కలవరపెడుతున్న కాషాయ రాజకీయం

ఎన్నికలు అన్నవి ప్రజాస్వామ్యంలో ఓ ప్రక్రియ. వాటి ద్వారా అధికారాన్ని సంపాదించిన పాలకులు ప్రజలకు మేలు చేయడం ముఖ్యమైన బాధ్యత. అయితే ఇపుడున్న పరిస్థితులు చూస్తే ఒక [more]

Update: 2019-07-22 18:29 GMT

ఎన్నికలు అన్నవి ప్రజాస్వామ్యంలో ఓ ప్రక్రియ. వాటి ద్వారా అధికారాన్ని సంపాదించిన పాలకులు ప్రజలకు మేలు చేయడం ముఖ్యమైన బాధ్యత. అయితే ఇపుడున్న పరిస్థితులు చూస్తే ఒక ఎన్నికతో దాహం తీరడం లేదు. గెలిచిన వారు నెక్స్ట్ టార్గెట్లు పెట్టుకుంటే, ఓడిన వారు ఎటూ మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. దాంతో రాజకీయమే పరమావధిగా మారుతోంది. కేంద్రంలో నరేంద్ర మోడీ రెండవమారు బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అయిదేళ్ళకు సరిపడా హామీలు ఇచ్చిన మోడీ వాటిని నెరవేరుస్తారని కోటి ఆశలతో వందన్నర కోట్ల భారతం ఎదురుచూస్తోంది. అయితే మోడీ, అమిత్ షా ఎత్తులు జిత్తులు వేరేగా ఉన్నాయి. దాంతో అనేక ప్రతిపక్ష రాష్ట్రాల్లో రాజకీయ అశాంతి చెలరేగుతోంది.

కర్ణాటకతో మొదలు….

అందరూ వూహిస్తున్నట్లుగానే కర్నాటకలో బీజేపీ రాజకీయ నాటకానికి శ్రీకారం చుట్టింది. అక్కడ కుమార స్వామి సర్కార్ ని ఇంటికి పంపించి తాము గద్దె మీద కూర్చోవాలన్నది బీజేపీ ప్లాన్. ఆ దిశగా ఇపుడు వ్యూహాలు సాగుతున్నాయి. రాజ్ భవన్ లో గవర్నర్ వాజ్ బాయ్ బీజేపీ మనిషి. మెజారిటీ ఎంపీలు ఆ రాష్ట్రంలో బీజేపీకి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దన్నుగా ఉంది. దాంతో ఉన్న ప్రభుత్వం నడ్డి విరిచి తాము ఏలికలు కావాలన్న కసితో అశ్వమేధ యాగాన్ని బీజేపీ మొదలెట్టింది.

బెదురుతున్న విపక్ష రాజకీయం…..

కర్ణాటకలో వారాల తరబడి సాగుతున్న క్యాంప్ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూంటే మూడు నెలల క్రితం వరకూ రెచ్చిపోయిన ప్రతిపక్షాల గొంతు మాత్రం ఇపుడు ఎక్కడా పెగలడంలేదు. ఎందుకంటే వారంతా పరాజయ గాయలపాలైన వారే. ఇక మధ్యప్రదేశ్ లో కూడా కర్నాటక ఫార్ములాతో బీజేపీ పావులు వేగంగా కదుపుతోంది. అక్కడ కేవలం అయిదు మంది మాత్రమే బీజేపీ కంటే కాంగ్రెస్ పక్షాన ఎక్కువగా గెలిచారు. కర్నాటకం తరువాత మధ్యప్రదేశ్ కధ మొదలవుతుందన్న మాట. దాని తరువాత రాజస్థాన్ అంటున్నారు. మరో వైపు తెలంగాణాలో కూడా అవకాశాలు ఏమైనా ఉంటే వెతకాలని బీజేపీ డిసైడ్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఇక ఏపీలో జగన్ సర్కార్ ఏడాది పాలన వరకూ చూసి అపుడు ఇక్కడ కూడా ఆపరేషన్ స్టార్ట్ చేయాలన్నది బీజేపీ నయా వ్యూహంగా ఉంది. ఇవన్నీ చూస్తూంటే రాజకీయమే తప్ప పాలన నేను చేయను, మిమ్మల్ని చేయనివ్వను అంటూ ప్రతిపక్షాలతో కాషాయం పార్టీ గట్టి శపధమే చేసినట్లుగా కనిపిస్తోనంది.

Tags:    

Similar News