జనసేనకు జెల్ల కొడుతుందా?

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికపై బీజేపీ ప్రత్యేక వ్యూహంతో వెళుతుంది. జనసేన ఎటూ పోటీ చేయదని భావించిన బీజేపీ తిరుపతి ఉప ఎన్నికల కోసం ముందస్తు ఏర్పాట్లు [more]

Update: 2020-12-18 14:30 GMT

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికపై బీజేపీ ప్రత్యేక వ్యూహంతో వెళుతుంది. జనసేన ఎటూ పోటీ చేయదని భావించిన బీజేపీ తిరుపతి ఉప ఎన్నికల కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటుంది. తిరుపతి పార్లమెంటుకు ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంకా నోటిఫికేషన్ విడుదల కాకపోయినా అప్పుడే తిరుపతి ఎన్నికపై రాజకీయ పార్టీల్లో హీట్ పెరిగింది. టీడీపీ ఇప్పటికే తమ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని ప్రకటించింది. ఆమె ప్రచారంలోకి కూడా దిగారు.

ముందస్తు ఏర్పాట్లు….

ఇక బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తాయని ఆ రెండు పార్టీలూ సంయుక్త ప్రకటన చేశాయి. దీనిపై సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఎవరు పోట ీచేయాలన్నది సమన్వయ కమిటి నిర్ణయిస్తుంది. అయితే బీజేపీ తాను పోటీ చేసేందుకే సిద్ధమయినట్లు ఆ పార్టీ చేస్తున్న ముందస్తున్న ఏర్పాట్లను చూస్తే అర్ధమవుతుంది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో బలం లేకపోయినా తానే పోటీ చేయాలని బీజేపీ భావిస్తుంది.

పార్లమెంటు ఎన్నిక కావడంతో…

ఇందుకు కారణం ఇది పార్లమెంటు ఎన్నిక కావడమే. పార్లమెంటు ఎన్నికల్లో సహజంగా మోదీ ఇమేజ్ పనిచేస్తుంది. అన్ని రాష్ట్రాల్లో ఇదే జరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో కూడా అధికారంలో ఉండటంతో ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక కావడంతో తమకే అవకాశం ఇవ్వాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. దీనికి పవన్ కల్యాణ్ కూడా జనసేన నుంచి పెద్దగా అభ్యంతరం చెప్పే అవకాశం ఉండదు.

ఇప్పటికే ఇన్ ఛార్జులను….

అందుకే బీజేపీ తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో ముందస్తు ఏర్పాట్లలో మునిగిపోయింది. మొత్తం 45 మండలాలకు ఇన్ ఛార్జిలను నియమించింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న 45 మండలాలకు రాష్ట్ర స్థాయి నేతలను ఇన్ ఛార్జిలుగా నియమించారు. వీరందరూ ఇప్పటికే తమ మండల పరిధిలోని బూత్ లెవెల్ కమిటీలతో సమావేశమవుతున్నారు. బీజేపీ బరిలోకి దిగితే తమ పార్టీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులును నియమించే అవకాశముంది. ఆయన కాదంటే రావెల కిషోర్ బాబుకు అవకాశమిస్తారంటున్నారు. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఇప్పటి నుంచే బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది.

Tags:    

Similar News