పవన్ పై అనుమానాలే అవమానాలకు కారణమా?

తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధం అయిన జనసేన ఉన్నట్టుండి వెనక్కి తగ్గింది. 60 స్థానాల్లో పోటీకి రెడీ అయిన అభ్యర్థులు సేనాని ఆదేశాలతో వెనక్కి [more]

Update: 2020-12-13 03:30 GMT

తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధం అయిన జనసేన ఉన్నట్టుండి వెనక్కి తగ్గింది. 60 స్థానాల్లో పోటీకి రెడీ అయిన అభ్యర్థులు సేనాని ఆదేశాలతో వెనక్కి తగ్గి నిరాశపడ్డారు. అక్కడ పోటీ నుంచి తప్పుకున్నందుకు తిరుపతి పార్లమెంట్ స్థానం తమకే కేటాయించాలని పవన్ కళ్యాణ్ బిజెపి అధిష్టానం పై వత్తిడి పెంచారు. దీనిపై కమలం వ్యూహాత్మకంగా వ్యవహారం నడిపింది. మీరు వెళ్ళి పని చూసుకోండి ఎవరు పోటీ అన్నది కమిటీ వేసి తేలుద్దాం అని బుజ్జగించింది. దాంతో పట్టు వీడి పవన్ కల్యాణ్ బెట్టు దిగక తప్పలేదు.

ఆశలపై నీళ్ళు చల్లేసిన వీర్రాజు …

కమిటీ ఎవరు పోటీ చేయాలనేది ఇంకా తేల్చకుండానే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతి ర్యాలీలో చేసిన వ్యాఖ్యలు జనసేన ఆశలపై నీళ్ళు చల్లేశాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన బలపరిచిన బిజెపి అభ్యర్థిని గెలిపించాలని సోము వీర్రాజు వ్యాఖ్యానించి వేడి పుట్టించారు. ఇందుకు సంబంధించి అధిష్టానం నుంచి తమకు సంకేతాలు అందాయని కూడా ఆయన పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో జనసేన కు తెలంగాణ లోను ఆంధ్రా లో కూడా జెల్ల కొట్టింది కమలం. జనసేన లెక్క లేకుండానే తెలంగాణ లో ఎలా వ్యవహరించారో తిరుపతి పై కూడా అదే రీతిన బిజెపి తన వ్యూహాన్ని తమ పార్టీకి అనుకూలంగా చేసుకోవడం విశేషం.

పవన్ తొందరపాటే … ?

పవన్ కళ్యాణ్ తొందరపాటు నిర్ణయాలే పార్టీకి ఈ దుస్థితిని తెచ్చి పెట్టాయా అన్న చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తుంది. ఎవరు అడక్కుండానే 2014 లో బిజెపి – టిడిపి తో కలిసి పని చేస్తామన్నారు పవన్ కల్యాణ్. ఆ తరువాత 2019 ఎన్నికల్లో ఆ పార్టీలకు దూరమై కామ్రేడ్ లు బీఎస్పీ లతో కలిసి పోటీకి దిగి ఖంగుతిన్నారు. ఇక్కడితో ఆయన కప్పల తక్కెడ నిర్ణయాలు ఆగలేదు. సార్వత్రిక ఎన్నికలకు చాలా సమయం ఉంది. తన పార్టీని క్షేత్ర స్థాయిలో నిర్మాణం పక్కన పెట్టి అమరావతి లో రాజధాని ఉండేందుకు బిజెపి తో పొత్తు పెట్టుకుంటున్నా అంటూ ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ తో జట్టుకట్టారు పవన్ కల్యాణ్.

అనుమానమేనా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. బిజెపి కి మించి గత ఎన్నికల్లో ఓట్లు కూడా పడ్డాయి. అయినా కానీ ఆయనకు తగిన గౌరవం పొత్తు సందర్భంగా కమలం నేతలు ఇవ్వలేదు. కనీసం మోడీ సైతం పవన్ కి అపాయింట్ మెంట్ నాడు ఇవ్వనే లేదు. ఇప్పుడు తిరుపతి లో సైతం జనసేనకు చేదు అనుభవమే ఎదురైంది. అడక్కుండా వచ్చి పొత్తు అన్న పవన్ కల్యాణ్ పై బిజెపి కి ఉన్న అనేక అనుమానాల రీత్యానే ఇవ్వన్నీ జరుగుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో కమలం టీ గ్లాస్ బంధం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News