని ప్రశ్నించే ధైర్యం ఉన్న నాయ‌కుడు. ఎలాంటి విష‌యాన్నయినా.. [more]

Update: 2019-10-03 11:00 GMT

ఆయ‌న యువ నాయ‌కుడు. ఓడిపోయినా.. ప్రజ‌ల మ‌ధ్యకు వెళ్లి.. “న‌న్ను ఎందుకు ఓడించార‌మ్మా.. నేనేం ద్రోహం చేశాను?“ అని ప్రశ్నించే ధైర్యం ఉన్న నాయ‌కుడు. ఎలాంటి విష‌యాన్నయినా.. మొహ‌మాటం లేకుండా మాట్లాడేసే నేత‌. యువ గొంతుకే అయినా.. కంచుకంఠంతో విమ‌ర్శలు చేయ‌గ‌ల దిట్ట. ఆయ‌నే 2014 ఎన్నిక‌ల్లో కృష్ణాజిల్లా పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన బోడే ప్రసాద్‌. నిజానికి తొలి సారి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించినా.. అపార అనుభ‌వం ఉన్న నాయ‌కుడిగా బోడే ప్రసాద్‌ విప‌క్షం వైసీపీపై విమ‌ర్శలు చేసేవారు.

అధికారంలో ఉండగా….

ముఖ్యంగా కీల‌క నాయ‌కులు రోజా… చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జ‌గ‌న్‌పై బోడే ప్రసాద్‌ తీవ్రమైన విమ‌ర్శలు చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఓ సంద‌ర్భంలో రోజానైతే.. విజ‌య‌వాడ‌లో అడుగు పెడితే.. గుండుకొట్టించి గాడిద‌పై ఊరేగిస్తా న‌ని వ్యాఖ్యానించి రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించారు. ఇక‌, చెవిరెడ్డినైతే.. రెండు చెవులూ తెగ్గోసి.. స్కూలుకు పంపిస్తా.. అంటూ రెచ్చిపోయారు. జ‌గ‌న్ జైలును పాలించాల్సిందే.. అంటూ బోడే ప్రసాద్‌ వ్యాఖ్యలు సంధించారు. మ‌రి అంత‌టి ఊపు, ఉత్సాహం. తెగువ ఉన్న బోడే ప్రసాద్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్క‌డ ఉన్నారు? పార్టీ కార్యక్రమాల్లో క‌నిపిస్తున్నారా? చ‌ంద్రబాబుకు అనుంగు శిష్యుడిన‌ని చెప్పుకొనే బోడే ప్రసాద్‌ ఏలా ఉన్నారు?

ఫోన్ కూడా ఎత్తకుండా….

ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చిన ప్రశ్నలు ఇవే. దీనికి కూడా రీజ‌న్ ఉంది. పార్టీ త‌ర‌ఫున కొత్త గొంతుక‌, క‌ఠినంగా వినిపించే గొంతుక కావాల‌ని ఓ వారం కింద‌ట చంద్రబాబు సెల‌విచ్చారు. పాడిందే పాట అన్నట్టుగా ఎంత‌సేపూ.. య‌న‌మ‌ల‌, వ‌ర్ల, అనురాధ వీరేనా.. క‌నిపించేది.. కొత్త క‌త్తుల‌కు ప‌దును పెట్టండి ! అని ఆదేశించారు. దీంతో అంద‌రి ఫోన్లూ.. ఒక్క‌సారి బోడే ప్రసాద్ సెల్ ఫోన్‌పై మోగాయి. అయితే.. ఆయ‌న వాటిని ముట్టుకుంటేనా? ఫోన్ లిఫ్టు చేస్తేనా? అంతా సైలెంట్‌!! ఇప్పుడు సారు మౌనంలో ఉన్నారు.. అంటూ.. పీఏ జ‌వాబు. దీంతో పార్టీలో ఒక్కటే చ‌ర్చ.

పాత కేసులు తిరగదోడతారని……

అసలు బోడేకు ఏమైంది? అని. దీనికి ఒక్కటే జ‌వాబు.. తాను నోరు విప్పితే.. చింత‌మ‌నేనికి ప‌ట్టిన గ‌తి ఖాయ‌మ‌ని అనుకుంటున్నార‌ట‌.. బోడే ప్రసాద్‌. అందుకే ఇప్పుడు జెండా ప‌ట్టుకునేందుకు, చంద్రబాబుకు జై కొట్టేందుకు కూడా సాహ‌సించ‌లేక పోతున్నారు. పాత కేసులు తొడి కొత్త సెక్షన్ల కింద జ‌మ‌క‌డితే.,. త‌న ప‌రిస్థితి శ్రీకృష్ణ జ‌న్మస్థాన‌మేన‌ని అనుచ‌రుల‌తో చెప్పుకొని బాధ‌ప‌డుతున్నార‌ట‌. బోడే ప్రసాద్‌ అధికారంలో ఉండ‌గా దూకుడుగా ముందుకు వెళ్లడంతో ఆయ‌న‌పై కేసులు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆయ‌న దూకుడు పాలిటిక్స్ చేస్తే వైసీపీ వాటిని తిర‌గ‌దోడేందుకు రెడీగా ఉంది. ఇదీ, వెయ్యి గొడ్లు తిన్నాన‌ని చెప్పుకొన్న రాబందు ప‌రిస్థితి!! చిత్రంగా లేదూ!!

Tags:    

Similar News