నడ్డా సంతకం చేయడానికే పనికొస్తున్నారా?

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కేవలం అలంకార ప్రాయంగా మారారు. ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాలను మొత్తం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే [more]

Update: 2020-07-03 18:29 GMT

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కేవలం అలంకార ప్రాయంగా మారారు. ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాలను మొత్తం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే చూసుకుంటున్నారు. కేవలంఉత్సవ విగ్రహంలా జేపీ నడ్డా ఉన్నారన్నది వాస్తవం. 2014 ఎన్నికల్లో కేంద్రలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీని మోదీ, అమిత్ షాలే శాసిస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికల జరిగినా ప్రచారం నుంచి అభ్యర్థుల ఎంపిక వరకూ వీరిద్దరిదే ఫైనల్.

షా తప్పుకున్న తర్వాత…..

అయితే అమిత్ షా కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలను నిర్వహిస్తుండటం, అధ్యక్ష పదవీ కాలం పూర్తి కావడంతో ఆ స్థానంలో తమకు అత్యంత నమ్మకస్థుడైన జేపీ నడ్డాను ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. నడ్డా పేరు ఖరారయినప్పుడే ఆయన ఉత్సవ విగ్రహమన్నది అందరికీ తెలిసిందే. బీజేపీ నిబంధనల ప్రకారం అమిత్ షా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి రావడంతోనే విశ్వాస పాత్రుడైన జేపీ నడ్డాకు పట్టాభిషేకం చేశారన్నది వాస్తవం.

కీలక నిర్ణయాల్లో…..

కానీ ముఖ్యమైన నిర్ణయాల్లో జేపీ నడ్డా పాత్ర ఏమీలేదన్నది పార్టీలో విన్పిస్తున్న టాక్. ముఖ్యమైన నిర్ణయాలను ఇప్పటికీ అమిత్ షాయే తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో కూడా జేపీ నడ్డా ప్రమేయం ఏమీ లేదని చెబుతున్నారు. ముఖ్యంగా కర్ణాటకలో బీజేపీ అభ్యర్థుల ఎంపికను స్వయంగా అమిత్ షా చూశారట. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్ అభ్యర్థుల ఎంపిక కూడా అమిత్ షా చేతుల మీదుగానే జరిగింది. నడ్డా కేవలం సంతకం పెట్టడానికే పరిమితమయ్యారు.

అభ్యర్థుల ఎంపిక కూడా….

త్వరలో జరగబోయే బీహార్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను కూడా బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధానంగా బీహార్ లో సీట్ల పంపకంపై కూడా అమిత్ షా దగ్గరుండి చూస్తున్నారు. ప్రచార వ్యూహాన్ని కూడా ఆయనే రచిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ స్ట్రాటజీని కూడా అమిత్ షా నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఈ రెండు రాష్ట్రాల్లో పాగా వేయాలన్నది అమిత్ షా, మోదీ వ్యూహంగా ఉంది. దీంతో జేపీ నడ్డా కేవలం అలంకార ప్రాయంగా మిగిలారు.

Tags:    

Similar News